లక్ష్మీ రాఘవగారి కథ మీ అభిప్రాయాలకోసం

నేను మొదలుపెట్టిన ఈ ప్రణాలికలో – మీ కథలు చర్చకి పెట్టడం – ఇది రెండో కథ. నా కోరిక మన్నించి తన కథను నాకు పంపిన లక్ష్మీ రాఘవగారికి ధన్యవాదాలు. లలితగారి కథకి వ్యాఖ్యలు చేసిన వారందరికీ మరోసారి ధన్యవాదాలు. ఆ వ్యాఖ్యలు లలితగారికే కాక, నాకు కూడా జ్ఞానదాయకంగా ఉన్నాయి. అలాగే ఈ కథకి కూడా పాఠకులు ఇతోధికంగా తమ తమ అభిప్రాయాలు వెల్లడించగలరని ఆశిస్తున్నాను.

మాలతి

—————————————————————————–

                                   గుండె అలిసింది    

రచన: లక్ష్మీ రాఘవ

సర్వ హక్కులు రచయిత్రివి.

“కారు పంపుతున్నా ఒక్క సారి టౌనుకు రామ్మా “ వర్దనమ్మకు రామచందర్ రావు దగ్గరినుండి వచ్చిన ఆ ఫోను  అర్థం  కాలేదు

“ ఆయన మీ దగ్గరికే వచ్చారన్నయ్యా “

‘అవున్నమ్మ వాడు ఇక్కడనే వున్నాడు.. కాస్త నలతగావుంది. అందుకే కారు పంపుతున్నా ..నీవు వచ్చేసేయ్..”

“ ఏమయింది అన్నయ్యా ?” గాబరాగా అంది వర్దనమ్మ.

“ఏమి లేదు . నీవు గాబరా పడవద్దు . ఒక జత బట్టలు వాడికి , నీకు కూడా తెచ్చుకో “

“ అన్నయ్యా ..నాకూ భయంగా వుంది ఏమంటున్నారు మీరు ??”

“ ఏమి లేదమ్మా ..ఒకవేళ డాక్టరు రెండు రోజులు వుండమని చెబితే వుండాలికదా . అందుకే బట్టలు సర్దుకు రా అన్నాను “

“ ఆ….సరే…” అంతకంటే ఏమి మాట్లాడలేక పోయింది వర్ధనమ్మ

****

“టౌనులో మునిసిపల్ ఆఫీసులో పని వుంది చూసుకుని  ఒకసారి  రామచంద్ర ను కలిసి వస్తాను “అని  పొద్దుటే టౌనుకు వెళ్ళాడు వర్ధనమ్మ భర్త  అరవై ఏడేళ్ళ నారాయణ. అలాగే ‘అనింది వర్ధనమ్మ ..ఇప్పుడు రామచంద్ర రావు నుండి ఇలా ఫోను రావడంతో చాలా గాబర అయ్యింది  వర్ధనమ్మకు ! ఏమి నలత వచ్చి వుంటుంది?? అని ఒక్కటే ఆలోచన !! అన్య మన స్క గానే  కొన్ని బట్టలు సర్దుకుంది ..ఇంట్లో వున్నా డబ్బులు లేక్కబెడితే రెండువేలు వున్నాయి .వాటిని చిన్న పర్సులో పెట్టుకుంది. ఇంతలో రామచంద్ర రావు కారు వచ్చింది .ఇంటికి తాళం పెట్టి బయలుదేరింది. దారి పొడుగునా గాబరాతో వూపిరి అందనట్టు శ్వాస కొసం బాధ పడింది ..డ్రైవరును  అడిగింది నారాయణ బాగానే వున్నాడు కదా…అని

“ నేను చూడలేదమ్మ గారూ… మిమ్మల్ని తీసుకు రమ్మని మాత్రం చెప్పారు ‘

టౌను ఆట్టే  దూరం లేదు కాబట్టి  తొందరగానే చేరారు . రామచందర్ రావు  ఇంటికి కాకుండా టౌను మద్యలో వున్న హాస్పిటల్ కు తీసుకు వెళ్ళాడు డ్రైవరు ..

“ హాస్పిటల్ కు ఎందుకు వచ్చాము ??” డ్రైవరు తో గాభరాగా అంది వర్ధనమ్మ .

