ఊసుపోక – ఇ-చదువుడు వీరాభిమాని!!

(ఎన్నెమ్మకతలు 96)

…ని అయిపోయేను మొన్నటినించీ. గత రెండు టపాల్లో ఇ-చదువుడు కష్టాలే రాసేను కనక, ఆ కంపెనీవారికి అన్యాయం చెయ్యాలనే దురుద్దేశం నాకు లేదు కనక, పాపపరిహారార్థం, మొన్న జరిగిన వింతలూ, ఆపైన నేను వీరాభిమానిగా మారిపోయినవైనం వివరించేస్తాను అట్టే కాలయాపన చేయకుండా.ఒకొకప్పుడు మనం ఏదైనా అనుకుంటే కాకిచేత కబురంపడం అంటారు చూడండీ అలా ఏ కాకమ్మో గాలమ్మో అలా అలా మోసుకుపోయి అవతలివారికి వార్త చేరవేస్తుందేమో అనిపిస్తుంది. అయ్యో కాలయాపన చేసేస్తున్నాను మళ్ళీ.

ఇంతకీ నేను ఇక్కడ ఓ కంప్యూటరు షాపుకి వెళ్ళి, ఇలా నేను కిండిల్ టచ్ కొన్నానూ, దాన్లో landscape orientation వచ్చే మార్గం ఏమైనా ఉందా అనడిగేను. అతను ఆనవాయితీ తప్పకుండా, నేనెక్కడా అలాటిది కనివిని ఎరగను అన్నాడు. సరే, అనుకుని ఇంటికి వచ్చేసి, నాకిండిలు తీసుకుని కూర్చునేసరికి, మేం సాఫ్టువేరు అప్డేటు చేసేం, మీ కిండిలులోకి దింపుకోండి అని వార్త వచ్చింది. సరే, అదేమిటో చూద్దాం అని దింపుకున్నాను. చూస్తుండగానే, నాకళ్ళముందే, మొట్టమొదట జరిగినది – తెరమీద అక్షరాలు తళుక్కున మెరిసి, ఇంతకుముందుకంటే చాలా చక్కగా కనిపించేయి.

ఆ తరవాత తెలుసుకున్న విషయాలు –

– తెలుగు అక్షరాలు చాలా చక్కగా కనిపిస్తున్నాయి. (గమనిక, కొన్ని తెలుగు పుస్తకాలు కాపీ చెయ్యడంలోనే లోపాలున్నాయి. దానికి ఎమెజానువారు చెయ్యగలిగిందేమీ లేదు).

– ఫాంటు సైజు మార్చడం కూడా తేలిక.

– పైన చెప్పిన landscape orientation మూలంగా చదవడం చాలా తేలిక అవుతోంది.

– మన కంప్యూటరులో kindle app దింపుకుని, దాన్లోంచి కిండిలుకి పుస్తకం పంపుతే, అది landscapeలోనే సరఫరా చేస్తుంది. అంటే పోర్ట్రేటుకు మార్చుకోవచ్చు కానీ, చదవడానికి లాండ్‌స్కేపే బాగుంది.

– డచ్, పోర్చుగీసు, జర్మన్, ఇటాలియన్, స్పానిష్, ఫ్రెంచ్ డిక్ష్నరీలు కూడా చూసుకోవచ్చు!! (ఇది యూరపులో తిరిగేవారు గ్రహించవలెను :p)

దీనివల్ల నాఇంగ్లీషు పుస్తకాలచదువు మెరుగు పడుతుందా అని హేళన చేసేను. మరి ఇప్పుడు నేను మార్పు 39లో చెప్పిన The Moral and Intellectual Diversity of Races చదువుతున్నాను. మరి ఇంగ్లీషులో ఉన్న ఈ బృహత్ గ్రంథం చదవడానికీ నాకు ఈ ఇ-వాచకం ఇష్టం అయిపోడానికీ ఏమైనా అవినాభావసంబంధం ఉందా? ఏమో మరి. నాకు మాత్రం  ఈ రెంటితో ఎంతో కాలక్షేపం అయిపోతోందని చెప్పగలను.

చివరిమాటగా, ఇ-చదువుడు అనడంకంటే, ఈవాచకం అనడం బాగుందని నిశ్చయించేను.

(మే 12, 2012.)

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

5 thoughts on “ఊసుపోక – ఇ-చదువుడు వీరాభిమాని!!”

 1. @ సౌమ్య, వినదగు ఎవ్వరు చెప్పిన అన్నది నీపట్ల వర్తించదనుకుంటా :p. @ నోరూ, మెదడూ తిరిగిపోయే పుస్తకాలు, ఆఁ, నాకూ ఆశ్చర్యంగానే ఉంది అది చదువుతున్నానంటే. నువ్వు కనీసం 13, 14 అధ్యాయాలు చదువు అని చెప్దును గానీ నువ్వు వినవని తెలుసు కదా. :))
  @ ఉష, మీరూ ఓ చెయ్యి వేసినందుకు నాకు పరమానందంగా ఉంది. ధన్యవాదాలు.

  మెచ్చుకోండి

 2. బావుంది. నేను ఉద్యమ ప్రచారం కావిస్తున్నాను. నాకు గాక మరొక ఇద్దరికి కొన్నాను. మావి నూక్ సంఘాలు. 🙂 ఈ మధ్యన పరిచయమైన ఇజ్రేయిలీ అతను నా వంతు కృషిని మెచ్చుకుని తానూ కొనుక్కున్నాడు. నా నాలుగు లెక్క ఆ విధంగా సరిపడింది.

  మెచ్చుకోండి

 3. మీరింత చెప్పాక కూడా నాకు ఓ ఈవాచకం కొనాలన్న తాపత్రేయం కలగదేం! :((
  అయితే, ఇప్పుడు తెలుగు సమస్యలు పరిష్కృతమయ్యాయీ…మీరు నోరు, మెదడూ రెండూ తిరిగిపోయే పేర్లు గల ఆంగ్ల పుస్తకాలు కూడా చదువుతున్నారూ అనమాట!!

  మెచ్చుకోండి

 4. కొత్తపాళీ, హాహా, కనీసం ఇందులోనైనా నేను మీముందున్నాను. అన్నట్టు ఇ-వాచకం పేరు సార్థకం, వాగ్రూపంలో కూడా పుస్తకాలు అందుతాయి కనక!

  మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s