తెల్లతోలు గల నల్లవాడి ఆంతర్యం

An Autobiography of an ex-Colored Man అన్న పుస్తకం రెండు రోజులక్రితం పూర్తి చేసేను. ఆదిలోనే హంసపాదన్నట్టు అసలు ఈ పుస్తకంపేరే నాకు వింత. ఇది రచయిత ఆత్మ కథ అవునా కాదా అన్నది మొదటిప్రశ్న. మామూలుగా ఆటోబయోగ్రఫీ అంటే ఆత్మకథ అనే అనుకుంటాం. ఈ పుస్తకం మొదటిపేరాలో రాసిన వాక్యాలు – ఊరుపేరు చెప్పను ఆఊళ్ళో కొందరు బాధ పడతారని- లాటివి కూడా అభిప్రాయాన్ని కలిగిస్తాయి. కానీ ప్రచురణకర్తలు దీన్ని నవల అన్నారు. ఇది 1912లో James Walden Johnson అన్న రచయిత రాసిన పుస్తకం.

రెండోది మీరు కూడా గమనించే ఉంటారు. ex-colored అన్న విశేషణం. ఎక్స్ బార్యలూ, ఎక్స్ భర్తలూ ఉండడానికి అవకాశం ఉంది కానీ పుట్టినజాతి స్థిరం కదా. అది ఎక్స్ ఎలా అవుతుంది. ఇలాటి సందేహాలతో వాస్తవమో, కల్పనో అర్థం కాని ఈ పుస్తకం చదవడానికి పూనుకున్నాను. పైగా రాసి వందేళ్ళు కావడంచేత కూడా నాకు మరింత కుతూహలం.

ఈ పుస్తకంమీద కన్ను పడ్డతరవాతే ఇది చాలా గొప్ప ప్రాచుర్యం పొందిన పుస్తకం అనీ, దీన్నికాలేజీలు టెక్స్‌బుక్‌గా ఆదరించాలని సూచిస్తున్నారనీ కూడా తెలుసుకున్నాను.

అంతర్జాలంనిండా దీన్ని గూర్చిన చర్చలు ఇంగ్లీషులో చాలా ఉన్నాయి కనక అదంతా ఇక్కడ మళ్ళీ రాయను కానీ నాకు సంబంధించినంతవరకూ, అమెరికాలో నీగ్రోజాతివారి ప్రవృత్తులూ, అవి అలా రూపు దిద్దుకోడానికి వెనక గల కారణాలూ, ప్రస్తుతసామాజికపరిస్థితులలో వారు మనస్తత్వ విచారణ నాకు విశేషంగా కనిపించేయి. అవి భారతీయుల, ముఖ్యంగా విదేశాల్లో ఉన్నవారి – జీవనసరళి, ప్రవృత్తులతో పోల్చడానికి వీలుగా ఉన్నాయా లేదా, ఎక్కడ తేడా ఉంది… లాటి విషయాలు మనసులో పెట్టుకుని చదివేను. అంచేత, ఇక్కడ నేను స్పృశించే బాగాలు తదనుగుణంగానే ఉంటాయని గ్రహించగలరు.

సూక్ష్మంగా కథ ఒక తెల్లతోలు గల స్త్రీకి తెల్లతోలు గల కుమారుడుంటాడు. అతడే కథానాయకుడు. ఉత్తమపురుషలో అమెరికాలో నీగ్రోజాతి జీవనసరళిని విశ్లేషణాత్మకంగా చర్చించడం ఈపుస్తకంలో ప్రధానాంశం. అతనిపేరు మనకి తెలీదు. పదకొండేళ్ళప్పుడు స్కూల్లో ప్రిన్సిపాల్ చెప్పేవరకూ  తాను నల్లవాడినని అతనికి తెలీదు. తల్లిని అడుగుతాడు కానీ ఆవిడ కూడా వివరాలేమీ చెప్పదు, తండ్రి “పెద్దమనిషి” అని తప్ప. అప్పుడే మొదలవుతుంది తనజాతిగురించి తెలుసుకోవాలన్న తపన. స్కూల్లో మాత్రం నల్లపిల్లలని చూసినప్పుడు తాను వారిలో ఒకడిని అన్నధ్యాస తక్కువే. “వారిని” నిశితంగా పరిశీలిస్తూ ఉంటాడు.

