కోరికలసత్యం – ఈకథలో మీకు నచ్చినఅంశాలు ఏమిటి?

ఇంతకుముందు రెండు కథలు చర్చకి పెట్టినప్పుడు చాలామంది పాఠకులు ఉత్సాహం చూపేరు. ఈసారి ప్రముఖ రచయిత బలివాడ కాంతారావుగారి కథ “కోరికలసత్యం” పెడుతున్నాను మీ స్పందనలకోసం.

ఇదిచర్చ కాదు. ఒకరి అభిప్రాయాలు మరొకరిమీద రుద్దే యత్నం అసలే కాదు. ఈకథ చదివినతరవాత మీకు ఏం తోచిందో, ఈకథలో మీకు నచ్చిన అంశాలు ఏమిటో, నచ్చని అంశాలు ఏమిటో చెప్పండి. అంతే.

బలివాడ కాంతారావు – కోరికలసత్యం

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

3 thoughts on “కోరికలసత్యం – ఈకథలో మీకు నచ్చినఅంశాలు ఏమిటి?”

 1. లలితా, కథ మరోసారి చదివేను మీ ఆలోచనలతో నా ఆలోచనలు పోల్చుకుని చూడడానికి. మీరన్నట్టు “హృదయాహ్లాదాన్నిచ్చే గాలి వీస్తుంటే…” అన్న వాక్యం అసందర్భం అనే అనిపిస్తోంది నాక్కూడా. అక్కడ రామయ్యే తన ఆలోచనలు మరోసారి పరిశీలించి చూసుకున్నట్టు అర్థం చేసుకోడానికి ఆస్కారం లేదు.. మాటాడుతున్నది అవతలిమనిషి కనక. నాక్కూడా అది అర్థం కాలేదు.
  అసలు ఈ కథగురించి మీ అభిప్రాయాలు అడగడానికి కారణం – మొదటిది శైలి. ఏడు చేపలకథలా సూటిగా, తేలిగ్గా సాగిపోతుంది. ఒక కోరిక కోరేడు. అది తీరింది. ఆతరవాత మరొకటి … అలా సాగిపోతుంది సీదా సాదాగా. అయితే, సగం అయేక, కథలో తిరిగినమెలికలు నన్ను ఆలోచింపజేశాయి. లలితలాగే నాక్కూడా, రామయ్య వ్యక్తిత్వంలో పరస్పర విరుద్ధమైన భావాలు కనిపిస్తున్నాయి. అయితే, తద్వారా, రచయిత చెప్పదలుచుకున్నది ఏమిటి?

  మనిషి మనస్తత్త్వం విచిత్రమయినది. ఒక కోరిక తీరితే మరో కోరిక కలుగుతుంది. రామయ్యకి మామూలుగా పైమెట్టుకి ఎక్కాలన్న కోరికలన్నీ తీరేక, జనం తననిగురించి ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలన్న కోరిక కలిగింది. ఒకవిధంగా చూస్తే, నాకిది చిన్నపిల్లలకి కలిగే చిలిపికోరికలా అనిపించింది. ఊరికే ఏమవుతుందో చూద్దాం అని చేసే పనిలా ఉంది. రామయ్య నిజంగా ఆత్మశోధన చేసుకుంటే, చివరలో ఆయన ఆలోచనా, అభిప్రాయాలూ, కోరికా వేరుగా ఉండాలి. ఆత్మజ్ఞానం కలగాలి. అది జరగలేదు.
  అతనికి తెలిసిన నిజం – ఇద్దరిదగ్గర విన్నతరవాత – అతన్ని నిరాశ పరచడం చూసినప్పుడు, ఆ మనిషి ఒక మెట్టు కిందకి దిగినట్టే. ఎంచేతంటే, పైమెట్టుకి ఎక్కాలని ఆశించడం పురోభివృద్ధి.
  ప్రజలు నిజంగా తననిగురించి ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలనుకోడం స్వోత్కర్ష.
  తను ఈఊరు వచ్చినప్పుడు తనకి ఆశ్రయమిచ్చిన చెట్టుదగ్గరికే చివరలో చేరడంలో ఒక సందేశం ఉందనుకుంటాడు. కానీ ఆసందేశం ఆయనని ప్రభావితం చేసినట్టు కనిపించదు తనని చనిపోయేలోగా ఇల్లు చేర్చమని భగవంతుని ప్రార్థంచడంలో. ఆ స్వోత్కర్ష ఇక్కడ పతాకదశకి చేరింది అనిపించింది నాకు.
  సౌమ్యా, “కొనసాగింది” అన్నపదం “తీరింది” అన్న అర్థంలో వాడడం రచయిత ఎందుకు చేశారో నాకు తెలీదు. అది ప్రాంతానికి సంబంధించినది కాదనుకుంటాను. మాది కూడా విశాపట్నమే కానీ నేను ఆ ప్రయోగం ఎక్కడా చూడలేదు. పోతే, predictable – మొదట్లో కోరికల జాబితా ఇచ్చినప్పుడు, అవి అదే వరసలో తీరినప్పుడు నిజమే కానీ చివరలో కూడా ఆయన కోరికలు ఆపాత్రకి తగినట్టే ఉండడం – అందులో poetic justice లేకపోవడం నేను ఊహించలేదు. అంటే కథలో చెప్పదల్చుకున్న నీతి – ఒకరకమైన వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించడమే – కావచ్చు. కానీ ఇలాటి మనుషులు మారరు – ప్రజాభిప్రాయం తెలిసినతరవాత మారిపోయినట్టు చూపడం జరగలేదు – ఈ ముగింపు నేను ఊహించలేదు.
  మీ అభిప్రాయాలు వెలిబుచ్చినందుకు ధన్యవాదాలు.

