మాలతిసాహితి pdf 2

నాదగ్గర ఉన్నవి 1954నించి ఈసంపుటిలో చేర్చాను. నిజానికి మొదటి అయిదు స్కెచ్ లేక గల్పికలు – ఈనాటి కార్డ్ కథలలాటివి. నాసరదాకోసం పెట్టుకున్నాను కానీ మీరు ఏ ఆరో, ఏడో కథ దగ్గరో చదవడం మొదలెట్టొచ్చు. మళ్లీ చెప్పలేదనకండి మరి.

తాజాకలం.

malathisahiti 1, malathisahiti 2 – ఈ రెండు సంకలనాలు మార్చి, కథామాలతి అన్న పేరుతో నా కథలన్నీ వేరే సంకలనాలు చేస్తున్నాను. మాలతి సాహిత్యం pdf లో అన్న పేజీ చూడగలరు.  – మాలతి

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

4 thoughts on “మాలతిసాహితి pdf 2”

 1. @లలిత, గల్పిక, స్కెచ్, కథానిక – వీటికి స్పష్టంగా నిర్వచనాలు లేవనుకుంటానండీ. సంస్కృతసాహిత్యంలో ఖండిక, ఆఖ్యాయిక, ఆఖ్యానం, కథా, పరికథా – ఇలా వేరు వేరు పేర్లు ఉన్నాయని చెప్తూ నిర్వచనాలు ఇచ్చేరు పోరంకి దక్షిణామూర్తిగారు. వారి వ్యాసం ఇక్కడ చూడండి. http://www.thulika.net/2007October/pdmonstory.html

  ఆధునికసాహిత్యంలో కొడవటిగంటి కుటుంబరావుగారు, అరపేజీ చిట్టిపొట్టికథలని గల్పికలు అన్నారు. మీకు వీలయితే ఆయన సాహిత్యవ్యాసాలు చూడండి. నాకు తెలిసి తెలుగు స్వతంత్రవారు స్కెచ్ అన్నపదం, గల్పికలకంటే మరి కొంచెం పొడుగు వున్నవాటికి పెట్టిన పేరులా కనిపిస్తోంది. పొడుగు అనగానే, చెప్పే విషయం కూడా మరింత విస్తృతంగా వుంటుంది కదా. వీటన్నిటిలోనూ మామూలుగా కథకి కావలసిన లక్షణాలు – ఆరంభం, సన్నివేశాలూ, సంఘర్షణా లేక సమస్య, ముగింపూ, పాత్రచిత్రణ లాటివి అట్టేలేని సూక్ష్మ కథనాలు (narrative) అనుకోవచ్చు. కానీ, ఎవరు దేనికి ఏపేరు పెడుతున్నారు అన్నవిషయంలో నిర్దుష్టమయిన అభిప్రాయాలు వున్నట్టు కనిపించదు.
  ఈసంకలనంలో చూడండి, మొదటి రెండు కథనాలని, (నిడివి అరపేజీ), గల్పిక అన్నారు. ఆతరవాత, రెండు, మూడు పేజీలు నిడివిగల కథనాలని స్కెచ్ అన్నారు తెలుగుస్వతంత్రవారు. ఉదా. “ఋణానుబంధరూపేణ”, “మాతోటలో”. వీటిలో చెప్పుకోదగ్గ సంఘర్షణా, పరిష్కారంలాటివి లేవు.
  దాదాపు అలాటిదే “ఉద్దేశాలు మంచివే” అయినా, ఆంధ్రసచిత్రవారపత్రికవారు కథ అన్నారు విషయసూచికలో. నిజానికి పత్రికలలో కథకీ కథానికకీ తేడా కనిపించదు. ఒకొకపత్రికవారు ఒకొక పేరు ఎన్నుకుంటున్నారు.
  నాకు తెలిసింది ఇంతే.

  @మధురవాణి, Thanks.:)

  మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s