దుష్టుడి మనోవేదన – ఒక నవల

ఒక నవల మొదటిమారు చదివినప్పుడు కలిగిన ఉత్సాహం, ఆనందం, రెండోమారు అరవై ఏళ్ళతరవాత చదివితే ఉండదు సాధారణంగా . కారణం అదే వస్తువుతో రాసినకథలు అప్పటికి చాలా చదివి ఉంటాం. కథ ముందే తెలుసు కనక ఏమవుతుందో అన్న ఎదురుచూపు ఉండదు. రెండోది, వయసు, అనుభవాలమూలంగా అభిరుచులు మారిపోతాయి. అప్పట్లో అద్భుతంగా కనిపించిన నవల రెండోసారి ఒస్, ఇంతేనా అనిపించవచ్చు.

నేను అరవై ఏళ్ళక్రితం చదివిన Sorrows of Satan అన్న నవల ఐదు రోజులక్రితం తీసుకుని ఐదురోజుల్లో పూర్తి చేసేసేను 470 పేజీలు. అంటే నారికార్డు నేనే మించిపోయేను. దానికి కారణం ఆకథలో వస్తువు ఈనాటికీ వాస్తవమే కానీ అంతకుమించి రచయిత్రి రచనాపాటవం.

రాయల్ ఇంగ్లిషు ఆకాలానికి అనుగుణంగా ఉన్నా, రచయిత్రికి భాషమీద గల పట్టు ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ప్రతి సన్నివేశం నాటకీయంగా, మనకళ్ళముందు జరుగుతున్నట్టు, ప్రతి వాక్యం ఉత్తుంగతరంగంలాగానో జాతి సర్పం జరజర పాకిపోతున్నట్టుగానో సాగిపోతుంది కథనం. ఉదాత్త భావాలు నర్మగర్భంగా వాక్యాల్లో పొదగడం ఆమెదగ్గర్నుంచి నేర్చుకోవాలి అనిపిస్తుంది.

ఈనవల ప్రచురణ 1899లో. రచయిత్రి పేరు Marie Corelli (1855-1924). ఆమెకి ఆనాటి సమాజంగురించిన అవగాహన, మానవనైజంగురించిన అవగాహన ఉండడం ఒక ఎత్తు అయితే, దాన్ని పాఠకులని ఆకర్షించేలా ఆవిష్కరించగలగడం మరో ఎత్తు. ఈ నవలలో ప్రధానాంశం మానవుడి నైతికపతనం.

సైతాను ఎవరు, అతనికి సారో ఏమిటి? అన్న ప్రశ్నకి సమాధానం మధ్యలో తెలుస్తుంది కానీ చదువుతున్నప్పుడు ఎక్కడికీ ప్రయాణం¸ ఏది గమ్యం అన్న ప్రశ్నలు పాఠకుడిలో కలగవు అంటే కారణం ఆమె రచనావైదగ్ధ్యమే. మరో రెండు నవలలు కూడా వెనకటిరోజుల్లోనే చదివేను. వీటన్నిటిలోనూ నన్ను ముఖ్యంగా ఆకట్టుకున్నది ఆ లక్షణమే. ప్రతివాక్యం వచనకవితలా సాగిపోతుంది. ప్రతివాక్యంలో చమత్కారం, ఎత్తిపొడుపు, హేళన, సమకాలీనసమాజంమీద విసుర్లు మాత్రమే కాక, మనిషి అంతరాంతరాలలోకి వారి వ్యక్తిత్వాలు మనోహరంగా చిత్రించిన రచయిత్రి.

ఈనవలకి మూలం బైబిల్‌లోని లూసిఫర్ కథ. ఈ నవలలోనే ఒక పాత్ర మరొక పాత్రకి వివరించినట్టు చూపించడం జరిగింది. మూలకథ నాకు తెలీదు కానీ ఈనవలలో వివిరించినదేమిటంటే  – భగవంతుడు లూసిఫర్ని సృష్టించినతరవాత మానవులని సృష్టించేడు. లూసిఫర్‌కి అది కంటకప్రాయమయింది. ఈర్ష్యతో భగవంతుడిని నిందించడంతో  భూలోకంలోకి వచ్చి పడ్డాడు. మరి విముక్తి ఎప్పుడు అంటే, మంచి చెడ్డలవిచక్షణ జ్ఞానం, తనకి తగినది ఎంచుకోడానికి స్వేచ్ఛ గలిగిన మానవుడు లూసిఫర్ ఎర చూపిన ప్రలోభాలకి లొంగక, ఋజువర్తనకి కట్టుబడి ఆ ప్రలోభాలని తిరస్కరించినప్పుడు.  ఈకథలో ఇది మతసంబంధమైన చర్చలో భాగంగా పాఠకులకి తెలుస్తుంది. ఈ ఉపకథ పాత్ర అంతవరకే. తరవాత కథంతా మాత్రం ఆనాటి సమాజంలో జరుగుతున్న అక్రమాలని, దురంతాలని మనకళ్ళకి పొడగట్టిన మానవనైజం అడుగు పొరలు చిత్రించడం జరిగింది.

