పలుకు తేనియలొలుకు

Before daybreak లేచి

Breakfast చేసి

Freshen upప్పయి Officeకెళ్లి

Late evening ఇల్లు చేరి

Daddyకో hugయ్యమ్మా అంటే

పో, నాన్నా, నిద్దలొతూందంటూ

ఒత్తిగిలి నిద్దరోయింది

చక్రాలబండి తొక్కి తొక్కి అలసిపోయిన పాపాయి.

000

కాలం అపురూపం

ఎక్కడయిపోతుందోనని

కొసరి కొసరి కొరుకుతూ తింటోందామె

అమ్మమ్మ పెట్టిన అరిసెల్లా.

అనుభవించకపోతే అరచేతిలో స్వర్గం చేజారిపోతుందని

ఉరుకులూ పరుగులూ పెడుతున్నాడతను వగరుస్తూ.

కాలం కదులుతోంది తనమానాన తను.

000

అవ్యక్తమధురం

కొందరిజీవితాల్లో ఆత్మస్ఫర్శలు

సాగుతాయి సమాంతరంగా.

అవి కలవవు, విడిపోవు.

వారి బాంధవ్యం

సాగుతుంది సరస్వతీనదిలా

అవ్యక్త పట్టాలమీద

“ఔరా” ఎక్స్‌ప్రెస్ అయి.

(June 30, 2010)

గ్రంధకర్త మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

6 thoughts on “పలుకు తేనియలొలుకు”

  1. కల్పనా, నేను నీకు పోటీనా, మరీ హాస్యాలు కాకపోతే … ఏదో పాతఫొటో కనిపిస్తే, నాలుగు మాటలు గిలికేను. నువ్వు బాగుందంటే ఆమోదముద్ర. నాకు సంతోషం.

    ఇష్టం

  2. మాలతి గారు,
    మీరు భలేవారండీ.కవితల మీద కవితలు రాసేసి మాకు పోటీ వస్తున్నారా? కథల్లో మీతో పడలెం కనీసం కవిత్వం తో వద్దామనుకుంటే మీరు మాకు గట్టి పోటీ ఇచ్చేస్తున్నారుగా….జస్ట్ కిడ్డింగ్. కవితా బావుంది. నిద్దోరోతున్న పాపాయి కూడా. అసలు నిద్దరపోయే పాపాయిల అందమే వేరు.
    కల్పన

    ఇష్టం

టపాలో చర్చించిన అంశంమీద వ్యాఖ్యానాలు తెలుగులో రాసిన వ్యాఖ్యలు మాత్రమే అంగీకరింపబడతాయి. తెంగ్లీషులో రాసిన వ్యాఖ్యలు కూడా నాకు సమ్మతం కాదు. కోరుతున్నాను

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / మార్చు )

Connecting to %s