ఊసుపోక – వెదురుమొక్క అదురుష్టం

(ఎన్నెమ్మకతలు 30) 

ఈరోజు ఉదయం లేస్తూనే తెలివొచ్చింది.

తెలుగుతూలికలో ఓకబురు చెప్పి నెలరోజులయింది. ఇంగ్లీషుతూలిక అయితే మరీ అన్యాయం. మూణ్ణెల్లయింది. అదయినా ఒక్క వ్యాసం పెట్టి. ఏమిటో పనీ లేదు, తీరుబడీలేదు, క్షణం తీరికలేదు దమ్మిడీ ఆదాయంలేదు లాటి జాతీయాలన్నీ వరసగా వచ్చేస్తున్నాయి నాలుకమీదకి.

bamboo1

 

ఎటు పోయింది చెప్మా కాలం! అయినా నాచాదస్తం కానీ టైమెక్కడికి పోతుంది. తోచదు తోచదు అంటూ దిక్కులు చూస్తుండగానే చేతివాచీలో చేతులకి కాళ్లొచ్చి నడిచిపోతున్నాయి గున్నయేనుగుల్లా.

అసలేమయిందంటే, కబుర్లు చెప్పుకుందాం రారమ్మంటూ పిలిచిందో కవయిత్రి. మీకత చెప్పమంటూ కలం పుచ్చుకున్నదో జర్నలిస్టు. మీవ్యాసం పునరపి మాసైటులో పెట్టుకుంటామంటూ ప్రకటించేరు మరో జర్నలిస్టు. మాకో వ్యాసం రాసిమ్మంటూ ప్రత్యేకాహ్వానించింది ఓ విశ్వవిద్యాలయ ఆంగ్ల సారస్వతపత్రిక. తిరిగీ టెల్గూ టీచింగు చెయ్యమంటున్నారు యూనివర్సిటీవాళ్లు. చెప్పొద్దూ, ఇందులో దమ్మిడీ ఆదాయం కూడా వుంటుంది. హీహీహీ.

ఏకకాలంలో హోల్ మొత్తం లోకం మేలుకొని నా అస్తిత్వానికి ఉదయగీతికలు ఆలపించినట్టనిపించేసిందనుకోండి హఠాత్తుగా. అహో! ప్రభవించెను నాజాతకమంటూ అరవబోతే విడలేదు గళం. అతిశయాల నిశ్శబ్దం వేసుకుంది తెరలు అరవిరిసిన గులాబీరేకులలా ఏఁవిటా తొందర? ఇంకా తెల్లవారలేదంటూ బుద్ధి చెప్పుకున్నాను నాకు నేనే.

ఇంకా తేరుకోకముందే యూనివర్సిటీవారు మళ్లీ పిలిచి నీటీచింగు పదవి మరొకరికి ఇచ్చేస్తున్నాం అన్నారు. సరేలెమ్మనుకుని, పదిహేను పేజీల వ్యాసం రాసుకుంటూ కూర్చున్నాను. మళ్లీ నిన్న వాళ్లే పిలిచారు రారమ్మని. ఇలా ఉందీ, లేదూ అనుకుంటూ, నానాటికీ నాటకమూ అంటూ యమ్మెస్ టేపు పెట్టేసుకుని, అక్కజపడుతూ, లేస్తూ, విన్నవారికి మాత్రం జవాబులిచ్చుకుంటూ పొద్దు పుచ్చేసుకుంటుంటే గడిచిపోయిందన్నమాట కాలం. అదీ సంగతి.

అసలింతకీ ఇలా నాజాతకం తిరిగిపోడానికి అసలు రియల్ కారణం ఆమధ్య నేను కొన్న లక్కీ బాంబూ  (bamboo, not bomb  :p ) అనుకుంటాను.