మామూలుగా నేను అభూతకల్పనలు, సైఫైలాటివి చదవను. కానీ ఆ అభూతకల్పనలని ఆధారం చేసుకుని, 19వ శతాబ్దం ఉత్తరార్థంలో సామాజికపరిస్థితులని, సాహిత్యరంగంలో ధనానికున్న ప్రాముఖ్యతని చిత్రించడంలో రచయిత్రి ప్రదర్శించిన ప్రజ్ఞవల్ల నాకు ఈనవల ప్రత్యేకంగా ఆకట్టుకుంది.

రచయిత్రిశైలిలో రెండు విశేషాలు – మొదటిది భాష. అసలు భాష అంత బలంగా నామీద ముద్ర వేయకపోతే నేను మళ్ళీ చదివేదాన్ని కాదు. ప్రతి వాక్యం భావగర్భంగా వచనకవితలా సాగుతుంది. రెండోది ఆమెకి మానవనైజాన్ని అర్థం చేసుకుని వచనకవితలాటి భాషలో చిత్రించడంగల చాకచక్యం, భిన్న అభిప్రాయాలని మనసుకి ఆకట్టుకునేలా పాఠకులకి అందించడంలో నేర్పు. జఫ్రీకి జ్ఞానోదయమయి, రిమనెజ్ కి దూరం అయినతరవాత, రిమానెజ్ ఒక ప్రముఖ పార్లమెంటుసభ్యుడితో పార్లమెంటు భవనంలోకి ప్రవేశించడం మరొక గొప్ప చమత్కారం.

కథలో నాలుగు పాత్రలు –

కథానాయకుడు జఫ్రీ టెంపెస్ట్ – ఉన్నతాశయాలతో మానవుల అభ్యున్నతికోసం, మానవుడిని అభ్యుదయంవేపు నడిపించగల నవలలు రాయడానికి పూనుకున్న రచయిత. ఆర్థికంగా ఇంటి అద్దె అయినా ఇచ్చుకోగల స్తోమతు లేనివాడు. అతని అభిప్రాయంలో స్త్రీలు మగవారి సేవకీ, ఇల్లు చక్కదిద్దుకోడానికీ పుట్టేరు. రచనలాటి ప్రక్రియలకి అస్సలు తగరు. ఎవరైనా రాయడానికి పూనుకుంటే, వారు unsexed అంటాడు.

లూసియో రిమనెజ్  అపార మేధస్సు, ధనమూ, చూపరులనాకట్టుకోగల రూపమూ, ఎంతటి పెద్దవారిచేతనైనా ఏ పనైనా చేయించగల చాకచక్యమూ గలవాడు. మాటల్లో వ్యంగ్యం, కరుకుదనం, చూపులు తీక్షణం. మరొకస్నేహితునిద్వారా జఫ్రీకి పరిచయమై, అతను ఆశిస్తున్న పుస్తకప్రచురణ, దానితో రాగల ఖ్యాతి సమకూర్చిపెట్టడానికి పూనుకుంటాడు. దానికి జఫ్రీ అంగీకరించడం కథలో ప్రధానమైన మెలిక.

సిబిల్ – బతికి చెడిన ఎర్ల్ ఆఫ్ ఎల్టన్ కుమార్తె. ఆమెతో జఫ్రీవివాహం రిమనెజ్ ఏర్పాటు సమాజంలో అతని స్థాయి పెంచడానికి. సిబిల్ దాన్ని వ్యాపారసంబంధమైన ఒప్పందంగానే గ్రహిస్తుంది. ఈ పాత్ర పరిచయం చేసినప్పుడు ఇలాటి ఆలోచనమూలంగా ఆమె అంటే పాఠకులకి సానుభూతి కలగదు కానీ చివరలో ఆమె అలా తయారు కావడానికి వెనక పరిస్థితులు తనే వివరించినతరవాత మన సమాజంలో అవకతవకలూ, పిల్లలమీద వాటి ప్రభావం. ఆ పరిస్థితులు ఈనాటికీ అలాగే ఉండడం కాదు, అంతకంతకీ అర్థ్వాన్నం అవుతున్నాయి. అది విషాదకరం.

