కథల అత్తయ్యగారు పుస్తకంమీద మరో సమీక్ష

ఈరోజు పొద్దున్నే ఏం తోచక అంతర్జాలంలో చూస్తుంటే  నా కథల అత్తయ్యగారు పుస్తకంమీద మరో సమీక్ష   సి. పి. బ్రౌన్ ఎకాడమీ వారి సైటులో కనిపించింది.

లింకు – ఇక్కడhttp://www.cpbrownacademy.org/bookreviews1/222.htm

ఇంతవరకూ ఇప్పటికి మూడు సమీక్షలొచ్చేయి. ఎవరూ అక్షరదోషాలగురించి ప్రస్తావించలేదు. అంటే కథలమీద దృష్టి పెట్టేవారికి కనీసం కొందరికి ఈ అక్షరదోషాలూ అవీ అంతగా బాధగా అనిపించలేదు అనుకుంటున్నాను. నిజం చెప్పాలంటే నాకది సంతోషంగానే ఉంది. -:))

మాలతి

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

5 thoughts on “కథల అత్తయ్యగారు పుస్తకంమీద మరో సమీక్ష”

 1. అక్షర దోషాలు ఎక్కువుంటే నామట్టుకు నాకైతే చదివేందుకు ఇబ్బంది. ఆట్టే చదవలేను. అక్షరదోషాలు ఓవర్లుక్ చేసి చదివేంత తెలివి నాకు లేదు కనుక, అలా చేయడం -పైపైన చదవడమా, లేదంటే, అక్షరదోషాలున్నాయని కూడా గుర్తు పట్టలేనంతగా కథలో మునిగిపోవడమా? అన్నది నాకు తెలియదు. నాకు అర్థమైనంతలో – నిజంగా లోతుగా చదివేవారు అక్షరదోషాలను విస్మరించలేరు అని. అది తప్పు కావొచ్చు. ప్రస్తుతానికి నేను ఇది నమ్ముతున్నాను.

  అసలింతకీ, టైపోలు ఓవర్లుక్ చేయడం మామూలుగా మనుషుల స్వభావమే. నిజజీవితంలో, చాలా చోట్ల టైపోలను మనం పట్టించుకోము అన్నది తెలిసిన విషయమే. ఒక సరదా ఉదాహరణ ఇక్కడ చూడవచ్చు. కనుక, ఓవర్లుక్ చేయడం కథల్లో లీనమవడం అనుకోనక్కర్లేదు..

  ఏదేమైనా, రచన గురించి వచ్చే విమర్శలని తప్ప అచ్చుతప్పుల గురించి వచ్చిన వ్యాఖ్యలు రచయిత వ్యక్తిగతంగా తనపై విమర్శగా తీసుకోనక్కర్లేదు. అది ప్రచురణకర్తల బాధ్యత అని నా అభిప్రాయం.

  మెచ్చుకోండి

 2. @ సుజాతా, పుస్తకం చూసినతరవాత నీకు కలిగిన అభిప్రాయం నువ్వు రాసేవు. అది మార్చుకోమని నేను అడగడంలేదు. నేనయితే ఏం చేసి ఉండేదాన్ని అని తరవాత ఆలోచిస్తే నాకు తోచినది, – ముఖ్యంగా కొందరు పుస్తకం పుచ్చుకుని ఆపకుండా అన్ని కథలూ చదివేశారు అని కూడా విన్నతరవాత –
  పుస్తకంలో ప్రథానాంశం వస్తువు. సమీక్షగా కానీ మరోలా కానీ పుస్తకంగురించి మాటాడుతున్నప్పుడు కథల్లో ఏం ఉన్నాయి, ఎలా చెప్పేరు అన్నవి ముందు మాటాడతాను. తరవాత physical qualities – అట్టమీద బొమ్మ, అక్షరదోషాలూ,,, గట్రా.
  ఎంచేతంటే, వస్తువుగురించి తెలిస్తే రచయితకి తన రచనలు మెరుగుపరుచునే అవకాశం ఉంటుంది. పాఠకులు ఆ పుస్తకం చదడమో మానుకోడమో చెయ్యడానికి అవకాశం ఉంటుంది. .
  అక్షరదోషాలూ, అన్వయదోషాలూ ప్రచురణకర్తలు చూసుకోవాలి. నిజానికి విశాలాంధ్రలో తరుచూ పుస్తకాలు కొనే ఖాతాదారులు వాళ్ళకే చెప్పొచ్చు పుస్తకాలు ఇలా వేస్తే మేం కొనమండీ అని. లేదా మా డబ్బు మాకిచ్చేయండి అని కూడా అడగొచ్చు.
  Of course, నువ్వు సమీక్ష రాయలేదు కనక నీకు ఇది వర్తించదు. నీలాగే నేను కూడా నా అభిప్రాయాలు చెప్తున్నా అంతే.

  మెచ్చుకోండి

 3. మాలతి గారూ, కథలు బాగుంటాయనే ఊహతోనే పుస్తకాలు కొంటాం. కథలు బాగున్నాయి కదాని అక్షర దోషాలను వదిలేయలేం! ఒకటో అరో కాదు! దాదాపు బోల్డు పేజీల్లో!

  ఇంకోటి, సమీక్షకులు కథల్ని మొత్తం పట్టి పట్టి చదవరని మీకు తెలీదని అనుకోను. రాండమ్ గా చదివేసి మొత్తం మీద ఓకే అని రాసే సమీక్షలే ఇవాళ ఎక్కువ.

  మంచి కథలు అచ్చు తప్పులు లేకుండా ఉంటే మరింత బాగుంటాయనే ఉద్దేశంతోనే అయినా, మొత్తం మీద ఈ పుస్తకంలోని అచ్చుతప్పుల గురించి ప్రస్తావించడం నా పొరపాటుగా తోస్తోంది.

  కానీ తప్పలేదు, అచ్చుతప్పుల్ని ఒప్పేసుకోడం నా వల్లకాని పని.

  మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.