మళ్లీ నాగురించే

పొద్దున్నే, లచ్చిమి నీగురించి చెప్పూ అని అడుగుతోంది. మరిపాపం ఆపిల్ల పుట్టకముందే నేను రాయడం మొదలు పెట్టేను కదా. అంచేత మళ్లీ చెపుతున్నా. చాలామందికి తెలిసిన సంగతులే. హీహీహీ.

మరో అసలు నిజం కారణం లక్ష్మీకాన్తమ్మగారి మీద రాసిన వ్యాసం నలుగురికళ్లా పడలేదేమోనని అనుమానంగా వుంది. అంచేత ఇది టెస్టు డ్రైవు కూడా.

వ్యాఖ్యలు చూసి సవరించబడింది 🙂

000

సరే మళ్లీ చెపతా

మరోసారి నాగురించి.

పేరు మాలతి

ఇంటిపేరు నిడదవోలు.

కన్ఫ్యూజనవకండి మరే మాలతితోనూ

పుట్టింది ఇసాపట్టనంలో

పబ్బము గడుపుకుంటున్నది విస్కాన్సిను లో.

వయసు చెపితే ఝడుసుకుంటారేమో

వున్నాయి డెబ్భైకి పైనే

నాకుంది ఒక అమ్మాయి

పేరు సరయు, వృత్తి -హాలివుడ్ తార

పోతే

నారాతలు నాకాలక్షేపం,

కంప్యూటరు నా నేస్తం

కీబోర్డే నా సమస్తం

ప్రింటరు స్థిరాస్తి

ఫ్లాష్ డ్రైవు చరాస్తి

టీవీ ఇష్టసఖి

ఇష్టమొచ్చినపుడు

ఇష్టమయినవి తినడం నా సరదా

ఇష్టమొచ్చినట్టు తిరగడం మరో సరదా

దేవుడు బొత్తిగా లేడనను కానీ

he is minding his business

and I am minding mine.

I think I missed the common ground

somewhere along the way.

వ్యసనాల్లేవనుకోడం నా వ్యసనం

చేస్తుంది నా మొహం నిండా మోసం

నాగూట్లో నేను

ముడుచుకు పడుకోడమే

నాకు పరమానందం.

నామటుకు నాకు అదే పరమయోగసారం.

(ఫస్టోబరు 2008. )

(నోటు-  ఫస్టోబరు అన్నపదం ఆరుద్ర సృష్టించింది )

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

26 thoughts on “మళ్లీ నాగురించే”

 1. లచ్చిమి, హా, ఇంతవరకూ చూడలేదా, :(. చాకిరొకిదీ చాకలెట్టులోకరివీ ..హీహీహీ
  సుజాతా, అలాగా. నేనింకా మీఅమ్మాయికి కాంపిటీసనని బాధపడిపోతున్నావేమో అనుకున్నా..
  సౌమ్యా. నేను నా వయసు దాచడంలేదు. మనవాళ్లెవరూ ఒప్పుకోడంలేదు. ఏంచెయ్యనూ, నాఖర్మ అనుకుని వూరుకోడమే… 🙂

  మెచ్చుకోండి

 2. మాలతి గారు, ఒకటో తారీకునే వూరికెళ్ళిపోవడంతో రెండో తారీకున పెట్టిన ఈ పోస్టు నేను చూళ్ళేదు. లచిమి భలే పని చేసింది!

  నేనూ నిషిగంధ లాగే కోరుకుంటా..దేవుడిని!
  డెబ్భై దాటాక నేను మాలతి గారంత ఉషారుగా ఉండేలా చెయ్యరా బాబూ అని
  మీ ఇష్టాలు నాకు భలేగా నచ్చాయి!

  మెచ్చుకోండి

 3. మీరిన్నాళ్ళు ఇందరివద్ద వయసును దాచేసారన్నమాట ఐతే 😉
  >>ఇహ నానయసు గురించి అనుమానించినవారందరికీ – నాకూ అనుమానమే. మాతాతగగారు పొరపాటున 1973 అని రాయబోయి 1937 అని రాసేరేమోనని.
  – :))))

  మెచ్చుకోండి

 4. అ నుండి క్ష వరకూ అందరికీ పేరు పేరునా వ్యాఖ్యాతలకీ ఇంకా పాఠకులకీ అందరికీ మరోసారి కృతజ్ఢతలు.
  సిరిసిరిమువ్వ – అయ్యో తప్పు నాదే. చమించేయండి. ఏంటో 70% తలకెకక్కుతుంది నాకు ఏదైనా ..
  నిషీ . నాకంటే రెట్టింపు చురుగ్గా వుంటారు మీరందరూ. ఫర్లే..
  రమణి – మీఅబ్బాయిమీద ఆశ వదిలేసుకున్నా, సుజాతగారి సంకీర్తనతో నేనెక్కడ పోటీ పడగలను.. లేదు, సరయు తెలుగువేషాలు వెయ్యదు (రెండర్ధాలలోనూ.). మీ విషెస్ తప్పకుండా అందజేస్తా. దానితరఫున మీకు థాంక్స్.
  ఇహ నానయసు గురించి అనుమానించినవారందరికీ – నాకూ అనుమానమే. మాతాతగగారు పొరపాటున 1973 అని రాయబోయి 1937 అని రాసేరేమోనని.
  అసలు మీరందరూ అబ్బో పెద్దావిడే, డెబ్భైకి పైనే వుంటాయని ఎవర్ని గురించి అన్నా, నేను భుజాలు తడుముకుంటాను. అంచేత రాసేను.. :p.
  ఇంక ఇక్కడితో ఈ సంవాదం సమాప్తం. రేపు కొత్త కథ పెడతాను. చదువుకుందురు గానీ…
  టా టా …

  మెచ్చుకోండి

 5. రాజేంద్ర, మాలతి గారు, మీరిద్దరూ నన్ను అర్థం చేసుకోలే…….. 😦 వా……..
  మరి మీ అసలూరు ఇసాపట్నవని సెప్పనేదు ??..అన్న రాజేంద్ర గారి సందేహానికి పుట్టింది ఇసాపట్నంలో అని చెప్పారు కదా! అని నేను చెప్పానన్నమాట అంటే మాలతి గారు ఇసాపట్నంలో పుట్టానని చెప్పారు కదా అని. అర్థం చేసుకోరూ!!!

