ఊసుపోక 29 – టెనిస్ చూడ్డం ఓ తమాషా

(ఎన్నెమ్మ కతలు 29)

ప్రస్తుతం ఆస్ట్రేలియన్ ఓపెన్ .. ఆస్ట్రేలియాలో పగలు ఆడినవి మాకు పగలు మళ్లీ కొత్తగా చూపుతారు. నేను నాలుగ్గంటలకే లేస్తాను కనక చివరి నాలుగు సెట్లు ఆడుతున్నప్పుడే (అంటే వాళ్ల రాత్రివేళ) చూస్తాను. మళ్లీ మధ్యాన్నం టీవీ పెడితే తెలిసింది అది నేను అంతకుముందే చూసేశానని. అలా చూస్తున్నప్పుడు ఎవరు గెలుస్తారో ముందే తెలుసు కనక అట్టే సరదాగా వుండదు.

అలాటప్పుడే ఆటమీద దృష్టి తగ్గి చిరాకు కలిగించే విషయాలు ఎక్కువ కనిపిస్తాయి. అవి మీతో పంచుకోడమే ఈ వ్యాసం ధ్యేయం. ఇది మీకు చిరాకు అనుకుంటే ఇది చదవడం ఆపేసి, టీవీలో రీరన్లు చూసుకోండి. L

నేను అసలు చూడ్డమే కాదు టెనిస్ ఆడేను కూడా ఒక వారం రోజులు. మాకు ఇక్కడ యూనివర్సిటీలో వేసవి సలవుల్లో ఫిజికల్ ఎడ్ అమ్మాయిలు నామమాత్రం ఫీజుకి టెనిస్ నేర్పుతారు. అలాటప్పుడు అన్నమాట నేను వెళ్లేను. నేను తప్ప అందరూ పాతికేళ్ల లోపువాళ్లు.

వాళ్లు నామొహం చూసి ఏం అనుకున్నారో తెలీదు కానీ లాగి పుచ్చుకు బంతి బేస్ లైనుకి కొట్టేసరికి వావ్ అని గుమ్మయిపోయేరు.

గుడ్ షాట్, గ్రాంమా అంది నాపక్కనున్న చైనీస్ అమ్మాయి.

అదుగో అప్పుడే నాకు కోపం వచ్చింది. నానిజం వయసు (కేలండరు వయసూ, నిజం వయసూ ఒకటి కాదని ఓ టీవీ డాక్టరు చెప్పింది) నేను శాంతంగా, మాదేశంలో కూడా పెద్దవాళ్లని పేరు పెట్టి పిలవరు. ఇక్కడ చాలామంది నన్ను ఆంటీ అంటారు. మీదేశంలో గ్రాంమా అంటారా? అని అడిగేను.

అవును కానీ నువ్వు గ్రాంమావే అంది.

ఆతరవాత కొన్నాళ్లు బాడ్మింటను ఆడడానికి వెళ్లేను. అది వేరే కథ.

ఇంతకీ టెనిస్‌ (చాలామంది టెన్నిస్ అని రాస్తారు కానీ అది తప్పు. తెలుగు ఉచ్చారణననుసరించి రాతలు కదా. ఇంగ్లీషులో ద్విత్వాక్షరమే అయినా పలికినప్పుడు వత్తు పలకరు. అంచేత నేనే రైటు J ).

ఇంతకీ టెనిస్‌ టూర్నమెంటుల్లో నాకు అర్థం కానివి కొన్ని వున్నాయి. మొదటిది ఏస్ కొట్టినప్పుడు అది అయాచితంగా, ఆనాలోచితంగా జరుగుతుందా? లేక వ్యూహరచనలో భాగంగా ఏసులేస్తారా? ఎప్పుడో జ్ఞాపకం లేదు కానీ పీట్ సాంప్రాస్ వరసగా ఏసులు కొట్టి గేములు కొట్టేసిన సందర్భాలున్నాయి. నా అభిప్రాయంలో ఏసులు న్యాయం కాదు. ఏసుల్నిఇల్లీగల్ చెయ్యాలి. ఎందుకంటే ఏసు కొట్టినప్పుడు అవతలివాడు ఆడడానికేమీ లేదు. ఇది జెల్ల కొట్టి బిళ్లలు లాక్కోడంలాటిది. దీనికి మినహాయింపు వుండొచ్చు టైబ్రేకు జీడిబంకలా సాగుతున్నప్పుడు. రెండు ఏసులు కొట్టి ముగించేయరా బాబూ అని అరవాలనిపిస్తుంది నాకు.

