ఊసుపోక – హక్కులు దోచేసుకుంటున్నారు :(

(ఎన్నెమ్మకతలు 45) 

పైశీర్షిక చూడగానే ఇది తెలంగాణా, సమైక్యాంధ్ర తగువేమో అనుకుంటారేమో. ఒకరకంగా అవును, మరోరకంగా కాదూ

.. “అవును” ఎలా అంటే, గత రెండురోజుల్లోనూ ఒకరిద్దరు మిత్రులు నన్ను అడిగేరు ఈవిషయంలో నాఅభిప్రాయం ఏమిటని. ఇలా దేశంలో ఆందోళన జరగడం ఆందోళనకరంగానే వున్నా తప్పెవరిది? విడగొట్టాలా? ఆ యత్నం పడగొట్టాలా అఁటే నేను చెప్పలేను, నాకీవిషయంలో అంతటి రాజకీయపరిజ్ఞానం లేదు. మహా అయితే నేను చెప్పగలిగింది – ఇది తెలంగాణా, ఆంధ్రా తగువుగా కాక, బలంవంతుడు బలహీనుణ్ణి, వున్నవాడు లేనివాణ్ణీ, పెద్దవాడు చిన్నవాణ్ణీ, ఆచిన్నవాడు ఇంకా చిన్నవాణ్ణీ దోచుకోడంగానే కనిపిస్తోంది. దేశం రెండో, మూడో, పదో చెక్కలు చేస్తే నాలాటి అర్భకులబతుకులు బాగుపడుతాయో లేదో నాకు తెలీదు కానీ మరిన్ని రాజకీయాలకీ, పార్టీలకీ, నాయకులకీ ప్రతిష్ఠాపన జరగడం ఖాయం. ప్రజలు తమకి ఏం కావాలో తామే తెలుసుకుని ఆవి సాధించుకోడానికి ప్రయత్నం చెయ్యాలి. అలాటి మేథ విద్యార్థులకి మన విద్యాసంస్థలు ఇవ్వాలి — ఇలా నేను రాస్తుంటే నాకే హాస్యాస్పదంగా కనిపిస్తోంది! చదువులెల్ల చదివితి తండ్రీ అనగల ప్రహ్లాదులు ఈనాడు ఎంతమంది? అని అడిగితే what are you talking about అనేవిద్యార్థులే ఎక్కవేమో!

ఇహ పోతే, “కాదు” ఎలా అంటే, నేనిక్కడ నా మరోసొద వెళ్లబోసుకోడానికి మొదలు పెట్టేను కనక. రెండు రోజులకిందట నా సైటు. తూలిక.నెట్‌కి రిఫరర్లు ఎవరో చూద్దాం అన్న దుర్బుద్ధి పుట్టింది. అలా రిఫర్ చేస్తున్నవాళ్లలో translate.google.com కనిపించింది. ఇది ఇంతకుముందు చూశాను కానీ నా హోం పేజీ మాత్రమే పెట్టేరనుకున్నాను. నిన్న చూస్తే, నాసైటులో మొత్తం కథలూ, వ్యాసాలూ అన్నిటినీ నేనెప్పుడూ కనివిని ఎరగని భాషలోకి తర్జుమా చేసి పెట్టేసుకున్నారు! హౌరా, అనుకుని, వాళ్ల సైటులో contact us అని ఎక్కడయినా వుందేమో కనుక్కోడానికి ప్రయత్నించి, విఫలయత్నురాలినయి, నాసైటులోనే ఒక ప్రకటన ఇచ్చేను. ఇవాళ మళ్లీ చూస్తే నాకు నవ్వాగలేదు. ఎందుకంటే, నాకిప్పుడు మరి కొన్ని విషయాలు అర్థమయేయి. ఆసైటు ఎవరో ఘనటెక్ పండితులే నడుపుతూ వుండాలి. నేను నాసైటు అప్‌డేట్ చేసినప్పుడల్లా, వెనువెంటనే అది అక్కడ అప్‌డేట్ అయిపోతుంది ఆటోమేటిగ్గా. అందువల్ల ఏం జరిగిందీ అంటే నేను నాసైటులో పెట్టిన నాప్రకటన “మీరు నాకాపీరైటుని ఉల్లంఘిస్తున్నారూ, నావ్యాసాలూ, కథలూ నాఅనుమతి లేకుండా ప్రచురించుకుంటున్నారూ, ఇది మహా నేరం” కూడా ఇప్పుడు వాళ్ల సైటులో వుంది. దడిగాడు వానసిరా అని ఓ జోకుంది చూశారూ అలాగన్నమాట.

ఇంతకీ ఈ భాష – нарушение авторского права – ఏమిటో, ఈ యాంత్రిక అనువాదాలు సృష్టించిందెవరో మీకు ఎవరికైనా తెలుసా?

(17 డిసెంబరు 2009)

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

6 thoughts on “ఊసుపోక – హక్కులు దోచేసుకుంటున్నారు :(”

  1. I am reading your blog. some some lines are so good that I wish to lift them from your blog and paste them in my blog- I hope you will approve.

    ‘ దేశం రెండో, మూడో, పదో చెక్కలు చేస్తే నాలాటి అర్భకులబతుకులు బాగుపడుతాయో లేదో నాకు తెలీదు కానీ మరిన్ని రాజకీయాలకీ, పార్టీలకీ, నాయకులకీ ప్రతిష్ఠాపన జరగడం ఖాయం. ప్రజలు తమకి ఏం కావాలో తామే తెలుసుకుని ఆవి సాధించుకోడానికి ప్రయత్నం చెయ్యాలి. అలాటి మేథ విద్యార్థులకి మన విద్యాసంస్థలు ఇవ్వాలి “

    మెచ్చుకోండి

నాటపా మీకు నచ్చిందో లేదో చెప్తే చాలు. బాగులేకపోతే ఎందుకు లేదో చెప్పినా సంతోషమే.

Please log in using one of these methods to post your comment:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s