చాతకపక్షులు బజారులో లభ్యం!

నా ఏకైక నవల చాతకపక్షులు కూడా ప్రచురణ అయిపోయిందనీ, బజారులో దొరుకుతోందనీ ఇప్పుడే జ్యోతిగారు ఈమెయిలిచ్చారు. వివరాలు కూడా అందించేరు, ముఖచిత్రం స్కాన్ చేసి.

ఆ వివరాలివిః

ఇందులో, డా. వైదేహి శశిధర్ ముందుమాట, డా. మధురవాణి, అన్నపూర్ణ గద్దె మంచిమాటలు కూడా ఉన్నాయి.

జరిగిన పెద్ద పొరపాటు – అన్నపూర్ణ బ్లాగు ఎడ్రెస్ పొరపాటున తప్పు ఇచ్చేను. అందుకు నాక్షమాపణలు. ఆమె బ్లాగు http://anu-parimalam.blogspot.com.

176 పేజీలు. వెల. 60 రూపాయిలు.

సాహితి (ఎమెస్కో) ప్రచురణ, విజయవాడ.

హైదరాబాదు బుక్ ఫేయిర్ లో హైదరాబాద్ బుక్ ఫెయిర్ లో ఈ  పుస్తకం ప్రచురణ కర్తలు : ఎమెస్కొ వారి స్టాల్స్: 103, 228, 229. (ఈవార్త అందించిన అనిల్ గారికి ధన్యవాదాలు.

వివరాలు, ముఖచిత్రం అందించిన వలబోజు జ్యోతి గారికి ధన్యవాదాలు.

మీ అందరి ఆదరాభిమానాలూ ఎప్పట్లాగే నాకుంటాయని ఆశిస్తూ

మాలతి

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

13 thoughts on “చాతకపక్షులు బజారులో లభ్యం!”

 1. @ సిరిసిరిమువ్వ, నేనే మీకు ప్రత్యేకంగా మెయిలిద్దామనుకుంటున్నాను. మీ అభిమానానికి ఎంతైనా సంతోషంగా ఉంది. అవును. అయిపోయినతరవాతయినా మరిన్ని కాపీలు తెప్పించి పెట్టొచ్చు కదా.

  మెచ్చుకోండి

 2. మాలతి గారు నేను పుస్తక ప్రదర్శనకి 25 న వెళ్లాను..అప్పటికే మీ చాతక పక్షులు పుస్తకాలు అయిపోయాయి. 20 పుస్తకాలు పెట్టామండి..అన్నీ అయిపోయాయి అని ఎమెస్కో వాళ్లు చెప్పారు..కొంచం ఎక్కువ పెట్టుండాల్సింది అని ఓ సలహా ఇచ్చి వచ్చాను.

  మెచ్చుకోండి

 3. పద్మవల్లిగారూ, మీరు నాకథలు చదువుతున్నారంటే నాకు చాలా ఆనందంగా ఉంది. కథల అత్తయ్యగారు avkf.org లో దొరుకుతోంది కానీ చాతకపక్షులు ఇండియానించే మనవాళ్ళెవరైనా వస్తుంటే వారిద్వారా తెప్పించుకోవాలనుకుంటాను. మరొకసారి ధన్యవాదాలు.

  మెచ్చుకోండి

 4. మాలతి గారూ
  మీ రెండు పుస్తకాలు అచ్చు అయిన సందర్భంలో మీకు నా అభినందనలు.
  చాతకపక్షులు , మీ బ్లాగ్లో రెండు సార్లు వచ్చినప్పుడు కూడా చదివాను . నాకు మొదట్లో ఆన్లైన్ లో సాహిత్యం పరిచయమయినపుడు 1995 లో,
  ఈమాట, తూలిక లాంటి చోట, ఒకరకంగా మీ కథలు తోనే తొలి పరిచయం.
  avfk .org వాళ్ల నుండి తెప్పిచుకోవాలి ఇవి తొందరలోనే.
  పద్మవల్లి

  మెచ్చుకోండి

 5. కల్పన, ఆఁ, ఈ యేడు బాగున్నట్టే ఉంది! అభినందనలకి ధన్యవాదాలు.
  సిరిసిరిమువ్వ, ధన్యవాదాలండీ. మీరందరూ కొంటారని వాళ్ళకి చెప్పేను మరి :)). అట్టమీద బొమ్మ – వాళ్ళకి నిలయ చిత్రకారులున్నారుట వాళ్లచేత వేయిస్తాం అన్నారు. సరే అన్నాను.

  మెచ్చుకోండి

 6. మాలతి గారు,

  అబినందనలు. ఏకైక నవల అంటే బాగలేదు కానీ ఆ చేత్తోనే ఇంకోటి మొదలుపెట్టండి. ఈ ఏడాది మీకు బాగున్నట్లుంది. రెండు పుస్తకాలు బయటకి వచ్చాయి. మరో సారి అభినందనలు.

  కల్పన

  మెచ్చుకోండి

 7. @ అనిల్, ఎమెస్కో వారి స్టాల్ నెంబరు నాకు తెలీదండీ. అక్కడ స్థానికులెవరైనా చెప్పాలి. అసలు 16 తారీకు వరకూ తెలీదేమో..

  మెచ్చుకోండి

 8. సంతోషం..రేపు పదహారు నుండి హైదరాబాద్ బుక్ ఫేయిర్. ఎమ్‌ ఎస్‌ కో వారి స్టాల్ నెంబరు కూడా తెలిపితే ఆ స్టాల్ లోనే పుస్తకం కొనుక్కునేవారికి సులభం గా ఉంటుంది.

  మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s