తూలిక.నెట్ పునరుత్థానం

తూలిక.నెట్ అంతరించడానికి కారణాలు అని మొదలు పెడదాం అనుకున్నాను వారం రోజులక్రితం. తూలిక.నెట్ చూస్తున్నవారు గమనించే ఉంటారు దాదాపు నెలరోజులక్రితం అక్కడ ప్రకటించేను ఆ సైటు నడపడం కష్టంగా ఉందని. నా ఈతిబాధలు, ఆలోచనలు సాగకపోవడం అలా ఉండగా, సాంకేతికబాధలు అంతకంతా అయి, చిరాకు పుట్టింది నాకు. అలాటి చిరాకులోనే ఓ శుభముహూర్తంలో నాసైటుమీద తెర దింపేసి ఆవిషయం కొందరితో చెప్పేను.

కొండల్లా వచ్చినకష్టాలు మంచులా విడిపోతాయంటారు. తూలిక సైటుని అభిమానించేవారొకరు చడీ చప్పుడూ లేకుండా మరో ఇల్లు కట్టేసి, మీరిక్కడికి మార్చేసుకోండి మీరాతలన్నీ అన్నారు.

ప్రస్తుతం ఆ పనిలో ఉన్నాను. బహుశా మూడు, నాలుగువారాల్లో మొత్తం తరలించడం అయిపోతుందనుకుంటున్నాను

 తూలిక.నెట్ తిరిగి నడుస్తోంది. తూలిక.నెట్ కి లింకు ఇచ్చినవారు మరొకమారు సరి చూసుకోవలసిందిగా కోరుతున్నాను.

మరొక ముఖ్యవిషయం. మనలో చాలామందికి కాపీరైటు విషయంలో అట్టే పట్టింపు లేదు. ముఖ్యంగా అవి తమరచనలు కానప్పుడు. హీహీ. 

నా వ్యాసాలు నేను పెట్టనిచోట కనిపించినప్పుడు, అదేమిటండీ, నాకోమాట చెప్పొచ్చు కదా, అంటే నాకు వచ్చే సమాధానం, “మేమేమీ డబ్బు చేసుకోడంలేదు, పదిమందితో పంచుకుంటున్నాం, అంతే కదా,…” అని.

నేను కూడా ఏమీ డబ్బు చేసుకోడంలేదని వారు గమనించకపోవడం ఆశ్చర్యం. ఏ రచయితకయినా తమరచన మరొకరు చదువుతున్నారంటే ఆనందమే. మరి మీఆనందం ఆ రచయితతో కూడా పంచుకోవచ్చు కదా!!

మొత్తం రచన అంతా ఎత్తి పెట్టేసుకోడం కాక, తమకి నచ్చిన భాగాలు ఒకటో రెండో పెట్టి, ఫలానా చోట చూడండి అని లింకు ఇస్తే మీకు వచ్చే నష్టం ఏమీ లేదు కదా. పైగా, నాకృషికి మరింత సత్ఫలం కూడాను.

మీరు నావ్యాసాలలో చూసే ఉంటారు నేను ఈ మర్యాద పాటిస్తున్న సంగతి. 

ఇంతే ఈనాటి విశేషాలు.

మాలతి

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

5 thoughts on “తూలిక.నెట్ పునరుత్థానం”

 1. @ Narayanaswamy, Thanks. అవునండీ. మీరు చెప్పింది నిజమే అనిపిస్తోంది నాక్కూడా.
  మరో హాస్య లేక హాస్యాస్పదమైన కథ చెప్తాను. నేను కనుపర్తి వరలక్ష్మమ్మగారి మీద ఇంగ్లీషులో రాసినవ్యాసం ఇలాగే సయద్ హుసేన్ పేరుకింద groups.yahoo.com లో కనిపిస్తోంది. సరిగ్గా చదవకుండా అనుకుంటాను. ఎందుకంటే అందులో ఒక చోట “1968లో ఆంద్రప్రదేశ్ సాహిత్య ఎకాడమీ వారు కొందరు రచయిత్రులని సత్కరించేరు. వారిలో వరలక్ష్మమ్మగారున్నారు. నాకు కూడా ఆవేదికమీద నిలుచునే అవకాశం కలగడం నా అదృష్టంగా భావిస్తున్నాను,” అని రాసేను. మరి ఈ ఎత్తిపోతల పండితుడు రచయిత్రీ కాడు, బహుశా ఆ వయసువాడూ అయిఉండడు కదా. అది కూడా చూసుకోలేదు. :p