ఇంతకీ లక్కీ బాంబూలో ఇంత లక్కుందని తెలిస్తే నేను 20వశతాబ్దంలోనే కొనీకపోదునా ఆమొక్క? ప్చ్. అందుకే అంటారు దేనికయినా కాలం ఖర్మం కలిసిరావాలని. ఏమయినా నాకు మాత్రం గట్టినమ్మకం పడిపోయింది ఇదంతా నాకు లక్కీబాంబూ తెచ్చిన లక్కేనని. అంచేత ఇప్పుడు అడిగినవాళ్లకీ, అడగనివాళ్లకీ పని గట్టుకు చెప్పేస్తున్నా లక్కీ బాంబూ ఒకటి తెచ్చి ఇంట్లో పెట్టుకోండని. అన్నట్టు మరోమాట. ఈమొక్కకి అట్టే సేవలు చెయ్యక్కర్లేదు. నెలకోమారు ఇన్ని నీళ్లు పోస్తే చాలుట. ఎంత సుఖమెంత సుఖం అనీ పాడుకుందాం, రండి మరి. మీ లక్కీబాంబూ తెచ్చుకోండి. .

 

 

(మార్చి 2009)

8 thoughts on “ఊసుపోక – వెదురుమొక్క అదురుష్టం

 1. మాలతి గారూ.
  ‘బాంబూ’ భలేగా పేలింది 😉 ఇలాంటివి కనిపెట్టడంలో మాత్రం మీకు మీరే సాటి సుమా 🙂
  నా దగ్గర కూడా ఇలాంటి బాంబూ ఉంది. మరీ వరసపెట్టి అన్నీ అదురుష్టాలు కాకపోయినా.. కొద్దో గొప్పో అదురుష్టం వస్తుందని నాక్కూడా అనిపించింది.
  మీకింకా బోలెడు అడురుస్తాలు వచ్చెయ్యాలని.. మీ పోస్టులు చదివే మాక్కూడా రావాలని కోరుకుంటూ 😉
  -మధుర

  మెచ్చుకోండి

 2. పరిమళం – తప్పకుండా ఫలిస్తుంది. శుభమస్తు.
  సిరిసిరిమువ్వ – సరే. మీకే అప్పెట్టెస్తున్నాను. మీరు మొక్క కొనండి. నేను ఎప్పుడేనా కనిపించడం జరిగితే, దాని ఖరీదు ఇచ్చేస్తా. అయినా మనలో మాట.నాకు నేనే కొనుక్కున్నాను కదండీ.
  అరుణా – నేను Eveready.
  జీడిపప్పు – అదేం పిలుపూ? ఏవూరబ్బాయి లేక అమ్మాయి మంది?
  వెన్నెలా – విన్నప్పుడల్లా కొంచెం దిగులు,కించిత్తు విషాదం, బోలెడు వైరాగ్యం వచ్చేస్తుంది- అవునండీ. అందులో సౌందర్యం అదే. యమ్మెస్ కే తగును అంతటి భావసౌందర్యలహరి.

  మెచ్చుకోండి

 3. బావుంది!! ఆ మొక్కేదో అర్జెంటు గా కొనెయ్యాలి మరి.

  ఎమ్మెస్ “నానాటీ బ్రతుకు నాటకము” నాకు కూడా చాలా ఇష్టం. కాకపోతే విన్నప్పుడల్లా కొంచెం దిగులు,కించిత్తు విషాదం, బోలెడు వైరాగ్యం వచ్చేస్తుంది.

  వెన్నెల

  మెచ్చుకోండి

 4. బాగా బిజీ అన్నమాట!..లక్కీ బాంబూ….ఇది ఎవరికి వాళ్లు కొని పెట్టుకోకూడదంట మరి మా అందరికి మీ చేత్తో ఇద్దురూ మీ అదృష్టం మా తలుపు కూడా తడుతుందేమో చూద్దాం.

  మెచ్చుకోండి

 5. మాలతి గారూ !నిజమాండి ? మాకు ఒక స్నేహితుడిచ్చాడు ఆ మొక్క ….కానీ నేనెప్పుడూ గమనించలేదు .ఇప్పటినుండి రాబోయే అదృష్టాల్ని లెక్కపెట్టుకుంటా …..

  మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.