చురుకైనవాడు కావడంవల్ల సాటి పిల్లలకీ, పెద్దలకీ అభిమానపాత్రుడవుతాడు. స్వయంకృషితో పియానో వాయించడం నేర్చుకుని ప్రతిభావంతుడుగా పేరు తెచ్చుకుంటాడు. స్కూలు చదువయినతరవాత, హార్వర్డులో చేరడానికి అర్హతలున్నా డబ్బు లేక, అట్లాంటాకి వెళ్తాడు. అనతికాలంలోనే చదువుమాట వదిలేసి, తనజాతి సంస్కృతి అర్థంచేసుకునే కోరికతో నల్లవారితో సావాసం చేసి, నల్లజాతికి ప్రత్యేకమైన rag music, cake-walk dance గురించి తొలిసారిగా తెలుసుకుంటాడు. వాళ్లతో సమానంగా జూదం ఆడ్డం నేర్చుకుని త్వరలోనే ఆరితేరి, అదే జీవనమార్గంగా కొంతకాలం గడుపుతాడు.

classic సంగీతాన్ని  rag music బాణీలో పియానోమీద వాయించి, తెల్లవారి అభిమానం కూడా గెల్చుకుంటాడు. ఒక మిలియనీర్ అతని ప్రతిభకి ముగ్ధుడయి. చేరదీస్తాడు. తనతో విదేశాలకి తీసుకెళ్తాడు. కథకుడికి, ఇతరసంస్కృతులని పరిశీలించడానికి అవకాశం కలుగుతుంది. ఫ్రాన్స్, ఇంగ్లండ్ వంటి దేశాల్లో కూడా తనజాతి సంస్కృతి ఎలా పరివర్తన పొందుతోందో చూస్తాడు. అక్కడ అతను ప్రస్తావించిన కొన్ని వాక్యాలు – adaptation నల్లవాడికి చాలా చక్కగా పట్టుబడిన విద్య. లండనులో తెల్లవారికంటే నల్లవాడే perfect gentleman. ఫ్రాన్సులో ఫ్రెంచివాడికంటే, నల్లవాడే ఎక్కువ ఫ్రెంచీ!

లండన్లో ఒక కచేరీలో తాను rag music బాణీలో క్లాసిక్ ప్రదర్శించి ప్రేక్షకులమన్ననలు పొందితే, మరొక పండితుడు rag music క్లాసిక్ లో పియానోమీద వాయించి, అందరిచేత శభాష్ అనిపించుకుంటాడు. కథకుడికి కూడా అది అద్బుతం అనుకుంటాడు. ఆతరవాత తిరిగి అమెరికా వచ్చి, తనజాతిని ఉద్ధరించేకార్యక్రమం చేపట్టడానికి నిశ్చయించుకుంటాడు. మిలియనీరు అతన్ని

నిరుత్సాహపరుస్తాడు, “నువ్వేదో అనుకుంటున్నావు కానీ నువ్వు తెల్లవాడివే.” అని హెచ్చరిస్తాడు.

తిరుగుప్రయాణంలో వృద్ధుడయిన ఒక North soldier ఒక టెక్సన్ వాదనకి దిగుతారు నల్లజాతివారిగురించి. ఈవిషయంలో ఆ సోల్జర్ వెలిబుచ్చిన అభిప్రాయాలు గమనార్హం.

“The Anglo-Saxon race has always been and will be the masters of the world, and the niggers in the South ain’t going to change all that record of history” అని old soldier from the North వాదన. చరిత్ర పరిశీలించినా అదే అర్థమవుతుందంటాడు.

“Can you name a single one of the great fundamental and original intellectual achievements of which have raised man in the scale of civilization that may be credited to the Anglo-Saxon? The art of letters, of poetry, of music, of

sculpture, the science of mathematics, of astronomy, of philosophy, of logic, of physics, of chemistry, the use of the metals, and the principles of mechanics, were all invented or discovered by darker and what we now call inferior races and and nations. We have carried many of these to their highest point or perfection, but he foundation was laid by others. Do you know know the only original contribution to civilization we can claim is what we have done in steam and electricity and in making implements of war more deadly?”

(Johnson, James Weldon (2012-05-12). The Autobiography of an Ex-Colored Man (p. 79).  . Kindle Edition.)

ఇది నిశితంగా ఆలోచించవలసిన విషయం. ఈవాదనలో ఎంత బలం ఉందో నాకు తెలీదు కానీ ఇక్కడ కథకుడు “we” అనడం నాకు ప్రత్యేకంగా కనిపించింది. వాదన చాలాసేపు జరిగినా, అతను ఏ పక్కా వాదించకుండా, కేవలం ప్రేక్షకుడుగానూ, రాయసగాడుగానూ ఉండిపోయేడు.

తనదేశం వచ్చేక, దేశసంచారం చేస్తూ చాలావిషయాలు తెలసుకున్నాడు. చాలా సంఘటనలు చూసేడు. తనకి నచ్చిన తెల్ల అమ్మాయి కనిపించేక, పెళ్ళికి ముందే తాను నల్లవాడినని తెలియజేసేడు. ఆ అమ్మాయి అప్పటికి షాకు తిని వెళ్ళిపోయినా, తరవాత పెళ్ళికి ఒప్పుకుంటుంది. ఇద్దరు పిల్లలు కలుగుతారు. కథకుడికి మళ్ళీ సదసత్సంశయం – పిల్లలకి తన వంశంగురించి చెప్పాలా వద్దా అని. ఇక్కడే నాకు కథకుడి నిజాయితీగురించిన సందేహం కలిగింది.

