లోభిహృదయం కథ (చర్చ)

పూర్వంలాగే, ఇక్కడ భానుమతిగారి లోభి హృదయం కథ చర్చకి పెడుతున్నాను. మీరు ఈకథ చదివి, మీ మీ స్పందనలు రాయవలసిందిగా కోరుతున్నాను.

లోభి హృదయం

దయచేసి ఇక్కడ ఈకథమీద మాత్రమే మీ వ్యాఖ్యలు రాయమని అర్థిస్తున్నాను.  ధన్యవాదాలు.

రచయిత: మాలతి

మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

10 thoughts on “లోభిహృదయం కథ (చర్చ)”

 1. @ కొత్తపాళీ, రెండు కథనాలు అన్నమాట బాగుంది. రచయిత్రి నిర్లక్ష్యం అంటారా. నాకు అలా తోచలేదు. సినిమాటిక్ అన్నది కూడా ఒక దృక్కోణమే. నేను కూడా ముగింపుగురించి అనుకున్నాను. థాంక్స్.

  మెచ్చుకోండి

 2. ఈ కథలో రెండు రకాల కథనాలున్నాయి – బాహ్య ప్రపంచ చిత్రణ, శెట్టిగారి అంతః ప్రపంచ చిత్రణ. ఈ రెండిటికీ కొంచెం పొసగలేదనీ, అంతరాన్ని చిత్రించడంలో శెత్తి ఆత్మగొంతుకంటే కథకురాలి గొంతే బిగ్గరగా వినిపించింది.
  కథ ఎత్తుగడ అద్భుతంగా ఉంది. బాహ్య చిత్రణలో శెట్టి, భార్య మాట్లాడే తీరు, ప్రవర్తించే తీరు, ఈ చిత్రణ అంతా నియోరియలిస్టిక్ సినిమా చూసినంత అద్భుతంగా ఉన్నది. కల్పన చెప్పిన ఆ రోజుల్లో అలాంటి కథనం సహజమే అన్న వాదన నేనొప్పుకోను. ఈ రెండు కథనాల మధ్య ఉన్న విభజన రేఖ రచయిత్రిగారి నిర్లక్ష్యమనే నేననుకుంటున్నా. లేదా ఆవిడకి బాహ్య చిత్రణ చేసినంత లాఘవంగా అంతరాల చిత్రణ అలవాటు లేకపోయి ఉండొచ్చు. చివరిపేరాలో మార్పు కూడా కొంచెం సినిమాటిగ్గా ఉంది. అసలు మొత్తానికి మూగపిల్ల కథ సుఖాంతమవడమే సినిమాటిగ్గా ఉంది, కానీ అదీ మంచిదే. కథలో శెట్టి మనస్థితి మార్పుని సంపూర్ణం చెయ్యడానికి అది ఉపయోగపడింది.
  కథ శీర్షిక కథాంశానికి మరీ డైరెక్టు సూచనగా ఉంది.
  ఏదేమైనా, భానుమతిగారి వచనం చక్కటి వచనం. చదివించినందుకు మీకు నెనర్లు.

  మెచ్చుకోండి

 3. ఒక వ్యక్తి స్వభావాన్ని బొత్తిగా నలుపు తెలుపుల్లో కాకుండా ఆ వ్యక్తిలో వుండే అనేక ఛాయల్ని చూపించడం బాగుంది.మూగపిల్ల అంతరంగచిత్రణ,సెట్టి మానసికపరిణామం అంతా మొదట్లో బాగానే అనిపించాయి కల్పన చెప్పినట్లు ఒక్కొక్కరి మీద ప్రేమ ఎప్పుడు ఎందుకు కలుగుతుందో చెప్పలేం.ఎందుకంటె జీవితం ఒక ఈక్వేషన్ కాదు కాబట్టి.. సెట్టి అంతరంగ మథనాన్ని భానుమతి బాగానే చిత్రించారు కానీ ముగింపు కొంచెం అతిగా అనిపించింది .ఏమైనా భానుమతి అత్తగారికథలే జీవంతొణికిసలాడుతుంటాయి.