  మెచ్చుకోండి

 2. Sowmya, Excellent observation. Very true.
  మాలతిగారు, సైటు మళ్ళి ఊపిరి పీల్చుకున్న శుభ సందర్భంగా అభినందనలు.
  జనాలకి అదో ఆనందం .. పక్కింటో చెట్టు పువ్వు తెచ్చి మనింటిముందు గొబ్బెమ్మ మీద పెట్టుకోడం లాగా. నేను గమనించిన కొన్ని ఉదాహరణల్లో ఆ ఒరిజినల్ బ్లాగు ప్రఖ్యాతమైనదీ, ఎత్తుకెళ్ళి పెట్టుకున్న బ్లాగు అనామకమైనదీ అయి ఉండటం కూడా చాలా సార్లు గమనించాను. అంచేత ఎగష్ట్రా వచ్చే ఖ్యాతి కూడా పెద్దగా ఏమీ లేదు .. సున్నకి సున్న, హళ్ళికి హళ్ళి. ఆహా ఎవరికో మన రచన చౌర్యం చేసేంత నచ్చిందే అన్న సంతోషం ఒక్కటే రచయితకి మిగిలేది 🙂

  మెచ్చుకోండి

 3. ఇప్పుడు నాకు మరో సందేహం. డబ్బు చేసుకుంటున్న రచయితలు – ఏ వీరేంద్రనాథ్ లాటివారిరచనలో ఇలా తీసిపెట్టుకుంటున్నారా, పెట్టుకుంటే వారూరుకుంటున్నారా. నాకు సులోచనారాణిరచనలు ఈయనపేరుతో ప్రచురించడం, వాళ్ళెవరో చేస్తే, నేనేం చెయ్యను అని ఆయన అనడం గుర్తుకొస్తోంది. మరి మీరచనలు ఎవరైనా ఇలా చేస్తే మీరేం చేసేవారు అని ఎవరూ అడిగినట్టు లేదు. హీహీ.

  మెచ్చుకోండి

 4. “మేమేమీ డబ్బు చేసుకోడంలేదు, పదిమందితో పంచుకుంటున్నాం, అంతే కదా,…”
  – కిందపడి, దొర్లి నవ్వేలా ఉన్నా. నేనూ విన్నాను ఈ బాపతు సమాధానాలు. “ఊరికే పదిమందికీ మా పేరుమీద పంచేసుకుంటున్నాం…” అని చెప్పాలి నిజానికి.

  ఇప్పుడు నేను మీ గురించి అందరికీ చాడీలు చెబుతున్నా అనుకోండి, “ఫలానా సౌమ్య ఇలా చెబుతోంది” అనుకుంటూ చెబుతారు ఈ “కొందరు”. మళ్ళీ, ఒకవేళ నేను… “మాలతి గారు గొప్పవ్యక్తి” అన్నాననుకోండి…అది మాత్రం “మాలతిగారు గొప్ప వ్యక్తి” అనే బయటకొస్తుంది వారి నోట్లోంచి, సౌమ్య రాదు ;). ఉచితంగానే చెబుతున్నాం అనేసి, ఎవరో చెప్పిన చాడీలు మనవని చెప్పేస్తారా??? అబ్బే, లేదు. బాగున్నవి మాత్రమే పేర్లు చెప్పకుండా పంచుకోవచ్చు మరి.. 😉

  మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.