నాలుగో పాత్ర మేవిస్ క్లేర్. ఆమె సమాజానికి దూరంగా చిన్న కాటేజిలో రెండు జాతికుక్కలతోనూ, ఇంటిచుట్టూ పక్షులనీ పువ్వులనీ పెంచుకుంటూనూ ప్రశాంతంగా జీవితం గడుపుకుంటూ ఉంటుంది. ప్రచురణకోసం, ప్రచారంకోసం రచయితలకి తప్పనిసరి అయిన నెట్వర్కింగ్, డబ్బు సంతర్పణలూ లాటివేమీ లేకుండా కేవలం పాఠకులఆదరణతోనే అసమాన ఖ్యాతినార్జించుకున్న రచయిత్రి.

కథంతా ఈనాలుగు పాత్రమధ్యే నడిచినా, ప్రధానంగా కథ జఫ్రీ పతనంతో మొదలయి జ్ఞానోదయంతో ముగుస్తుంది.

ఇలా చెప్పినప్పుడు – సూక్ష్మంగా డబ్బూ, మనిషీ కథ అని అనిపించినా కానీ పైన చెప్పినట్టు, రచయిత్రి కథనవిధానం, మనకి ఆలోచించుకోడానికి అందించిన భావజాలం మూలంగా ఇది ప్రత్యకత సాధించుకుంది. అనేక విషయాలమీద వాదోపవాదాలున్నాయి రెండు ప్రక్కలనించి చిత్రించడంలో కొరెలీ సామర్థ్యం కనిపిస్తుంది.

నాకు నచ్చిన మరో అంశం పాత్రల ఆత్మశోధన. ఒకొకప్పుడు తనలో తను, మరొకప్పుడు మరొకపాత్రతో మాటాడుతూనూ, “నేను ఇలాటి మనిషిని” అని వర్ణించుకోడంలో మనకి రెండు కోణాలు కనిపిస్తాయి – తనమీద తనకున్న అభిప్రాయం, మనకి ఆ పాత్రమీద ఉన్న అభిప్రాయం. పాత్రల మనసులోని భావాలని చిత్రించడంలో కూడా కొరెలీ గొప్ప నేర్పు చూపిస్తుంది. నిత్యజీవితం ఇంత విస్తృతంగా వ్యక్తిత్వాల చర్చ జరగకపోవచ్చు కానీ ఏదో ఒక సమయంలో ప్రతివాడికీ నేనెలాటి వ్యక్తిని అన్న చర్చ మనసులో జరుగుతుందనే అనుకుంటాను.

జీవితంలోంచే కథలొస్తాయి. మరీ కొరెలీ జీవితానికీ ఆమె సృష్టించిన పాత్ర మేవిస్ క్లేర్ జీవితానికీ కొన్ని సామ్యాలున్నాయి. కొరెలీకి కుటుంబంలేదు. ఆమె రచనలని కూడా ఆనాటి సమాజంలో బుధవరులు క్రూరవిమర్శపాలు చేసేరు. ఆమె కూడా సమాజానికీ, అధికారపూరిత సాహితీశేఖరులకీ దూరంగా ఏకాంతవాసం గడిపింది. ఆమెకి విశేషంగా ఖ్యాతి తెచ్చిన నవల Sorrows of Satan. ఆమె ఇతరనవలలో Thelma (రొమాన్సు నవల), కూడా చదివేను. వాటిలో కూడా ఇలాగే కొంత అభూతకల్పన ఉంటుంది కానీ దాన్ని ఆమె సమకాలీనసమాజం చిత్రించడానికి ఉపయోగించుకున్న తీరు మనని ఆకట్టుకుంటుంది.

ఆమె శైలికి ఉదాహరణగా కింద కొన్ని భాగాలు ఇస్తున్నాను. ఇవి గుటెన్బర్గ్.ఆర్గ్ వారి సైటులోంచి కిండిల్ కాపీలోంచి తీసుకున్నవి. ఇక్కడ కొన్ని అక్షరాలు గల్లంతయేయి. ఇతర సైటులోంచి తీసుకుంటే మంచి కాపీ రావచ్చు.