  మెచ్చుకోండి

 4. కథ చదువుతున్నంత సేపూ ఆ మూగ పిల్ల వేదనతో మనసంతా కలచివేసినట్లు అయింది.
  మొదట కథ పేరు విషయానికి వస్తే ఎంతటి లోభి కైనా ఒక హృదయం వుంటుంది. దానికి మంచి చెడుల విశ్లేషణ వుంటుంది అని చెప్పటానికి రచయిత్రి ఆ పేరు పెట్టినట్లు అనిపించింది.

  ఇక ఇతివృత్తం విషయానికి వస్తే…ఈ కథ ఇప్పుడు వస్తున్న కథల్ని చదవటం వల్ల కొంత నేరు గా ఎలాంటి సటిలిటీ లేకుండ చెప్పేస్తినట్లు అనిపిస్తుంది కానీ ఈ కథ ప్రచురణ జరిగేనాటికి ఇలాంటి కథనాలు సహజమే కదా. ఆ రకంగా నాకు దానితో ఎలాంటి ఇబ్బంది అనిపించలేదు.
  ప్రధానం గా రచయిత్రి రెండు విషయాలు ఈ కథ ద్వారా చెప్పాలనుకున్నది. మొదటిది మూగ పిల్ల బతుకుతున్న జీవితం, ఒక దారిద్ర్యమ్ వెనక అణిగిపోయిన ఆ పిల్ల ఆత్మాభిమానం, అలాగే మాట్లాడలేని ఒక అశక్తత. అవన్నీ బాగానే ప్రతిఫలించాయి.
  ఇందులో ప్రధాన పాత్ర శెట్టి. మూగపిల్ల ద్వారా ప్రధాన పాత్ర అంతఃసంఘర్షణ ని రచయిత్రి చెప్పదల్చుకుంది. మరీ ముఖ్యం గా ఒక కులం గురించి. ఆ రోజుల్లో కులాల గురించి మాట్లాడటం నిషిద్దం కాదు. ( ఇప్పుడు కూడా కాదు అనుకోండి) మామూలుగా కోమట్లు , వ్యాపారం చేసుకునేవాళ్లకు మనసు వుండదు. పీనాసి వాళ్ళు. డబ్బు కోసం ఏ గడ్డి అయినా కరుస్తారు అన్నది జనసామాన్యం. అది తప్పని చెప్పదల్చుకుంది రచయిత్రి ఈ కథ ద్వారా. అయితే అది కొంచెం ఓవర్ కూడా అయింది.
  శెట్టి తన తప్పు తెలుసుకోవటం బావుంది. తన తప్పు దిద్దుకోవటం కూడా బావుంది. ఆ తర్వాత ఆ మారిన మనస్సుతో అతను తన వ్యాపారం చేసుకున్నట్లు చూపించవచ్చు. కానీ రచయిత్రి ఒక అడుగు ముందుకేసి కథ ను అక్కడితో ఆపకుండా అతను పూర్తిగా వ్యాపారం వదిలేసి పురాణాలు చదువుకుంటూ వుండిపోయినట్లు….ఆ మూగ పిల్లను ఎలాగైనా మళ్ళీ ఒకసారి చూడాలనుకుంటున్నట్లు చెప్పడం దగ్గరే కొంచెం ఆగి ఆలోచించాల్సి వచ్చింది.
  మూగపిల్ల తప్పనిసరిగా శెట్టి మనసు మార్చేసింది. జీవితం పట్ల, వ్యాపారం పట్ల అతని దృక్పథం కూడా మార్చింది. అది కాక శెట్టి కి మూగపిల్ల మీద ఒక అవ్యాజ్యమైన ప్రేమ కూడా అంకురించింది. ఆ ప్రేమ అతని లోని డబ్బు పట్ల కాపీనాన్ని కూడా అధిగమించింది. ఒక తండ్రి కి ఒక పిల్ల పట్ల కలిగే ప్రేమ. ఆ ప్రేమ కి ఒక కారణం వుండదు. తిరిగి దాని నుంచి ఏదో పొందాలన్న కోరిక వుండదు. అది ఎవరికి ఎందుకు ఎవరిపై కలుగుతుందో చెప్పలేం. అది చూపించింది రచయిత్రి ఈ కథలో. అయితే అది సహజంగా వుందా లేదా అన్నది ఒక్కో పాఠకుడు ఒక్కోలా ఫీల్ అవవచ్చు.

