నాకథా సంకలనాలు – మరోసారి తప్పులు దిద్దుకుని ..

మూడు రోజులక్రితం విన్నకోట నరసింహారావుగారు తెలుగు తూలిక ఇటీవలే చూసేననీ, నాకథాసంకలనాలు డౌన్లోడ్ చేసుకుని చదివేననీ రాస్తూ, వాటిలో పొరపాట్లు విపులంగా ఒక పేజీలో రాసి నాకు మెయిలు చేసేరు. ఆయన నాకథలు చదివినందుకు పరమానందమూ, అన్ని పొరపాటులు దొర్లినందుకూ సిగ్గు పడి, వెంటనే వాటిని సరిదిద్దడానికి ప్రయత్నించేను. ప్రదానంగా ఆయన చూపినవి అవే కథలు మళ్ళీ కనిపించడం, విషయసూచికలలో బొత్తిగా వావివరసలు లేకపోవడమూ – అవన్నీ చక్కగా నోట్ చేసి పంపినందున నాపని నిజానికి చాలా సుళువయింది.

ఇంతకుపూర్వం ఉన్న 5వ సంకలనంలో ముందు సంకలనాల్లో ఉన్న కథలే ఉన్నాయని తెలిసినందున పూర్తిగా తొలగించేను. ఈమధ్య రాసిన కొత్తకథలు చేర్చి ఈ సంకలనం మరోసారి పునరుద్ధరిస్తాను.

ఇదివరకు డౌన్లోడ్ చేసుకున్న పాఠకులు కావలనుకుంటే, ఇప్పుడు మరోసారి డౌన్లోడ్ చేసుకోవచ్చునని చెప్పడమే ఈ టపా ఉద్దేశం. నాసాహిత్యం పిడియఫ్. పేజీ లో అప్లోట్ చేసేను.

శ్రీ నరసింహారావుగారికి మరోసారి మనఃపూర్వక ధన్యావాదాలు.

మాలతి

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

2 thoughts on “నాకథా సంకలనాలు – మరోసారి తప్పులు దిద్దుకుని ..”

  1. దేవులపల్లి గారి భావ కవిత్వం మీద నలుగురు
    నాలుగు చందాల మాటలాడినప్పుడు ఆయన అన్న మాటలు
    గుర్తుకొచ్చి ఇక్కడ సరిపోతాయని వ్యాఖ్యానించాను. మన్నించాలి

    మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.