డ్రైవరు జవాబు చెప్పెంతలో ఆగిన కారు దగ్గరకు రామచంద్రరావు వచ్చి కారు డోర్  తెరిచాడు “రామ్మా “ అంటూ

కారు సీటులో నుండి లేవడం కష్టం అయింది వర్ధనమ్మకు ..గుండె దడ ఎక్కువైంది…

“ఏమయింది అన్నయ్యా ……” చెయ్యి చాపింది ఆసరాకోసం …..ఆచెయ్యి అందుకుని

“ఏమీ కాలేదమ్మా … లోపలి కి రా ..వాడిని నీవు పలకరిస్తే కదా “ అన్నాడతను .

కారు నుండి దిగినా అడుగు వెయ్యడం కష్టం అయ్యింది  అరవై ఏళ్ళ వర్ధనమ్మకు .భర్తకు ఏమీ కాలేదు కదా ..దేవుడిని ప్రార్థించడానికి కూడా తోచలేదు .లోపలి వెడితే హాస్పిటల్ లో ఒక రూంలో పడుకుని వున్నాడు నారాయణ ..ఆత్రుతగా దగ్గర చేరింది వర్ధనమ్మ .

వర్ధనమ్మను చూడగానే ముఖం చాటంత అయ్యింది నారాయణకు !

” ఏమైందండీ?” ఆప్యాయంగా తల నిమురుతూ అంది వర్ధనమ్మ

“ఏమీ లేదే ..బస్సు దిగి నడవబోతుంటే కళ్ళు తిరిగినట్టయింది..పడిపోతాననిపించింది ..వెంటనే ఆటో ఎక్కి రామచంద్ర దగ్గరికి వెళ్ళాను ..వాడేమో ఒకసారి డాక్టర్ దగ్గరికి వెడదాము అని తీసుకు వచ్చాడు ..అంతే “”

“ అంతే కదా “ వర్ధనమ్మ ప్రశ్నకు

“ఆ …” అంటూ రామచంద్ర రావు వైపుకు చూసాడు ..

“ డాక్టరు చూసాక  E C G  తీసుకుంటే బాగుంటుంది  అన్నాడమ్మా  “

“ E C G నా ?”

ఆ మధ్య వర్ధనమ్మ అన్నయ్యకు బాగాలేక పొతే చేసిన టెస్టు లన్ని పరిచయమే……

“ అందులో కొంచం తేడా వుంది.. ఈ రోజు రాత్రికి ఇక్కడే వుంటే ..రేపు మళ్ళి ఒక సారి  E C G  తీసి చెబుతానన్నాడు”

వర్ధనమ్మ గుండె గుబిల్లు మంది ..

“తేడా నా?…అంటే …”

“ఏదో నాకూ అర్థం కాలేదులే ..హార్టు అటాక్ అయితే కాదు ..నీవు గాబరా పడవద్దు “ అన్నాడు రామచంద్ర రావు ..

అప్పటికే వర్ధనమ్మ గుండె రెండు క్షణాలు ఆగి మరీ జోరుగా కొట్టు కున్నట్టయ్యింది ..వెంటనే నారాయణ చెయ్యి గట్టిగా పట్టు కుంది .

“ ఏమీ కాదు వర్దినీ ! మనకు ఏ జబ్బులూ రావులే””

కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి వర్ధనమ్మకు ..కన్నీళ్ళు నారాయణ కంట పడకూడదని ముఖం తిప్పుకుంది…కొంచం తమాయించుకుంది తను అధైర్య పడినట్టు భర్తకు తెలియనీయ కూడదనుకుంది .

“ఆహా …ఏమీ కాదులెండి “ అంది పైకి .

కొంచంసేపయ్యాక రామచంద్ర రావు ‘ఇంటికి  వెళ్ళి కారియరు పంపుతా”నని చెప్పి  బయలు దేరాడు .

నారాయణకు ఆరాత్రి నిద్ర మాత్ర వేసారేమో బాగానే నిద్ర పోయాడు. కాని వర్ధనమ్మ కు కంటి మీద కునుకులేదు..

