బుచ్చిబాబుమీద నావ్యాసం, తూలిక.నెట్ లో

బుచ్చిబాబుగారి చివరకు మిగిలేది నవలమీద నేను ఇంతకుముందు రాసినవ్యాసం కొంతమందికి చిరాకు కలిగించింది. నిజానికి బుచ్చిబాబు, కుటుంబరావు, రామారావు – వంటి రచయితలని నేను తెలుగు పాఠకులకి పరిచయం చెయ్యఖ్ఖర్లేదు. రాచకొండ విశ్వనాథశాస్త్రి, మల్లాది రామకృష్ణశాస్త్రి కూడా అంతే కానీ వాళ్ళమీద నేను వ్యాసాలు రాయడానికి కారణం వేరేవారు రాయమని అడగడం.

సాధారణంగా నేను చాలామంది పాఠకులదృష్టికి రాని రచయితలూ, అభిప్రాయాలూ రాయడానికి ప్రయత్నిస్తాను. నామాట విని పాఠకులు తమ అభిప్రాయాలు మార్చేసుకుని చివరకు మిగిలేది చదవడం మానేస్తారని నేను అనుకోడం లేదు. సాధారణంగా పుస్తకాలు చదివేవారు నా ఒక్కవ్యాసమే చదివి ఊరుకోరు. మిగతావారు వెలిబుచ్చిన అభిప్రాయాలు కూడా చదువుతారు. నిజానికి, బుచ్చిబాబులాటి రచయితలని మెచ్చుకునేవారే ఎక్కువ. నారచనలు సముద్రంలో కాకిరెట్టలాటివి.  :)).

చివరకు మిగిలేది చదివినప్పుడు మిగతా పాఠకుల్లా నాకు ఒక అద్భుతమైన నవల చదివేనన్న అనుభూతి కలగలేదు. చివరకు మిగిలేది జ్ఞాపకాలే అంటారు రచయిత. మరి దయానిధి తలుచుకుని మురిసిపోగల జ్ఞాపకాలు ఏమిటి? ఈప్రశ్నకి నాకు సమాధానం కనిపించలేదు.

“ఎక్కడో ఏ హంపీలోనో – అన్నీ రాళ్ళు- భగ్న ప్రతిమలు. ఒంటరిగా నిల్చిపోయిన స్థంభాలు ప్రేమ కోసం గుండె రాయి చేసుకున్న రాకుమారిలా విగ్రహాలు అన్ని శిథిలమైపోయి, ఏ అర్థరాత్రో అడుగుల చప్పుడూ, నిట్టూర్పు వినపడితే కదులుతాయేమో ననిపించే ప్రమాద స్థితిలో పడి ఉంటే వాటి మధ్య అమృతం కూచుని విషాదంలో నవ్వుతుంది.

ఎర్రపువ్వులను బంధించుతున్న గడ్డిపోచలు గాలికి ఎండలోమెరుస్తూ లయగా ఆరబెట్టిన ఆకుపచ్చ పట్టుచీరలా, ఎండుకుని, కోమలినిచుట్టుకుంటాయి, ఆకలి దాహాలు లేని అయోమయపు ఆశ దారుణాలుఎరగని దైవత్వం, హద్దులు లేని అనుభవం ఆమె.”

– లాటి వాక్యాలు నాకు పరమ గందరగోళంగా అనిపించేయి. ఇందులో కవితాత్మ అర్థం చేసుకోడం నాతరం కాలేదు. నిజానికి, నా ఇంగ్లీషువ్యాసంలో ఇది అనువదించేను కానీ అస్తవ్యస్తంగా ఉందనే నా అనుమానం. ఎటొచ్చీ ఆయన వాడిన పదచిత్రాలు తెలియజేయడంకోసం అలా వదిలేసేను. (ఇలాటివాక్యాలు  నేను గానీ రాసి ఏ ప్రముఖ సంపాదకులకో సమర్పించుకుంటే, ఎలాటి వ్యాఖ్యలు వస్తాయో, హుమ్.  -:)).

అంచేత నాలాగే ఇంకా ఎవరైనా అనుకుంటున్నారో లేదో తెలుసుకోడానికి బ్లాగులో పెట్టేను.

ఇంతకీ నేను చెప్పదలుచుకున్నది. నాకు ఇలా రాయడానికి అధికారం లేదని అనడానికి మహేష్ కుమార్‌కి హక్కు ఉంది. “మీరలా రాయకండి, పాఠకులు నావ్యాసం చదవరు” అని నేను అనొచ్చు కానీ అనడంవరకే నాకు హక్కు. అలాగే ఇలా నాకు కలిగిన అభిప్రాయాలు వెలిబుచ్చడానికి కూడా నాకు హక్కు ఉంది. I disapprove of what you have said but I will fight to the death your right to say it అని కదా పాశ్చాత్యాచార్యోక్తి. అందుకే నాహక్కు నేను ఉపయోగించుకున్నాను.

ఇక్కడ మరో విషయం కూడా ప్రస్తావించాలి. బ్లాగులు సొంత డైరీలలాటివని అందరూ అంగీకరిస్తున్నారు. జానపదసాహిత్యంలాటిది అని ముందొకసారి నేను అన్నాను. బ్లాగడం అంటే మనవాళ్లమధ్య కూచుని మనకి తోచినవి తోచినట్టు, అనుకున్నవి అనుకున్నట్టు రాసుకోడం. అలా చాలామంది రాసుకుంటున్నారు కూడా.

మనం రాస్తున్నది ఎవరికోసం రాస్తున్నాం అన్నది కూడా గమనంలోకి తీసుకోడం అవసరం.

ఈనవలే నేను తెలుగు అస్సలు తెలీనివారికి, తెలుగు సాహిత్యంతో పరిచయం లేనివారికి, పరిచయం చేస్తే మరోలా ఉంటుంది. “తెలుగుదేశంలో బుచ్చిబాబు అన్నకలంపేరుతో కథలూ, నవలలూ రాసేరు, ఆయన అసలుపేరు శివరాజు వెంకట సుబ్బారావు” – ఇలా సాగించాలి.ఈ తేడా చూడాలనుకుంటే  thulika.netలో తెలుగు సాహిత్యంతో పరిచయంలేని పాఠకులకోసం వ్యాసం రాసిన వ్యాసం చూడండి.

బుచ్చిబాబుగారిమీద కొన్ని వ్యాసాలు

బుచ్చిబాబు గారినవల చివరకు మిగిలేది. వ్యాసం నన్ను మార్చిన పుస్తకం

Halley http://pustakam.net/?p=3832

maanasa chamarti

http://magazine.maalika.org/2012/03/17/%E0%B0%9A%E0%B0%BF%E0%B0%B5%E0%B0%B0%E0%B0%95%E0%B1%81-%E0%B0%AE%E0%B0%BF%E0%B0%97%E0%B0%BF%E0%B0%B2%E0%B1%87%E0%B0%A6%E0%B0%BF-%E0%B0%AC%E0%B1%81%E0%B0%9A%E0%B1%8D%E0%B0%9A%E0%B0%BF%E0%B0%AC/

Mahesh kumar

http://parnashaala.blogspot.com/2009/07/blog-post_28.html

Malathi gari punaravalokanam pai mahesh

http://parnashaala.blogspot.com/2009/07/blog-post_30.html

(జులై 19, 2012)

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s