DLI లైబ్రరీలో పుస్తకాలు

ఈరోజు పొద్దున్నే లేచి మెయిలు చూస్తే అయిదు వ్యాఖ్యలు కనిపించేయి నా తపాల్ పెట్టెలో. ఒక్కరోజులో ఇన్ని రావడం అరుదు. ఎవరా అని చూస్తే, ఇంకెవరు? పుస్తకం.నెట్ సంపాదకజంటలో ఒకరైన సౌమ్య!

సామాన్యంగా వ్యాఖ్యలకోసం మళ్లీ టపా చూసేవారు తక్కువ కనక వేరే టపా రాస్తున్నాను. తను ఇచ్చిన సమాచారం చాలామందికి పనికొస్తుందన్న నమ్మకంతో. సాధారణంగా పుస్తకాలకోసం జాలంలో చూడ్డం చాలామందికి అలవాటే కావచ్చు. కానీ ఈజాలంలో గాలం వేసి పట్టడం మాత్రం అంత తేలిక కాదు, నాక్కూడా దొరుకుతున్నాయని తెలుసు కానీ, తనంత తీరిగ్గా (హాహా) వెతుక్కునే స్తోమతు నాకు లేకపోయింది. నాకు ఇన్ని దొరకలేదు. 😦

కొంతకారణం, సౌమ్య కూడా చెప్పినట్టు, అక్కడ అక్షరదోషాలు కోకొల్లలు. ఒకొకప్పుడు ఏం పేరో కూడా అర్థం కాదు. అవి దిద్దడానికి నేను ఒకసారి ఉత్సాహం చూపించాను కానీ వారు ఉపయోగించే సిస్టం నాకు అందుబాటులో లేదని తెలిసినతరవాత నాఆలోచన ఉపసంహరించుకున్నాను.

ఇంతకీ, ముఖ్యంగా, నేను చెప్పదలుచుకున్నది, తప్పులు పట్టడం తేలికే. అయితే DLI చేస్తున్నది సామాన్యమయిన పని కాదు. దాన్ని వినియోగం చేసుకోడం కాస్త శ్రమ అయినా, పుస్తకం పట్టుకున్న తరవాత, డౌన్‍లోడ్ చేసుకోడం, చదువుకోడం చాలా తేలిక.

తాజాకలం. ఈమధ్య నేను Digital Library of India సైటునుండి డౌన్లోడ్ చేయబోతే, పని కాలేదు. అందుకు మరో సాఫ్ట్ వేర్ కావాలని తెలిసింది.

ఆ సాఫ్ట్ వేరు పేరు DLI downloader. లింకు http://www.mediafire.com/dlidownloader. అది మీరు డౌన్లోడ్ చేసుకుని, Digital Library of India లో మీకు కావలిసిన పుస్తకం బార్ కోడ్ కాపీ చేసి, డౌన్లోడర్ లో పేస్ట్ చేస్తే, ఆ ప్రోగ్రాం మీరు కావలసిన పుస్తకం పిడియఫ్ పో మీకు అందిస్తుంది.

సౌమ్య ఇన్ని పుస్తకాలు పట్టుకుందంటే నాకెంతో ఆనందంగా వుంది. వారి ఆనుపానులు కనిపెట్టేసి, ఇంత సమాచారం సేకరిస్తోందంటే, ఆ అమ్మాయిని అభినందించ తప్పదు.

మీకు నాటపాల్లో చెప్పిన పుస్తకాలూ, ఇంకా ఏవైనా కావాలంటే, పుస్తకం.నెట్ వారికి అర్జీ పెట్టుకోవచ్చునేమో మరి. 🙂

ఈటపా సౌమ్యతరఫున నా హామీ ఎంతమాత్రమూ కాదు.  సౌమ్యకి సమాచారం దొరికితే, మీకు అందించగలదని నేను అనుకుంటున్నాను. అంతే.

సౌమ్యా, మరొకసారి, నీ ఉత్సాహానికీ, సాహిత్యభిలాషకి అంజలి ఘటిస్తున్నాను మనస్ఫూర్తిగా. :)).

నిడదవోలు వెంకటరావుగారికి ప్రయోగమూషిక మార్జాల అన్నపేరు ఇలాగే వచ్చింది. మరి నిన్ను … :))

(మార్చి 12, 2010)

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

3 thoughts on “DLI లైబ్రరీలో పుస్తకాలు”

ప్రస్తావించిన అంశముపై తెలుగులో చర్చకి అనువైన వ్యాఖ్యలు మాత్రమే అంగీకరింపబడును.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s