పెళ్ళయి ముప్పై ఏళ్లు దాటాయి , ఇంతవరకు ఒకరికి ఒకరం అంటూ బ్రతికారు ..పిల్లలు లేరు కనుక మరింత పటిష్టంగా సాగింది వారి అన్యోన్యత !! అనారోగ్యం అంటూ ఎప్పుడూ లేదు ఇద్దరికీ ..ఇప్పుడిలా అవటం తట్టుకో లేక పోతుంది వర్ధనమ్మ .

మరు రోజు డాక్టరు వచ్చి మళ్ళి ఈ సి జీ తీసాడు ….’ మూడు..నాలుగు  బ్లాకులు వున్నాయి ..వెంటనే హైదరాబాదు  వెళ్ళి “ ఆంజియో” చేసుకోవాలి ఏమాత్రం ఆలస్యం కూడదు ..” అన్నాడు

డాక్టర్ మాట వినగానే పడిపోతానేమోనని గోడకు ఆనుకుంది వర్ధనమ్మ ..అక్కడే వున్నా రామచంద్ర రావు ఏమీ గాబరా పడవద్దని హైదరాబాదు లో తనకు తెలిసిన డాక్టరు వున్నాడని , తనుకూడా హైదరాబాదు వస్తానని అన్నాడు.

బాగా కలిగిన కుటుంబం నుండి వచ్చిన రామచంద్ర రావు , మిత్రుడు ,ఆప్తుడు అయిన నారాయణని ఆదుకోవడానికి దేవుడే దిగివచ్చినట్టు అన్నిటికి సహాయం అయ్యాడు . అదేరోజు హైదరాబాదు   ప్రయాణం అయ్యారు ముగ్గురూ.

ఎంతో పెద్దదైన ప్రైవేటు హాస్పిటల్ కి తీసుకెళ్ళాడు  రామచంద్ర రావు. అక్కడి డాక్టర్ అతనికి బాగా తెలిసిన వాడు అవటంవల్ల  ఏమాత్రం కష్టం కాలేదు .మొదట అన్నీ టెస్టులు చేసారు . T M T ,ECHO, BLOOD TEST  అన్నీ చేసిన ఏమీ లోపం వున్నట్టు తెలియలేదు .E C G  తో సహా అన్ని రిపోర్టులు తీసుకుని డాక్టరు ను కలిసారు. రిపోర్టు లన్ని చూసాక హార్టు కు సంబంధించి నంతవరకు ఏమీ ప్రాబ్లం లేదు అని తేల్చాడు ..

“అబ్బా….” అనుకున్నారు ముగ్గురూ. అందరికంటే సంతోషం కలిగింది వర్ధనమ్మకు.

“ మరీ మావూరి డాక్టరు అలా చెప్పాడే …” సందేహంగా అడిగాడు రామచంద్ర రావు .

“ఆయన హార్టు స్పెషలిస్టు కాదు కదా..ఏదో తేడా వుంది అనుకున్నాడు లేదా అతని E C G మిషను సరిగా పని చెయ్యలేదనుకుంటా “”

సందేహం నివృత్తి అవడం తో కాస్త మనసు తేలికైంది ..

“ చాలు ప్రభూ ´అని దేవుడికి మొక్కుకుంది మనసారా .ఒకటిన్నర రోజుగా ‘మృత్యుంజయ మంత్రం ‘ జపం చేసుకుంటూ వుండటం ఎంత వుపయోగ పడిందో.. అనుకుంది

“ అన్నయ్య మీరు లేక పొతే నేను ఏమీ చేసేదాన్ని ?” అంటూ కన్నీళ్ళతో  రామచ౦ద్ర రావు  చేతులు పట్ట్టు కుంది .

“నారాయణ కు చెయ్యక పొతే ఎవరికీ చేస్తానమ్మా ..మీకు ఏమాత్రం కష్టం అయిన నేనున్నానని మరచిపోవద్దు …” నారాయణ భుజం మీద చెయ్యి వేస్తూ అన్నాడు రామచంద్ర రావు

ఆరోజే వూరికి బయలుదేరారు నారాయణ దంపతులు. హైదరాబాదు  లో పని వుందని అక్కడే ఆగాడు రామచంద్ర రావు .

**********

ఇంటికి చేరిన  నారాయణ దంపతులు ఎంతో గండం గడిచినట్టు ఫీలయ్యారు . భర్తను మనసారా కౌగలించుకుని ఏడ్చింది వర్ధనమ్మ .