  మెచ్చుకోండి

 6. మీ గురించి చదువుతుంటే చాలా చాలా చాలా హాశ్చర్యంగా ఉంది. నిజమేనా మాలతి గారు మీకు 70 యేళ్ళా? ఎవిటో పరాయి దేశంలో ఉన్నారు కాబట్టి మీకు తెలియడం లేదు కాని ష్! మనలో మన మాట ఎవరితో అనకండీ.మీరలా మీ వయసు అంత నిక్కచ్చిగా చెప్పేయడం నాకు నచ్చలేదు ఎవరన్నా అడిగితే అబ్బే! ఎంతా మొన్నేగా 30+ అని అనేయండి నాలా :))). ఇంకా నమ్మబుద్ధి కావడం లేదు. సరయు పేరు తెలుగులో కూడా విన్నాను. పాప తెలుగు మూవీల్లో కూడా?? మా అందరి విషెస్ అందజేయండి .. వయసు విషయం గుర్తుందిగా… గిన్నెలు, బట్టలు అని కష్టపడకండి. ప్చ్! 100 వ్యాఖ్య కోసం ఇంకా ఎదురుచూస్తున్నారా?

  మీ గురించి చదవగానే మటుకు చాలా హ్యాప్పీ అనిపించింది. వయసుతో పనేముందండి, మనసు మీలా ఎప్పటికి నిండు యవ్వనంతో తొణికిసలాడుతుంటే. అంతేనంటారా? మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొంటున్నాను నేను.

  మెచ్చుకోండి

 7. ప్రింటరు స్థిరాస్తి

  ఫ్లాష్ డ్రైవు చరాస్తి
  🙂
  ఇంకా మరిన్ని ఇలాగె రాస్తూ ఉండాలని కోరుకుంటున్నాను

  మెచ్చుకోండి

 8. భరాగో ఇసుక తోట లో ఉంటారు. అంటే అర్ధం అయింది. మీ తమ్ముడు ఉండేది, మా ఇంటి కి (అమ్మా వాళ్ళింటికి) సరిగ్గ వెనుక వీధి లోనే – ఇంకో హూరే !

  మెచ్చుకోండి

 9. రాజేంద్ర, సిరిసిరి మువ్వ – బాగుంది మీ వాదన.
  సిరిసిరిమువ్వ – విసాపట్నంలో పుట్టింది నేనూ, రాజేంద్ర కాదు.
  సుజాతా, నేనింకా మీకు చెప్పలేదు. మాతమ్ముడు యం.వి.పి.కాలనీలోనే వున్నది. కిందటిసారి వచ్చినప్పుడు భ.రా.గో. ఇంటికి నడిచి వెళ్లేం. అంచేత మనం అంత దగ్గర అన్నమాట. మరో హూరే…

  మెచ్చుకోండి

 10. సిరిసిరి మువ్వ గారు ఆ విషయం లొ అసలు అనుమానం పెట్టుకోకండి,మా అబ్బాయి నువ్వు ఇక్కడే పుట్టావురా అన్నా వినట్లా.కాదు పొన్నూరు లో అంటాడు.మనలో మనమాట ఇక్కడ పొన్నూరు అంటే పొరుగూరు అని.ఇంకో మనలో మాట ఆలివైపు వారు ఆత్మబంధువులు అన్నారు కదండి అందుకని ఇసాపట్నం కాస్త ఎక్కువన్నమాట.
  ఇసాపట్నం లో పుట్టానని నేను ఎప్పుడు చెప్పానండి బాబు!!??

  మెచ్చుకోండి

 11. మీ వ్యాఖ్యానాలు చూస్తుంటే నా కళ్ల తడి. మీ అదరాభిమానాలే నా ఆరోగ్యం రహస్యం. మీరు ఇలా చెప్తున్నన్నాళ్లూ నేనిలా రాస్తూనే వుంటా మరి 🙂

  మెచ్చుకోండి

 12. “ప్రింటరు స్థిరాస్తి
  ఫ్లాష్ డ్రైవు చరాస్తి ”
  🙂 🙂

  నేనూ అస్సలు నమ్మను మీకు డెబ్బై అంటే.. ఒకవేళ నిజంగానే అది నిజమైతే నేను దేవుడిని ఒకటే కోరుకుంటాను, నేను డెబ్బై లోకి వచ్చేసరికి మీ ఉత్సాహం, చలాకీతనంలో సగమన్నా నాకుండేలా చేయమని!

  మెచ్చుకోండి

 13. 🙂
  he is minding his business and I am minding mine, ……well said.
  @రాజేంద్ర, పుట్టింది ఇసాపట్టనంలో అని చెప్పారు కదా!. అసలింతకీ మీరు గుంటోరోళ్లా, ఇసాపట్నమోళ్లా ముందు తేల్చండి. “గోపి”లాంటోడ్ని అంటారా!!!

  మెచ్చుకోండి

 14. అడిగింది లచ్చిమి అయిన నేను కూడా చాలా కాలం నుంచి మీ గురించి తెలుసుకోవాలి అనుకున్నా కాని అడగ లేకపోయా. లచ్చిమికి నెనరులు, మీకు నమస్సులు.

  మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s