కల్పనా రెంటాలతో కబుర్లు (ఆడియో, విడియో)

మే నెలలో కల్పనా రెంటాల మాయింటికి వచ్చినప్పుడు ఇద్దరం సరదాగా ఆడియోలో విడియోలో రెండు చర్చలు చేసేం. మొదటిభాగం ఆడియోలో నవలమీదా, రెండోభాగం విడియోలో విమర్శనారీతులమీదా మాటాడుకున్నాం.  అయితే ఏ సంసిద్ధతా లేకుండా, ఆషామాషీగా చెప్పుకున్న కబుర్లు కనక చిన్న చిన్న పొరపాట్లు జరిగి ఉండొచ్చు. అందుకు క్షంతవ్యులం -:)).

లింకులు ఇవిగో –

గమనికః  1. విడియో లింకులో రెండు ఫైళ్లు కనిపిస్తాయి కానీ రెండూ ఒకటే. ఒకటి డిలిట్ చెయ్యడానికి ప్రయత్నించేను కానీ అవలేదు.😦

2. విడియో ఫైలు చాలా పెద్దది కనక డౌన్లోడ్ అవడానికి కొంత సమయం పడుతుంది. తొందర పడి, కనిపించడం లేదే అనుకోకండి.

ఆడియో –

http://archive.org/details/InterviewWithKalpanaAndMalarhi

విడియో –
http://archive.org/details/KeeluBommaluDiscussion

రెండు లింకులకీ దారి చూపే పుట ఇదీ, –
http://archive.org/search.php?query=kalpana%20rentala

మీ అభిప్రాయాలు ఇక్కడ కానీ కల్పన బ్లాగులో కానీ పెడితే సంతోషిస్తాం.

– మాలతి

గ్రంధకర్త మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

8 thoughts on “కల్పనా రెంటాలతో కబుర్లు (ఆడియో, విడియో)”

 1. @కొత్తపాళీ: అయితే, మీరు చర్చ పెడుదురూ వీళ్ళిద్దరితో ఈ నవల గురించి…విభేదించవచ్చు అపుడు😉

  ఇష్టం

 2. లక్ష్మి గారు, మా చర్చ విన్నందుకు, ( లేదా చూసినందుకు) థాంక్స్. వీలైతే కీలుబొమ్మలు నవల చదవండి.
  కొత్తపాళీ, అవును..ఆ నవల మీద మా ఇద్దరి అభిప్రాయాలూ ఒకటే అవటం వల్ల పెద్దగా విభేదాలు రాలేదు.:P ఇంతకూ నవల మీద మీ అభిప్రాయం చెప్పనే లేదు. మీరు చదివారా? ఏమనిపించింది?

  ఇష్టం

 3. కొత్తపాళీ, నిజమేనండీ. మంచి పాయింటే. కానీ తనతో మాటాడడంమూలంగా నాకు కొన్ని కొత్త కోణాలు తెలిసేయి. మరోసారి చేస్తే విబేధించే విషయం ఎన్నుకోవాలి. థాంక్స్.

  ఇష్టం

 4. మీరిద్దరూ కూడా విషయాన్ని స్పష్టంగా చెప్పే అలవాటున్నవారు కావడంతో వినడానికి బావుంది. ఎటొచ్చీ మీరద్దరూ ఎక్కడా విభేదించలేదు🙂

  ఇష్టం

 5. @ G.S. Lakshmi గారూ, మా ఆడియో మీకు నచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. విడియో – అవునండీ, పెద్ద ఫైలు కనక అన్ని కంప్యూటర్లూ సరిగా ఆకళించుకోలేవు. యాదాలాపంగా మాటాడుకోడం కనక కొన్ని తప్పులు వచ్చేయి. విడియోలో అనుకుంటా శిల్ఫం అనవలసినచోట శైలి అన్నాను. అయినా మీరన్నట్టు ప్రశ్నలూ, సమాధానాలు అంటూ పకడ్బందీగా చేసుకునే ఇంటర్వ్యూలకంటే ఇలాటివే ఎక్కువ బాగుంటాయి నాకు. మరొకసారి ధన్యవాదాలు.

  ఇష్టం

 6. మాలతిగారూ,
  నేను కొన్ని సాంకేతిక కారణాలవల్ల నా సిస్టమ్ లో వీడియొ చూడలేకపోయాను. కాని కీలుబొమ్మలు నవల మీద మీరూ, కల్పన రెంటాలగారు చర్చించిన ఆడియో విన్నాను.
  చర్చ బాగుంది. ముందుగానే ప్రశ్నలు, జవాబులు రాసుకుని అక్కడ చదివినట్టు కాకుండా మామూలుగా మాట్లాడుకున్నట్టే వుంది. నవలలో పాత్రచిత్రణ, నవల నడిపించిన తీరు, కొన్ని అసహజమైన సన్నివేశాలు, అలా రాయడంలో రచయిత వుద్దేశాలు, అప్పటి సామాజిక పరిస్థితులు అన్నీ చాలా వివరంగా చర్చించారు.
  ఆ నవల నేను ఇప్పటివరకూ చదవలేదు. కాని మీ చర్చ విన్న తర్వాత తప్పకుండా చదవాలన్న అభిప్రాయానికి వచ్చేను.
  ఒక నవలపై ఇంత చక్కటి చర్చ జరిపి దానిని మాకు అందించినందుకు ధన్యవాదాలు.

  ఇష్టం

టపాలో చర్చించిన అంశంమీద వ్యాఖ్యానాలు తెలుగులో రాసిన వ్యాఖ్యలు మాత్రమే అంగీకరింపబడతాయి. తెంగ్లీషులో రాసిన వ్యాఖ్యలు కూడా నాకు సమ్మతం కాదు. కోరుతున్నాను

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / మార్చు )

Connecting to %s