“ ఏమీ కాలేదుగా వర్ధనీ “

“ ఏమైనా అయ్యుంటే  నేనేమి అయ్యేదాన్నండి ?’అని బావురుమంది.

భార్యను ఘాడంగా కౌగలించుకు ని వీపు నిమిరాడు నారాయణ.

ఆరోజే దేవుడికి దీపం పెట్టి ఎంతో కృతజ్ఞత తెలుపుకుంది వర్ధనమ్మ .

మరు రోజు ప్రొద్దుటే వర్ధనమ్మ ఇంకా నిదుర లేవక పొతే ‘అలసి పోయింది పరవాలేదు అనుకుంటూ వంటింట్లోకి వెళ్ళి కాఫి పెట్టి తీసుకుని వచ్చి వర్ధనిని లేపబోయాడు. అంతే !!!

నిర్జీవంగా వున్నా వర్ధనిని చూసి షాకు తిన్నాడు!!!!

భర్త అనారోగ్యం మాట విన్నప్పటి నుండి వర్ధనమ్మ గుండె దెబ్బతింది . భర్త ఆరోగ్యం బాగుందని తెలిసి సంతోషమైనా ఆమె గుండె అలిసింది . అతని ఆయుస్సు కు తన ఆయుస్సు పోసి తాను తప్పుకుంది.

000

(అక్టోబరు 4, 2011)

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

10 thoughts on “లక్ష్మీ రాఘవగారి కథ మీ అభిప్రాయాలకోసం”

 1. లక్ష్మీ రాఘవ గారు , చాలా రోజులు నెట్ కి దూరంగా వుండటంతో మీ కథ సమయానికి చూడలేకపోయాను.
  నాకు చిన్న కథలు ఎక్కువ నచ్చుతాయి. ఆ విధంగా కూడా ఈ కథ నాకు నచ్చింది . భర్త ఆరోగ్యం కోసం భార్య పడ్డా ఆరాటం , ఆవేదన ఈ చిన్ని కథలో బాగా చూపించారు. ఊహించని ముగింపు మీ కథ మరింత బలాన్నిచ్చింది.

  మాలతి గారు: విరామ చిహ్నాలు, పేరాల ప్రారంభం ముగింపు వంటివాటిని గురించి కూడా దయచేసి ఒక పాఠం చెబుదురూ .

  మెచ్చుకోండి

 2. athidi గారూ,
  మీరు చెప్పింది కరెక్టే ..భర్త షాకు మాత్రమే తిన్నాడా అన్నది కాకుండా ఎలా ఫీల్ అయ్యాడు అన్నది వివరించి వుండచ్చు కాని మీరు గమనించి వుంటే కథ అంతా భార్య ఫీలింగ్స్ చుట్టూనే తిరుగుతుంది ..దానికి మించి రాయలనుకుంటే g.s lakshmi garu అన్నట్టు ఇంకా కొన్ని సంఘటనలు రాయాల్సి వచ్చేది. అప్పుడు మామూలు పెద్ద కథ అయ్యేది .నిజం కాదంటారా?
  ఏది ఏమైనా మీ అభిప్రాయాలకు వివరణ ఇవ్వటం వల్ల నేను ఏమీ చెప్పదలచుకున్నా అది బాగా strong గా వుండాలన్నది అర్టం అయ్యేలాచేసింది .
  మీకు ధన్యవాదాలు.

  మాలతిగారూ
  ఇప్పుడు అనుభవపూర్వకంగా తప్పులు ఎలా వుంటాయో తెలిసింది ..దీనికి మరో మారు ధన్యవాదాలు.

  మెచ్చుకోండి

 3. g.s lakshmi గారూ ,
  మీరు సూచించిన ది ఆలోచించాను ..నేను చెప్పదలుచుకున్నది ఒక్కటే భర్తకు serious problem వచ్చినప్పుడు కలిగే ఆందోళన ఎలావుంటుంది ? ఇంతకు దారి తీస్తుంది అని మాత్రమే ..ఈకోణం లో ఆలోచిస్తే ఎలావుంటుందో చెప్పండి .