రెండోది వ్యాఖ్యాతలు. చెప్పులో రాయి, చెవిలో జోరీగా చిట్టాలోకి ఎక్కవలసినవాళ్లు. నేను ఆటలు చూడ్డం మొదలు పెట్టినరోజుల్లో అసలు నాకు అర్థం అయేది కాదు ఎందుకలా వసపోసిన పిట్టల్లా వదలకుండా నస పెడతారో.

మామూలుగా ఇద్దరో ముగ్గురో వుంటారు. అందులో ఒకడు ఆపకుండా వాయించేస్తూంటాడు. వాలీ, రైటాన్ బేస్ లైన్, గ్రేట్ పాయింట్, ఏస్.. ఇలా వదరుతూనే వుంటాడు.

నాక్కూడా తెలుసులేవోయ్, నేనూ చూస్తున్నాను అనాలనిపిస్తుంది నాకు.

అంతకంటె పనికిమాలిన కామెంటులు, జోళ్లలేసులు ముడేసుకుంటున్నాడు, చొక్కా మార్చుకుంటున్నాడు లాటివి. కొన్నాళ్ల తరవాత నాకు మరో ఆలోచన వచ్చింది. బహుశా ఏ ఆఫీసుల్లోనో కూర్చుని ఆట చూసే యోగంలేక ఏరేడియోలోనో ఫాలో అవుతున్నవారి సౌకర్యార్థం చెబుతున్నారేమోనని. అదే నిజమయితే అది వేరే వేవ్‌లెంతులో ప్రసారం చెయ్యాలని నేను ప్రతిపాదిస్తున్నాను.

తరవాత కొన్నాళ్లు రెండో కామెంటేటరుకి ఆట తెలీదు కాబోలు, ఈయనగారు ఆయనకి టెనిస్ పాఠాలు చెబుతున్నారు కాబోలు అనుకున్నాను.

నాకు ఆట చూస్తున్నప్పుడు, కారు నడుపుతున్నప్పుడులాగే, పక్కవాళ్లు మాటాడుతూంటే తోచదు. నేను చూస్తూ నా అనందం నేను అనుభవించాలి. నాకు నేను వావ్ అనుకోవాలి కానీ పళ్లు లేనివాళ్లకి వక్కపలుకులు నమిలి ఇచ్చినట్టు నాబదులు మరొకరు వావ్‌లు పలకడం నచ్చదు.

పై కారణాలవల్ల షాట్‌గన్‌లా రిమోటు పుచ్చుకుని శబ్దం తగ్గించుకుంటూ వచ్చేను. కానీ అదీ బాధే. ఆటగాడు ఛాలెంజి చేసినప్పుడు, రిఫరీ ఏం అంటున్నాడో తెలీదు. ముఫ్పైలనాటి మూకీల్లా అంగన్యాస కరన్యాసాలు మాత్రమే చూసి ఆనందించాలి. లేదా అప్పుడు మళ్లీ శబ్దం హెచ్చించాలి. ఇలా అసలు కంటే కొసరు ఎక్కువ అన్నట్టు, రిమోటు ఆపరేషను పెద్ద డిస్ట్రాక్షను అయిపోతుంది.