సమకాలీన సాహిత్యంగురించి కొన్ని వాక్యాలు –

“What put it into your head, my dear Tempest, to write a book dealing with, as you say, * the noblest forms of life* ? There are no noble forms of life left on this planet,—it is all low and commercial,—man is a pigmy, and his aims arg” pigmy like himself. For noble forms of life seek other worlds !—there are others. Then again, people don’t want their thoughts raised or purified in the novels they read for amusement—they go to church for that, and get very bored during the process. And why should you wish to comfort folks who, out of their own sheer stupidity generally, get into trouble? They wouldn’t comfort7^7^,—they would not give you sixpence to save you from starvation. My good fellow, leave your quixotism behind you with your poverty. Live your life to yourself,—if you do anything for others they will only treat you with the blackest ingratitude,—so take my advice, and don’t sacrifice your own personal interests for any consideration whatever.”

– Marie Corelli. The Sorrows of Satan (Kindle Locations 585-591). J. B. Lippincott company.

If it is to succeed by itself, it must not attempt to be literature,—it must simply be indecent. As indecent as you can make it 4 without offending advanced women,—that is giving you a good wide margin. Put in as much as you can about sexual matters and the bearing of children,—in brief, discourse of men and women simply as cattle who exist merely for breeding purposes, and your success will be enormous. There’s not a critic living who won’t applaud you,—there’s not a s school-girl of fifteen who will not gloat over your pages in the silence of her virginal bedroom !”

– Marie Corelli. The Sorrows of Satan (Kindle Locations 576-583). J. B. Lippincott company.

స్త్రీ అంటే జఫ్రీ ప్రకటించిన అభిప్రాయం ఆనాటి సమాజంలో కొందరి అభిప్రాయం కావచ్చు –

“I myself have no sympathy with the new ideas that are in vogue concerning the intellectuality of woman. She is simply the female of man,—she has no real soul save that which is a reflex of his, and being destitute of logic, she is incapable of forming a correct opinion on any subject. All the imposture of religion is kept up by this unmathematical hysterical creature,—and it is curious, considering how inferior a being she is, what mischief she has contrived to make in the world, upsetting the plans of the wisest kings and counsellors, who as mere men, should undoubtedly have mastered her!

– Marie Corelli. The Sorrows of Satan (Kindle Locations 665-669). J. B. Lippincott company.

మేవిస్‌ ఖ్యాతి చూసి, ఈర్ష్యతో కువిమర్శ రాసి, ప్రచురించి, తన దుగ్ధ తీర్చుకున్న జఫ్రీ ఆమెని ప్రత్యక్షంగా చూసినప్పుడు, అతని ఆలోచనలు –

the woman I saw was Mavis Clare. That small head was surely never made for the wearing of deathless laurels, but rather for a garland of roses (sweet and perishable) twined by a lover’s hand. No such slight feminine creature as the one K 19 I now looked upon could ever be capable of the intellectual grasp and power of * Differences/ the book I secretly admired and wondered at, but which I had anonymously striven to * quash’ in its successful career. The writer of such a work, I imagined, must needs be of a more or less strong physique, with pronounced features and an impressive personality.

– Marie Corelli. The Sorrows of Satan (Kindle Locations 3879-3886). J. B. Lippincott company.

జఫ్రీ రాసిన విమర్శ చూసినా, మేవిన్ అతనిని సాదరంగా ఇంట్లోకి ఆహ్వానిస్తుంది. జఫ్రీ విమర్శకులగురించి ఆమెఅభిప్రాయం అడిగితే, ఆమె నవ్వి తను వారిని పావురాళ్ళతో పోలుస్తానంటుంది –

Here are my reviewers !’* she said laughing. ” Are they not pretty creatures? The ones I know best are named after their respective journals,—there are plenty of anonymous ones of course, who flock in with the rest. Here, for instance, is the * Saturday Review,’ ” and she picked up a strutting bird with coral-tinted feet, who seemed to rather like the attention shown to him. ” He fights with all his companions and drives them away from the food whenever he can. He is such a quarrelsome creature !”—^here she stroked the bird’s head. ” You never know how to please him,—he takes offence at the corn sometimes, and will only eat peas,

– Marie Corelli. The Sorrows of Satan (Kindle Locations 4064-4067). J. B. Lippincott company.

Marie Corelli జీవిత విశేషాలూ, రచనావిశేషాలూ వికిపీడియాలో చూడండి. http://en.wikipedia.org/wiki/Marie_Corelli.

(గుటెన్‌బర్గ్.ఆర్గ్ వారికి కృతజ్ఞతలు.)

(అక్టోబరు 5, 2013)

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s