ప్రయోగ మూషిక మార్జాల వెంకటరావుగారు!

(నిడుదవోలు వెంకటరావుగారు జంగమ విజ్ఞానసర్వస్వము టపాకి లింకు )

ప్రతిభావంతులయిన కవులు అప్పుడప్పుడూ వాడుకలోలేని అర్థాలలో పదాలు వాడతారు తమ కవితల్లో. వీటినే వ్యాసఘట్టాలనీ, కవిసమయాలనీ కూడా అంటారు.

 కూర్చినప్పుడు, వాడుకలో వున్న పదాలతోపాటు ఈ ప్రత్యేకమయిన ప్రయోగాలని కూడా ఉదహరించడం మామూలు. కానీ వీటిని, ముఖ్యంగా శాసనవాఙ్మయంలో ప్రయోగాలని కొందరు పండితులు ఆమోదించలేదు. వెంకటరావుగారు మాత్రం కవి ప్రయోగించేడంటే, అది వాడుకలో వుందనే కదా అర్థం, అది ప్రజలభాష, అంగీకారయోగ్యమే అని స్వీకరించి తాము కూర్చిన నిఘంటువులలో చేర్చేరు. తెలుగు కవులచరిత్రలో శాసనకవులను చేర్చి, అంతకుపూర్వం గల సాహిత్యచరిత్రకి మెరుగు పెట్టిన ఘనత వెంకటరావుగారిదే.

వెంకటరావుగారికి అసాధారణ ధారణశక్తి. ఏపుస్తకమయినా ఏదో చదివేనని చెప్పుకోడానికి కాక, మనసు పెట్టి చదివేవారు. వెంకటరావుగారు చదవని పుస్తకంలేదు. చదివి మరిచింది లేదు అన్నారు తిరుమల రామచంద్రగారు.  ఈధారణశక్తీ, విషయచర్చలో ఆసక్తీ మూలంగా ఆయన ఎవరు ఏది అడిగినా తడుముకోకుండా చెప్పగలరన్న కీర్తి తెచ్చుకున్నారు. ఈయన “ఏకసంథాగ్రాహి”ట. (ఇంతవరకూ నేను “ఏకసంతగ్రాహి” అనే విన్నాను. డా. నిష్టల వెంకటరావుగారి పుస్తకంలో “ఏకసంథాగ్రాహి” అని వుంది).

విశ్వనాథ సత్యనారాయణగారు ధాతుక్రియా మణిదీపిక అన్న పుస్తకం రాసినతరవాత, ఒకసారి వెంకటరావుగారితో, “చాలా వెతికినాను కానీ ‘మనసైనది’ అన్న పదానికి ప్రయోగము దొరకలేదు” అన్నారుట.

అప్పుడు వెంకటరావుగారు, “ఎందుకు లేదు. వంద ప్రయోగములు చూపగలను,” అన్నారు.

“సరే, చూపండి” అంటే, వెంకటరావుగారు నందనందనశతకంలో క పద్యం చదివి, చివరిపాదం “నీచక్కదనంబు చూడ మనసైనది నందనందనా”లో ఆపదం చూపేరు.

విశ్వనాథవారు వదలకుండా “వంద చూపుతానన్నారు కదా” అన్నారు.

“అది శతకము కదా. వంద సార్లు వచ్చింది కదా” అని హాస్యమాడి, తరవాత తదితర ప్రయోగములు కూడా చూపారుట.

ఆయన అలా పుస్తకాలకి పుస్తకాలే కంఠస్థం కావడం చేత, ఎవరు ఎప్పుడు ఎక్కడ అడిగినా, వెంటనే ఆపదం పుట్టుపూర్వోత్తరాలతో సహా సవిస్తరంగా చెప్పగలగడంచేత, ఎవరో ఆయనని  ’’ప్రయోగ మూషిక మార్జాల’’ అన్నారుట. పిల్లి ఎలుకని వెతికి వెతికి పట్టుకున్నట్టు వెంకటరావు గారు ఎక్కెడెక్కడున్న ప్రయోగాలనీ పసి గట్టి పట్టుకుంటారని!

ఎవరు ఎప్పుడు అన్నారో తెలీదు కానీ వాడుకలోకి వచ్చింది అంటారు డా. నిష్టల వెంకటరావుగారు.

వెంకటరావుగారు శాసనకవులని ప్రతిభగల కవులుగా గుర్తించడం విశేషం. అప్పటివరకూ పండితులెవరూ ఛందోబద్ధంగా రాసినా శాసనాలలో కవిత్వాన్ని కవిత్వంగా అంగీకరించలేదు. అందుకు విరుద్ధంగా శాసనాలలో కవిత్వతత్త్వాన్ని ఎత్తి చూపి, నన్నయ్యకి పూర్వమే తెలుగు కవిత్వం శాసనాల్లో విలసిల్లిందని సాక్ష్యాలతో ఋజువు చేసేరు వెంకటరావుగారు.

ఆకవితలలో ప్రయోగాలను సాధికారకమయినవిగా స్వీకరించేరు.

(29 October 2009)

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

6 thoughts on “ప్రయోగ మూషిక మార్జాల వెంకటరావుగారు!”

 1. @గద్దెస్వరూప్, మీరు చెప్పింది నిజమే కావచ్చునండీ. నేను చూడలేదు. ఇలాటివి స్పష్టమవువుతాయనే ఇక్కడ పట్టేను ఇంగ్లీషువ్యాసానికి ముందు. నాదృష్టికి తెచ్చినందుకు ధన్యవాదాలు.

  మెచ్చుకోండి

 2. “అందుకు విరుద్ధంగా శాసనాలలో కవిత్వతత్త్వాన్ని ఎత్తి చూపి, నన్నయ్యకి పూర్వమే తెలుగు కవిత్వం శాసనాల్లో విలసిల్లందని సాక్ష్యాలతో ఋజువు చేసేరు వెంకటరావుగారు.”
  From P.V. Parabrahma sastry Felicitation Volume 1 ( in the first article by A.V. Narasimha Murthy):
  “Utilizing Kurkyala inscrption of Jinavallabha, younger brother of the renowned Kannadapet Pampa, Dr. Sastry brought to light that Malliya Rechana, the author of Telugu work Kavijanasraya was earlier than Nannayabhatta, the author of Andhra Mahabharata at least by one century.”
  I have no expertise in these matters but I heard good things about Dr. P.V. Parabrahma Sastry and bought his felicitation volumes published by Sarada Publishing House, New Delhi. The list price is 3800 rupees but I paid around 2500 rupees.

  మెచ్చుకోండి

 3. ఆహ్లాదకరమైన వ్యాసం.
  ఒక సందేహం “ఏకసంతగ్రాహి” కి ఏమైనా వేరే అర్ధం ఉన్నదా ? తెలుపగలరు.
  ఒక్కసారి వినినంతనే ధారణ పట్టగల వారిని “ఏకసంథాగ్రాహి” అని చదువుకున్నట్లే గుర్తు.

  మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s