ప్రస్తుతం నాకు మరో బాధ. రిమోటు చెడిపోయింది. అంచేత వాల్యూము హెచ్చుతగ్గులు చెయ్యాల్సినప్పుడల్లా, కప్పుకున్న శాలువా పక్కన పెట్టి, ముడుచుకున్న కాళ్లు సాగదీసి ఐదడుగులు వేసి టీవీ దగ్గరికెళ్లి వాల్యూము హెచ్చించో తగ్గించో మళ్లీ వచ్చి కూచోవాలన్నమాట. మరో రిమోటు కొనుక్కోవచ్చు కదా. టెన్ బక్స్ అంటూ కసురుకుంది మాఅమ్మాయి ఆమాట చెప్తే.

ఇక్కడే నాకున్న మరో దురలవాటు కూడా చెప్పేస్తాను మళ్లీ ఈమాట ఎత్తకుండా. ఏ వస్తువు చెడిపోయినా అది లేకుండా ఎన్నాళ్లు గడుపుకోగలనో ముందు నన్ను నేను పరీక్షించుకుంటాను. రెణ్ణెల్ల కిందట మైక్రోవేవు లేకుండా మూడువారాలు గడిచేయి. చూద్దాం.

పైగా ఇలా పదిసార్లు లేచీ, కూర్చునీ చేస్తే నా దినసరి వ్యాయామంలో పావుభాగం అయిపోతుంది కూడాను. Keep moving parts moving అన్నది నా ఆరోగ్యసూత్రం.

హో హో మాచ్ పాయింట్ … తరువాయి భాగం పైవారం. ..

(ఇంతే. ఇంక లేదు.)

(జనవరి 2009.)

(ఎన్నెమ్ కతలు 29)

నాకు ఆటలు సరదా. అంటే ఆడతానని కాదు. అలాగని అస్సలు ఆడలేదనుకోకండి. చిన్నప్పుడు బాడ్మింటను, వాలీబాలు కోర్టులెక్కేను నేను సైతం. అమెరికా వచ్చేక, అసలు వీధిలోకి వెళ్లడమే ఓ ఎడ్వెంచరు. అంటే చెయ్యలేదని కాదు.

నాకు ఆటలు సరదా. అంటే ఆడతానని కాదు. అలాగని అస్సలు ఆడలేదనుకోకండి. చిన్నప్పుడు బాడ్మింటను, వాలీబాలు కోర్టులెక్కేను నేను సైతం. అమెరికా వచ్చేక, అసలు వీధిలోకి వెళ్లడమే ఓ ఎడ్వెంచరు. అంటే చెయ్యలేదని కాదు.

నాకు ఆటలు సరదా. అంటే ఆడతానని కాదు. అలాగని అస్సలు ఆడలేదనుకోకండి. చిన్నప్పుడు బాడ్మింటను, వాలీబాలు కోర్టులెక్కేను నేను సైతం. అమెరికా వచ్చేక, అసలు వీధిలోకి వెళ్లడమే ఓ ఎడ్వెంచరు. అంటే చెయ్యలేదని కాదు.

ముందు టపా వింబుల్డన్ మీద ఇక్కడ

(మార్చి 7, 2009)

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

8 thoughts on “ఊసుపోక 29 – టెనిస్ చూడ్డం ఓ తమాషా”

 1. మెడిటేషను బాగుండదూ? –లేదండీ, నేను వేరేరకం ఆలోచనలతో గడుపుతాను. ఉదాహరణకి

  ఇంటర్నెట్లో పేరూ, ఐడీ ఎడ్రెస్ కరెక్టుగా ఇవ్వడం మీరు చూపుతున్న మర్యాదకి నిదర్శనం. పొడి అక్షరాలు, (డి.యస్ అనో ఆర్. యస్ అనో) ఇవ్వడం ఓ దారి. మీసాటి సైంటిస్టులు మీపేరడిగితే, nevermind అనో don’t care అనో చెప్పరు కదా మీరు.
  నా బ్లాగులో 817 కామెంట్లు వున్నాయి ఇప్పటికి. మీరొక్కరే freak name, fake ID ఇస్తున్నది. ఎంచేత? మీరు కరెక్టు ఐడీ ఇస్తే మీకు నేరుగా రాద్దాం అనుకుని చూసాను ఇంతవరకూ.
  మరొకమాట. నాకు ఇంగ్లీషు ఇంగ్లీషులోనూ, తెలుగు తెలుగులోనూ చదవడం ఇష్టం. రోమనైజుడు తెలుగు చదవడం చాలా కష్టం.