  మెచ్చుకోండి

 5. @ మాధురీకృష్ణ, మీరు తెలుగులో రాయలేకపోయినా చదవగలరని అర్థమవుతోంది. అంచేత, మీ అలవాటు ప్రకారం మీరు ఇంగ్లీషులో రాయండి. నేను తెలుగులో సమాధానం ఇస్తాను.
  పోతే, మీరు రచయిత కానీ విమర్శకుడు కానీ కానక్కర్లేదు. కథ చదివినతరవాత మీకు ఏం అనిపించిందో (your observations) అదే నాకు కావలసింది. మీరు మంచి పాయింట్సే చెప్పేరు. అందుకు ధన్యవాదాలు.

  మెచ్చుకోండి

 6. It’s a very heartening presentation of a real life story. I said ‘real life story’ because ‘shetty’, his wife, the girl, the elderly woman, the father of the girl….all characters are from the society. Each one of us, at times, can identify ourselves with ‘shetty’ and the little girl and also the situation explained.. These two characters mirror our own qualification, disqualification and ‘mis’qualification. I had tears in my eyes several times while reading the ‘story’. Bhanumathi garu had put the subtle introspection of the mind, the regular struggle of the mind and heart to dominate the other in detail. It satisfied the lay person in me.

  Please donot take this as part of your regular comments. Mine is only an observation. Iam neither a writer nor a critic. I have no knowledge of grammar and language, kinds of stories and details of presentation. I’m only a reader.

  మెచ్చుకోండి

 7. @ లలిత, నావిశ్లేషణ చదివినతరవాతా, చదవకముందూ – మంచి పాయింటే 🙂 అది కూడా ఒకరకం ఎక్సర్సైజే అనుకుంటా. మీరు మీ అభిప్రాయం చెప్పడానికి మొహమాటపడకండి. మరొకరు వెలిబుచ్చిన అభిప్రాయం చూసినతరవాత మన అభిప్రాయం మారడానికి అవకాశం ఉంటుంది. అందులో తప్పేమీలేదు కదా. మీరన్నమాట – నిడివి విషయంలోనూ, subtlityవిషయంలోనూ కూడా నిజమే. భానుమతి కథల్లో subtlity లేక suggestion తక్కువే. నేను కూడా మిగతావారి అభిప్రాయాలకోసం ఎదురు చూస్తున్నాను.

  మెచ్చుకోండి

 8. మాలతి గారూ,
  స్వార్థపరుడు కథ రచయిత గురించి చదవక ముందు చదివాను. ఈ సారి ముందు మీ విశ్లేషణ చదివేశాను.
  దాంతో నేను నిర్మొహమాటంగా అభిప్రాయం చెప్పడానికి కష్టపడుతున్నాను. ఐనా ప్రయత్నిస్తున్నాను.

  కథ నిడివి ఎక్కువ అనిపించింది నాకు. మరీ సూటిగా చెప్పినట్టు అనిపిస్తోంది, చెప్పదల్చుకున్నది. కొంచెం subtlity ఉంటే బావుండును అనిపించింది.
  స్వార్థపరుడులో పాత్రల స్వభావం స్పష్టంగా కథకుడే తెలియపరిచినా, అది వేరేలా ఉంది.
  అప్పటికీ శెట్టి స్వభావం అర్థం చేసుకోవడం కష్టంగా ఉంది.
  మళ్ళీ చదువుతాను.
  వేరే అభిప్రాయాల కోసం ఎదురు చూస్తున్నాను.
  అవి నా అభిప్రాయాన్నీ, నేను కథ చదివే తీరునీ ఎలా ప్రభావితం చేస్తాయో చూడాలి.

  మెచ్చుకోండి

 9. మాధురీకృష్ణ గారూ, అయ్యో నాదే పొరపాటు. తెలియజేసినందుకు మీకు నాధన్యవాదాలు.
  ఇప్పుడు కరెక్ట్ చేసి పెట్టేను. చూడండి.
  అన్నట్టు సుజాతగారి తప్పు కాదండీ. నేనే జీరాక్స్ చేసింది. నాపేరు మాలతి. -:))

  మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.