  మెచ్చుకోండి

 4. అతిధి గారూ ,
  మీ విమర్శ చూసి నాకూ చాలా సంతోషం అయ్యింది .
  ఎందుకంటే మొదటిసారి నాకథ ఇలా పబ్లిక్ గా అభిప్రాయాలు కొసం ప్రచురింపబడింది ..నా తప్పులు తెలుసుకునే అవకాసం కలిగింది .
  దీనికి మొదటిగా నిడదవోలు మాలతీ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
  కథలో ఏముంది అని మీరు అన్నా , వుంది అని నేనంటాను ఎందుకంటే ఇలాకూడా జరుగుతుంది కనుక !
  ఒక్కొక్కసారి డాక్టర్ర్లు చేసె చిన్న తప్పులు పేషంటు కంటే , వారి దగ్గరవారికి ఎంత ఆరాటం కలిగిస్తుందో ,అది ఎంత కు దారితీస్తుందో చెప్పాలన్న ప్రయత్నం… ఇలా జరిగిన కేసులు వున్నాయి. ఇండియాలో ఎంతమంది అమెరికా వారి లాగా ‘సూ’ చేస్తాము ?
  ఇక పిల్లలు లేకపోతె అన్యోన్యత పటిష్టం గా….తప్పు కాదు.ఇక్కడ diversion లేని ప్రేమ , మనం ఇద్దరమే అన్న feeling తో ఇంకా closeness ఎక్కువ వుంటుంది.
  టైపింగ్ తప్పులు ఒప్పుకుంటాను ..బామ్మగా రచనలు మొదలు పెట్టి కంప్యూటర్ లో టైపు చెయ్యడం నేర్చుకున్నాను కనుక కాని అలాగని చెప్పి excuse అడగకూడదు పబ్లిగ్గా . చేతితో రాసినంత సులభం కాదు అనిపిస్తుంది.
  మీ అమూల్యమైన అభిప్రాయం తెలిపినందుకు ధన్యవాదాలు

  మెచ్చుకోండి

 5. రచయిత్రి గారూ,
  మీ కధని లాగి లాగి పాకం పడుతున్నానని అనుకోకండి. మీ కధ మమ్మల్ని ఆలోచింపజేసి, కామెంటు మా చేత రాయించిందంటే, అది మంచి విషయమే కదా?

  కధ భార్యాభర్తల మధ్య అన్యోన్యత అని మిగిలిన పాఠకులు అన్నారు. భర్త గురించి బాగా ఆందోళన చెంది మరణించిన భార్య అన్యోన్యత బాగానే అర్థం అయింది. మరి భర్త సంగతేమిటీ? భార్య మరణించినా, “షాకు” మాత్రమే తిన్నాడంటే, అతని అన్యోన్యత గురించి ప్రశ్నలు రావా? ఈ అన్యోన్యతలో, ఈ కధలో, సమానత్వం కనబడలేదు. ఒక వేపు నించి మాత్రమే కనబడింది ఈ అన్యోన్యత.

  ఇదే చెప్పాలనిపించింది.
  అతిధి

  మెచ్చుకోండి

 6. ఏదైనా కథ చదివి అభిప్రాయం చెప్పమన్నప్పుడు కాస్త ఇబ్బందే..
  ఎందుకంటే..
  ఏదైనా పని చేసేవాళ్ళు చిత్తశుధ్ధితోటే చేస్తారు. కాని చూసేవారి దృష్టిని బట్టి అభిప్రాయాలు మారుతూ వుంటాయి.
  జిహ్వకో రుచి అన్నట్టు ఒక్కొక్కరిదీ ఒక్కొక్కఅభిప్రాయం అవుతుంది.
  ఈ కథలో భార్యాభర్తల మధ్య గల అనురాగం ఎంతగా గుండె లోతులదాకా వుందో చెప్పి, అంత అనురాగం వున్న గుండె అలసటను తట్టుకోలేకపోయిందన్నట్టు చెప్పారు.
  మానసికంగా భార్యాభర్తలు ఎంత అనురాగంగా వుండాలో హృద్యంగా చెప్పారు.
  కొసమెరుపు కథకి అందమిచ్చింది.
  కాని..
  ఇప్పుడు చెప్పబోయేది నా అభిప్రాయం మాత్రమే..
  గుండే అలిసిపోయిందని చెప్పడానికి రచయిత్రి ఆవిడ మాటల్లో కాకుండా వారి దాంపత్యం లోని కొన్ని సంఘటనలను వివరిస్తే ఇంకొంచెం బలంగా పాఠకులకి హత్తుకునేది.
  ఉదాహరణకి వారికి పిల్లలు లేనందుకు బంధుమిత్రులు మాటలనడం, ఆ సమయంలో ఒకరినొకరు ఓదార్చుకోవడం లాంటివి. ఇది ఉదాహరణ మాత్రమే. ఇదే కాకపోయినా వారి మధ్య గల అనురాగం ప్రస్ఫుటించే సంఘటనలు ఏవైనా చెపితే అప్పుడు ముగింపుని ఇంకొంచెం సమర్ధించినట్టవుతుందని నా అభిప్రాయం.

