ఆచంట జానకిరామ్ గారి వ్యాసం “చలం”

నేను తిరపతిలో ఉన్నప్పుడు, 1965-66 ప్రాంతాల్లో ఆచంట జానకిరామ్‌గారితో పరిచయం అయింది. మధురాంతకం రాజారాం గారు చెప్పేరట నేను తిరపతిలో ఉంటున్నానని. ఆయన నన్ను చూడ్డానికి మాయింటికి వచ్చేరు గుమ్మడికాయంత గులాబీపూల పొట్లంతో.  అప్పటికి నాకథ మంచుదెబ్బ రచన పత్రికలో వచ్చి రెండేళ్ళయి ఉంటుంది. కొందరు సుప్రసిద్ధ రచయితలదృష్టిని ఆకట్టుకున్న నా తొలికథ అది.

ఆనాటి తెలుగు రచయితలలో సౌందర్యారాధకులు అంటే ఆచంట జానకిరామ్, సంజీవదేవ్ చాలామందికి గుర్తొస్తారనుకుంటా. నీటుగా మల్లెపూలలాటి తెల్లటిదుస్తులు ధరించి సదా చిరునవ్వుతో హుందాగా తిరుగుతూ కనిపించేవారు.

ఆయన స్వదస్తూరిలో ఉన్న ఈ వ్యాసంలో ఆయన తనకి చలంతో ఏర్పడిన స్నేహంగురించి రాసేరు. ఆతరవాత ఈ వ్యాసం ఎక్కడయినా ప్రచురించడం జరిగిందో లేదో నాకు తెలీదు. ఎవరికైనా తెలిస్తే, వివరాలు నాకు తెలియజేస్తే, ఇక్కడ చేర్చగలను.

ఇది చేతివ్రాత కనక చదివేటప్పుడు గమనించవలసిన విషయాలుః

1. ఆరోజుల్లో కొందరు ‘ఓ’కారం ఇప్పుడు వాడే ో కాక, ఎ-త్వం , ఉ-త్వం కలిపి రాసేవారు. అంటే తో అన్నది తె, తు కలిపి రాసినవన్నమాట.

2. జానకిరామ్‌గారి చేతివ్రాతలో “త”వత్తు నిలువుగా కామాలా ఉంది.

ఈ రెండూ గుర్తు పెట్టుకుంటే చదవడం తేలిక అవుతుంది.

మరో గమనికః తెలుగువా‘డి’ని గారిసాయంతో నా కంప్యూటరు మళ్ళీ బతికించి, ఈ వ్యాసం స్కాన్ చెయ్యగలిగేను. అంచేత తెలుగువా‘డి’ని గారికి ధన్యవాదాలు.

ఆచంట జానకిరామ్ గారి వ్యాసం జానకిరాం చలం మీద క్లిక్ చెయ్యండి.

(ఆగస్టు 1, 2012)

గ్రంధకర్త మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

13 thoughts on “ఆచంట జానకిరామ్ గారి వ్యాసం “చలం””

 1. గూగుల్ లో నాకు ఆరోజు ఈ కొన్ని పదాలు తెలుగులో రాలేదు.
  సరే అని అలాగే ఉంచేసి ముందు ఎవర్ అని తగిలించాను.
  చూస్తూ ఉంటే ఆ భావానికి అదే సరి పోయింది.
  like a ‘stiff upper lip’

  ఇష్టం

 2. @ మోహన్, మీరు రాసింది నిజమే. నాకు చిన్న సందేహం. మధ్యలో ఒక తెలుగువాక్యం ఇంగ్లీషులిపిలో రాయడానికి ప్రత్యేకకారణం ఉందా

  ఇష్టం

 3. ఒక్క సారిగా రెండు విలువైన కానుకలిచ్చారు.
  మంచు దెబ్బ,మరియు జానకి రామ్ గారి స్వదస్తురిలో లో చలం.
  చాలా చాలా థాంక్స్ .
  నేను తిరుపతి కేంద్రీయ విద్యాలయం లో చదువుకున్న రోజుల్లో(66-67)
  నాకు ఆచంట దంపతుల దర్శనం కలిగేది .
  తెల్లని దుస్తులలో మరింత తెల్లటి చిరు నవ్వు తో జానకి రామ్ గారు,
  ever gambhira vadanamtho vari sathimani sharada(?) గారు
  నాకు కనులలో మెదిలారు.