  మెచ్చుకోండి

 2. ఇంకా నయం. మీరు క్రికెట్ మేచ్ చూసి వాళ్ళు మాట్లాడే కామెంట్లు వింటే ఎంత చిరాకు పడతారో? Read the following slowly. It goes that way one way or the other.
  ——————————-
  … Now Tendulkar is facing Ajanta Mendis. India, 22 for 3. Mendis is setting up field for Tendulkar. He thinks he can beat the master with his foxy incutters and googlies. It is worth mentioning here that anyone in the record of Cricket, anyone who took Tendulkar’s wicket first, never actually went far in his career. So Mendis, beware of that. Now Gunavardane is setting field for Tendulkar (bore koTTEsiMdA? iMkA okka bAl kUDA bowling cEyalEdu mari.. OrcukOMDi.. ilAMTidi rOjaMtA vinAli). Sanath Jayasurya at first slip, Kumar is behind the wickets. There is a midon mid off, shortleg and rest of the team is on the booundary ropes. Tendulkar takes guard and gets ready. Here comes Mendis, over the wicket to Tendulkar (Still not bowled!!). There seems to be some crowd disturbance in the stands and Tendulkar objects. Play stops temporarily. The umpires consult each other and decide to wait a few minutes. We will be back after this break with a commercial (still not bowled a single ball. Audience waits with stopped breath, why because it is Tendulakar, the God is batting)….
  (30 sec break… I am dying with heart attack already).

  Welcome back, we are ready to begin. If you started watching just now, India is 22/3 and Mendis getting ready to bowl to Tendulakar. One slip, mid on, mid off, short leg and Mendis bowls. Shorter ball on the off stump, takes a vicarious turn. Tendulkar drives to covers. Sanath Jayasuriya misfields. Yuveraj on the other end signals for a quick single. Tendulkar not interested. And the ball is back to the bowler. (hammayya oka ball vEsADu, Tendulkar still batting. Some relief to my heart). Let us now turn ourselves to our expert commentator John Wright. “John what do you think Tendulkar is doing right now?”

  John: “I do not know Ravi, but I think he is very careful to see that India would not lose another quick wicket. He also does not seem quite good in health. I noticed he is limping slightly and may need a runner soon…..”

  Ravi Shastry: “back to Mendis. …. (on it goes)..
  ——————————-

  అయినా మీరు నాలుగింటికి లేచి చేసే పని ఇదా? హుం. ఏదో పొద్దున్నే లేచి రామ, క్రిష్ణా అనుకుంటే పుణ్యం స్త్రీ-ఆర్ధం (పురుషార్ధం టెనిస్ ఆడే పురుషులకి) దక్కుతాయి కదా? మీరు మామ్మగారని కాదండోయ్, బ్రహ్మ ముహుర్తంలో లేచి టెనిసూ, వాళ్ళు మార్చుకునే షూసూ, బట్టలూ చూడ్డం కంటే ఓ గంట మెడిటేషను బాగుండదూ? హె హె. (వెర్రి నవ్వు)

  మెచ్చుకోండి

 3. cbrao గారూ, థాంక్స్. అవుండీ టెన్నిస్ దుస్తులు కూడా గొప్ప టాపిక్.
  ఉమాశంకర్, థాంక్స్ వివరణకి.
  సుజాతా, నాలా ఆలోచించేవాళ్లు కూడా ఇంకా వున్నారన్నమాట. నిన్న మాన్ఫిల్స్, సైమన్ ఆట చూస్తుంటే నిద్దరోచ్చేసింది.:)
  పూర్ణిమా, మీ హగ్గులు మనసులో అందుకునేశాను. థాంక్స్.