  మెచ్చుకోండి

 7. వ్యాఖ్య చదివి కథను చదవడం ఈ సారి తప్పనిపించింది.
  వ్యాఖ్య చదవకముందు కథ చదివి ఉంటే నా అభిప్రాయం ఎలా ఉండేదో మరి.
  ముఖ్యంగా ముగింపు తెలిసిపోవడం నేను కథని చదివే తీరుని ప్రభావితం చేసింది.
  వర్ధనమ్మ వేరే ఊళ్ళో ఉన్న భర్తకి ఒంట్లో బాలేక బట్టలు సర్దుకుని బయల్దేరాల్సి రావడం వల్ల కలిగిన ఆందోళనను బాగానే మాటల్లో పెట్టారనుకుంటున్నాను.
  ముగింపులో రచయిత కాకుండా వర్ధనమ్మ భర్తో, బంధువులో ఆ మాటలు అనుకుని ఉంటే “మూఢనమ్మకాని బలపరుస్తున్నారు” అని అనిపించకపోవునేమో అని ఈ వ్యాఖ్య వ్రాస్తుండగా నాకు వచ్చిన ఆలోచన.
  అలాగే పిల్లలు లేక పోవడం వల్ల పటిష్టమైనది అని చెప్పకుండా, వారిద్దరే ఉండడం వల్ల వారు ఒకరికి ఒకరు ఎంత ప్రాణం అయ్యారో చెప్పి ఉంటే బావుండునేమో?

  మెచ్చుకోండి

 8. క్షమించాలి కొంచెం ఘాటుగా విమర్శిస్తున్నందుకు.

  కధ: భర్తకి చిన్న జబ్బు చేస్తే, పెద్ద జబ్బని కంగారు పడి, మానసికంగా ఒత్తిడి తెచ్చుకుని చనిపోతుంది ఒక భార్య.

  అర్థం పర్థం లేని కధ. మూఢ నమ్మకాన్ని చెప్పే కధ.”అతని ఆయుస్సు కు తన ఆయుస్సు పోసి తాను తప్పుకుంది.” అని చెబుతుంది ఈ కధ. చాలా తప్పు. అలాంటివి వుండవు. “మానసికంగా ఒత్తిడికి గురై, వర్థనమ్మ చనిపోయింది” అన్నదే నిజం.

  దీర్ఘాలూ, కామాలూ లేని వాక్య నిర్మాణం. ఎన్నో చోట్ల అయోమయంగా అనిపించింది.

  ఇక అచ్చు తప్పులు చెప్పక్కర్లేదు. చాలానే వున్నాయి.
  “పిల్లలు లేరు కనుక మరింత పటిష్టంగా సాగింది వారి అన్యోన్యత !!” అని ఒక తప్పు వాక్యం. “పిల్లలుంటే, అన్యోన్యత పటిష్టంగా వుండదు” అనే అర్థాన్ని ఇచ్చే తప్పుడు వాక్యం. వేరేలా చెప్పాలి ఈ వాక్యం.

  పంక్చుయేషను సరిగా లేదు చాలా చోట్ల. పీరియడ్‌ తర్వాత స్పేస్‌ వుండాలి, ముందర కాదు. ఒక్కో చోట రెండేసి పీరియడ్లు అనవసరంగా.

  – అతిధి

  మెచ్చుకోండి

 9. కథ చదువుతుంటే ఇందులో ఏముంది భార్యా భర్తల అనురాగం ప్రేమే కదా అని చివరకు వచ్చే సరికి ఆ కొస మెరుపా లేదా కొస మలుపా ఏమో ఒక్కింత బాధ అనిపించినా నచ్చింది.

  మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s