  ఇష్టం

 4. @ శివరామప్రసాద్, కప్పగంతు, మీ అభిప్రాయం వెలిబుచ్చినందుకు సంతోషం. పోతే జానకిరామ్ గారి దస్తూరీతో రాసిన వ్యాసం అలా ఉంచితేనే బాగుంటుందని నాకు అనిపిస్తోంది. అంతకంటే నేను కోరేది – మీరు ఈ వ్యాసంమీద మీమాటల్లో మీ అభిప్రాయాలు చేర్చి మరొక టపా రాస్తే బాగుంటుందనుకుంటాను.

  ఇష్టం

 5. ఒక అపురూపమైన రచనను పరిచయం చేసినందుకు ధన్యవాదాలు. చలంగారంటె ఇప్పటికీ ఎంతోమందికి తప్పుడు సమాచారం/ప్రచారం వల్ల ఎన్నెన్నో అపోహలు ఉన్నాయి. అటువంటి అపోహలు పోగొట్టి, అంతటి అద్భుత రచయిత మన తెలుగువాడు అని గర్వపడేట్టుగా చెయ్యగల నాణ్యమైన సమాచారం ఈ లేఖలో/రచనలో ఉన్నది. ఈ పి డి ఎఫ్ పైలును తెలుగులో టైపు చేసి కాపీ నా బ్లాగులో ప్రచురించి, ఆడియోగా చదువుదామని ఉన్నది.

  ఇష్టం

 6. @ Srivinasa Rao, Khammam, అవునండీ, నాక్కూడా అదే అనిపించింది. ఆనాడు రచయితలమధ్యగల సుహృద్భావం, ఒకరంటే మరొకరికి గల గౌరవం మెచ్చుకోదగ్గవి. అందులోనూ ఏమాత్రం పేరులేని నాలాటి చిన్నవారియందు కూడా వారు స్నేహభావం చూపడం ఈనాటి పాఠకులకి తెలియజేయడం ఈ టపా ఉద్దేశ్యాల్లో ఒకటి.
  @ మైత్రేయి, నాకు ఈ వ్యాసం జానకిరామ్ గారు స్వయంగా ఇచ్చేరు. అంతకంటే ఎక్కువ హక్కులవిషయం నాకు తెలీదు. నామటుకు నాకు ఎలాటి అభ్యంతరం లేదు.
  @ సత్యవతిగారూ, నాక్కూడా సంతోషంగా ఉందండి.

  ఇష్టం

 7. చాలా మంచి పని చేశారు మాలతి గారూ! ఈ వ్యాసం దాచిపెట్టి ఇలా అందరికీ పరిచయం చెయ్యడం అద్భుతం

  ఇష్టం

 8. achanta garu maato kuurchuni cheppinatlu ga vundi. oka artiste inko artiste ni ento gouravamaga chusaro. chaala goppa samskaralu. thanks for introducing to this generation.

  ఇష్టం

 9. @ కొత్తపాళీ, థాంక్సండి. నేను కూడా అనుకున్నాను కొందరికైనా ఇది అపురూపంగానే తోస్తుందని.

  ఇష్టం

టపాలో చర్చించిన అంశంమీద వ్యాఖ్యానాలు తెలుగులో రాసిన వ్యాఖ్యలు మాత్రమే అంగీకరింపబడతాయి. తెంగ్లీషులో రాసిన వ్యాఖ్యలు కూడా నాకు సమ్మతం కాదు. కోరుతున్నాను

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / మార్చు )

Connecting to %s