ఈ సందేహానికి ఎలా టీక చెప్పుకోవాలి? మొదట్నుంచీ నల్లజాతిగురించి జాన్సన్‌కి కలిగిన సందేహాలూ, కుతూహలం కేవలం పాండిత్యకోవలోకి చెందిందా? లేక ఇది నాజాతి, నాజాతిచరిత్ర నేను తెలుసుకోవాలి అన్న ఆత్మశోధనా?రెండోదే నిజమైతే, ఆయన నిజాయితీని శంకించవలసివస్తుంది. కానీ నల్లజాతివారు ఆయన్ని చాలా గౌరవంగా చూస్తున్నారు. నీగ్రో జాతి జాతీయగీతం రచించినకీర్తి ఆయనకి దక్కింది.

ఇప్పుడు నేను ఆదిలో ప్రస్తావించినవిషయం చూద్దాం. విదేశాల్లో ముఖ్యంగా అమెరికాలో ఉన్న తెలుగువారివిషయంలో మనం పరిశీలించవలసింది – 1. ఎడప్టేషన్, 2. సంస్కృతికి సంబంధించినవి – సంగీతం, నాట్యం, ఆహారం, దుస్తులు, భాష – ఇలాటివిషయాల్లో  తెల్లవారికి ఆసక్తి కలిగించడం. వీటివిషయం నేను అట్టే చెప్పఖ్ఖర్లేదు. ఇండియన్ రెస్టారెంట్లు బాగానే ప్రాచుర్యంలోకి వచ్చేయి. భాష కనీసం యూనివర్సిటీల్లో కనిపిస్తోంది. ఆమధ్య హాలివుడ్‌లో Indian Film Festival జరిపి, మన సినీతారలని ప్రదర్శించేరు. విమర్శకులు మెచ్చుకున్నారు వీలున్నంతమేరకి.

తెలుగువాళ్ళు మెడిసిన్, ఇంజినీరింగ్ మాత్రమే కాక ఇతర రంగాల్లో – రాజకీయ, ఆర్థిక, సమాజిక, సమాచార రంగాల్లో కూడా కనిపిస్తున్నారు. మార్చుకున్న అమెరికన్ పేర్లతో కాక అచ్చతెలుగుపేర్లతో కనిపించడం విశేషం. ఇవన్నీ పైకి కనిపించే విశేషాలు. ఆత్మనా, తెలుగువారం అంటూ ఆత్మగౌరవం ప్రదర్శించుకునేవారుగా ఎంతవరకూ అంటే నేను చెప్పలేను. ప్రధానంగా నాకు బయటిప్రపంచంతో సంబంధం లేదు కనక.

తోలురంగు విషయం – పేరుకి నల్లవాళ్లు అన్నా, అందరూ ఒకే నలుపు కాదు. అందులో ఛాయలున్నాయి. వారిలో కూడా కాస్త తక్కువ నలుపుఛాయ గలవారికి ఆదరణ ఎక్కువట. నల్లఅబ్బాయిలు కాస్త తెల్లఅమ్మాయిలని కోరతారు. అలాగే అమ్మాయిలు కూడా కాస్త తెలుపుఛాయగల అబ్బాయిలనే ఇష్టపడతారు. దీనికి కారణం తెల్లవారు గొప్పవారు అన్నభావం కాదంటాడు కథకుడు. ఆయన అభిప్రాయం ఇది ఆర్థికవిషయానికి సంబంధించినదని. ఉదాహరణగా పత్రికలలో ఉద్యోగ ప్రకటనలు “Light-colored man wanted” అని ఎత్తి చూపుతాడు. తరతరాలుగా పిల్లలకి తెల్లరంగు అందివ్వగల అవకాశాలకోసం నల్లవారు చేసే త్యాగం, “it is no disgrace to be black, but it’s often very inconvenient” ఒక్కమాటలో చెప్పాలంటే.

మనసమాజంలో కూడా నల్లనివాడు పద్మనయనంబులవాడు అని కీర్తిస్తూన్నా, తెల్లతోలుకే ఆదరణ నిత్యజీవితంలో.

మొదట్లోనే చెప్పినట్టు, ఇవి నాకు కలిగిన కొన్ని ఆలోచనలే కానీ పుస్తకం చదివితే, మీకు మరింత నిర్దిష్టమైన ఆలోచనలు కలగవచ్చు.

ఇది ఎమెజాన్.కాంలో కిండిల్ ఇ-బుక్ ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.

(ఆగస్ట్ 10, 2013)

రచయిత: మాలతి

మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

5 thoughts on “తెల్లతోలు గల నల్లవాడి ఆంతర్యం”

  1. >> సరస్వతి తెలుపు, విష్ణువు తెలుపు

    …”మేఘ వర్ణం” శుభాంగం లక్ష్మీ కాంతం కమలనయనం…

    విష్ణువు ఎక్కడా (రామ, కృష్ణావతారాల్లో కూడా) తెల్లగా ఉన్నట్టు చెప్పినట్టు కనబడదు.
    (At least to me :-))

    మెచ్చుకోండి

  2. పింగుబ్యాకు: వీక్షణం – 44 | పుస్తకం

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.