  మెచ్చుకోండి

 4. “WOW.. Lady! You Rock!!” అని పెద్దవాళ్ళని మా ఈ దేశంలో అనరు! ఎక్కడంటారో చెప్పండి, అక్కడికి మిమల్ని తీసుకుపోయి ఒక గట్టి “హగ్” ఇచ్చేస్తాను. 🙂

  వ్యాసం సూపర్! ఏసులుండాలండీ బాబూ.. లేకపోతే మజా రాదు. ఇక టివి కమ్మెంటర్లు ఎప్పుడైనా ఎక్కడైనా అంతే. కాకపోతే నేను ఆటలు చూసేటప్పుడూ వాల్యూమ్ పెట్టుకునేది “crowd involvement” కోసం. వాళ్ళు పాడే పాటలూ, అరిచే మంత్రాలూ, “ఉఫ్”లూ.. “ఆహ్”లూ… వీటి కోసం. మీ తరువాయి భాగం కోసం ఎదురుచూస్తుంటాను!

  మెచ్చుకోండి

 5. మాలతి గారు,ప్రతి ఒక్కరూ ఐడెంటిఫై చేసుకునేట్టు ఉంది ఈ టపా. నేను , వాసు కూడా IPL ఫైనల్ మాచ్ చూసినంత ఉత్కంఠగా చూస్తాం టెన్నిస్. టెన్నిస్ ఆడతాడు కూడా కాబట్టి నా కంటే ఎక్కువ టెన్షన్ తనకే! ఈ టపాలో మీ గురించి రాసిన పోలికలు కొన్ని నాకు ఉన్నాయిస్మీ! నాకు నేను వావ్ అనుకోవాలి గానీ…ఎట్సెట్రా….!

  మెచ్చుకోండి

 6. మాలతి గారూ,

  “ఏస్ కొట్టినప్పుడు అది అయాచితంగా, ఆనాలోచితంగా జరుగుతుందా? లేక వ్యూహరచనలో భాగంగా ఏసులేస్తారా?”

  చేయబోయే సర్వీసు ఏస్ అవుతుండా లేదా అనేది ప్రపంచ నంబర్ వన్ ఆటగాడు కూడా చెప్పలేడు. వారు చేసేదల్లా ప్రత్యర్ధి ఆటతీరు, వారు ఎక్కడ నిలబడ్డారు, వారి బలం బలహీనతల్ని బట్టి, బంతిని బలంగా కొట్టడమే.

  గొరాన్ ఇవాన్ సెవిక్ మొదట్లో ఆ ఏసులమీదే ఆధారపడి గెలిచేవాడు. సంప్రాస్ లాంటి వాళ్ళకు ఆ ఏసులు మెరుగైన వారి ఆట తీరు సూచిస్తాయే తప్ప మరింకేమీ కాదు.

  మెచ్చుకోండి

 7. “మొదటిది ఏస్ కొట్టినప్పుడు అది అయాచితంగా, ఆనాలోచితంగా జరుగుతుందా? లేక వ్యూహరచనలో భాగంగా ఏసులేస్తారా? ” -టెనిస్ అంటే ఎంతో గ్లామర్, డబ్బు, పేరు ఇంకా ప్రతిష్ట. పేరొచ్చాక లింకా తాగుతూ కనిపిస్తూ కూడా డబ్బు చేసుకోవటం టెనిస్ తారలకు అతి సులభం. మరి ఇంత పేరు రావాలంటే ఆట గెలవాలి కదా. టెనిస్ లో ఏసులు, క్రికెట్ లో కాచ్లు (Catches win the matches) ఆటను గెలిపిస్తాయి. నిస్సందేహంగా ఏసులు ఆట గెలిచే వ్యూహంలో భాగమే. మీ వ్యాసంలో లేని విషయమైన టెనిస్ తారల దుస్తుల గురించి మీరు మరొక ప్రత్యేక వ్యాసం రాయవలసిన అంశం.

  మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s