  మెచ్చుకోండి

 2. ఏమిటో, నాకు పెద్దగా నచ్చలా. చాలా మటుకు predictable గా ఉన్నట్లు అనిపించింది.
  ‘ఈయన పనితనానికి మెచ్చుకున్న మేనేజరు ఆ కోరిక కొనసాగించాడు’ – ‘కొనసాగించడం’ అన్న పదాన్ని ఈ అర్థం తో వాడడం నాకు తమాషాగా ఉంది 🙂 ఎ ప్రాంతం వారి భాష ఇది?

  మెచ్చుకోండి

 3. మాలతి గారూ,
  ఈ కథో, ఇలాంటి కథో ఇంతకుముందెక్కడో చదివినట్టు అనిపిస్తోంది.
  ‘కోరికల సత్యం’ అంటే ఎందుకో గానీ ‘సత్యం’ అన్నది మనిషి పేరు అనుకున్నాను.
  కథ నడిచిన తీరు అంతా ఆసక్తికరంగానే ఉంది.
  కానీ చెప్పదల్చుకున్న సత్యం అంత effective గా అనిపించలేదు నాకు.
  ఒక వ్యక్తి తను సాధించిన విజయాల గురించి ఏమనుకుంటాడో, అతనిని చూసే వారు అదే అనుకోనక్కర్లేదని చెప్పడం బాగా చెప్పారు.
  ఒకరైతే అతను ఆ చెట్టు కింద పడుకునే రోజుల్లోనే సంతోషంగా ఉన్నాడు అని వారికి తెలిసినట్లే చెప్పడం, అసలు రామయ్య ఆలోచనలు అందుకు విరుద్ధంగా ఉండడం, రామయ్య విన్న మిగిలిన అభిప్రాయాలకంటే నన్ను ఎక్కువ ఆలోచింప చేసింది. ఆ మనిషి కూడా అవకాశం దొరికింది కదా అని తన అక్కసు వెళ్ళబుచ్చుకుని తను ‘పొగడడానిని” వక్రంగా సమర్థించుకున్నఆదు. మరి తను పొగిడింది ఆశతో కాదూ?
  కానీ నాకు అర్థం కానిది, రామ్య్య తన మనసులో తను ఎదిగొచ్చిన విధానం గురించి సంతృప్తితోనే ఉన్నాడు.
  ఐతే, “అతను హృదయాహ్లాదాన్నిచ్చే గాలి వీస్తుంటే వునికి మర్చిపోయి తను మరుగు పర్చుకున్న వ్యక్తిత్వాన్ని వెలిగ్రక్కుతున్నాడు” ఈ మాటలు ఎవరిని ఉద్దేశించి అన్నవో, అలా అనడంలో ఉద్దేశ్యమేమిటొ నాకు అర్థం కాలేదు.
  కథ అర్థమైనట్లే ఉంది కానీ అర్థం కాలేదు.
  కీర్తితో పాటు అపకీర్తీ ఇస్తాడు… ఇలాంటి భావం అర్థమైంది.
  ఇంకాస్త ఆలోచించి చెప్పగలనేమో చూస్తాను, నా సమస్యేంటో.
  ఈ లోగా మిగిలిన వారి వ్యాఖ్యలు, మీ సమాధానం ఈ కథను అర్థం చేసుకోవడానికి సాయం చేస్తాయేమో చూడాలి.

  మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s