ఊసుపోక – నా ఆరోగ్యసూత్రాలు

(ఎన్నెమ్మకతలు 126)

గమనిక – ఈ సూత్రములు కాలపరీక్షకి తట్టుకుని నిలిచినవి. ఆ పరీక్షలు నేనే చేసేను. ఫలితాలు నేనే అక్షరగతం చేస్తున్నాను. ఇవి ఉద్యోగస్థులకీ పిల్లలతల్లులకీ ఇప్పుడు సాధ్యం కాకపోవచ్చు కానీ ఉద్యోగాలు విరమించిన తరవాత, పిల్లలు ఇల్లు వదిలేసేక తప్పక పనికరాగలవని నానమ్మకం.

 పది రోజులక్రితం ఒకరోజు పొద్దున్నే ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఏడు గంటల ముప్ఫై నిముషాలకి నాకు వృద్ధాప్యము ప్రవేశించినదని గ్రహించేను. అప్పటికి నేను లేచి మూడు గంటల ముప్ఫై నిముషములయినది. మరి ఏడు గంటల ముప్ఫై నిముషాలవరకూ ఎందుకు తెలీలేదు లేదా అప్పుడే ఎలా తెలిసింది, అసలు ఎవరైనా ఎలా తెలుసుకుంటారు లాటి ప్రశ్నలు చాలా కలుగవచ్చు మీకు. వాటికి తరవాత జవాబులు చెప్తాను.

ఉదయం లేస్తూనే కాలు పీకడం మొదలుపెట్టింది. నిలిచినా నడిచినా రెండు కాళ్ళమీద చేస్తాం కదా ఒక కాలే ఎందుకు నొప్పెడుతోంది అని నాకు కలిగిన మొదటి సందేహం. సరే, అది తరవాత చూదాం అసలు నొప్పి ఎందుకొస్తోంది అని ఆలోచించడం మొదలు పెట్టేను. మీకు చెప్పేనో లేదో – మామూలుగా నాకు ఏ రుగ్మత సంభవించినా ముందు నాకు నేను వైద్యం చేసుకోడానికి ప్రయత్నిస్తాను. డాక్టరు దగ్గరికి వెళ్తే ఆయన లేక ఆవిడ ఏం ప్రశ్నలు వేస్తారో అవి నాకు నేను వేసుకుంటాను.

నొప్పి ఎప్పుడు మొదలయింది? ఎక్కడ? ఎలా?

కూర్చున్నప్పుడా? నిల్చున్నప్పుడా? నడుస్తున్నప్పుడా?

ఎంత సేపు కూర్చుంటే? … నిల్చుంటే? … నడిస్తే?

ఎక్కడ కూర్చుంటే? …

ఇలా ప్రాథమిక పరీక్ష అయింతరవాత, ఆ స్థితి ఒకొకటే మార్చి చూస్తాను.

మూడు మైళ్ళకి బదులు ఒక మైలు నడువు

కుర్చీ మార్చి చూడు

కాలు మార్చి కాలు మీద నిల్చుని చూడు.

మొదటి సూత్రం నడక – తగ్గించేను. అప్పుడు మరో బాధ మొదలయింది – ఆకలి. అలా నాలుగ్గోడలమధ్య నాకు నేనే బందీనై కూర్చుంటే ఆకలేస్తున్నట్టనిపించింది – ఒక అరటిపండు, రెండు రొట్టెముక్కలు, మూడు ప్లేట్లు పకోడీలు … అలా తింటూనే ఉన్నాను, కడుపు మాత్రం ఖాళీగా కరి మింగిన వెలగపండులా డొల్లగా ఉంది. బకాసురభావం … హా. ఇదో కొత్త అనుభవం నాకు.

మామూలుగా నేను నా శరీరాన్ని గౌరవిస్తాను. నాశరీరం చెప్తుంది ఏం తినాలో… తాజా నెయ్యితో పూర్ణాలు  తిందామా, గోంగూర తిందామా, పళ్ళు తిందామా, మిరపకాయ బజ్జీలా, మైసూరుపాకా అన్నది నాకు టెలిపతిలో తెలుస్తుంది. నేను నాశరీరతత్వాన్ని మన్నించి ఆపకుండా తినడం సాగించేను. అసలు తింటేనే శరీరం ఉంటుంది. శరీరం ఉంటేనే బతుకు. మన దేశంలో భోజనానికి ఎంత ప్రాముఖ్యం ఉందో వెనకటి తరాలవారికి తెలిసే ఉండాలి. చక్కగా పీటమీద మఠం వేసుక్కూచుని నిదానంగా రుచులు అనుభవిస్తూ తినాలి. భోజనందగ్గర మాటాడకూడదంటారు. ఎందుకు? తింటున్న తిండిమీద దృష్టి పెట్టకపోతే తిన్నది ఒంట బట్టదుట. సరే, ఇంతకీ నేను ఎంత తినడం ఎన్నిసార్లు తినడం – అన్నది ద్విగుణీకృతం చేసేక, సత్ఫలితాలు కనిపించసాగేయి.

క్రమంగా కాలునొప్పి తగ్గినట్టే అనిపిస్తోంది.

అంచేత నా ఆరోగ్య సూత్రం – తిరగడం తగ్గించి తినడం హెచ్చించవలెను.

సాధారణంగా నేను కనుగొన్న పరమసత్యాలు మాఅమ్మాయికి కూడా చెప్తాను.

Exercise less eat more అని టైపు చేసి ఫ్రిజిమీద పెట్టుకోమని సలహా ఇచ్చేను. మాపిల్ల తను గ్రహించిన ఈ బ్రహ్మరహస్యంలాటి ఆరోగ్యసూత్రం స్నేహితులకి వెంటనే ట్వీట్ చేసింది. ఒక భారతీయుడు తిరుగుట్వీటు చేసేడు భారతీయ తల్లులు పొట్ట పేలిపోయేవరకు పిల్లలకి మెక్కబెడతారు ప్రేమతో అని.

ఇక్కడే నాకు చిన్న పేచీ. నేను మాపాపకి అలా మెక్క బెట్టలేదు. అసలు నేను ఎప్పుడూ ఎవర్నీ అతిథులని కూడా తిను తిను అంటూ చంపుకు తినను.

సత్యప్రమాణంగా మా చిట్టితల్లి చెప్పవలసిన కథ ఇలా ఉండాలి నన్నడిగితే –

బువ్వ తిందువు రమ్మంటే పారిపోతాను

onsteps

నావంట నేనే చేసుకుంటాను

cooking2

cooking 1

cooking 3

 

 

 

నారుచులు నాయిష్టం

DSC01268eating 1

 

 

 

 

అంతే కథ.

(అక్టోబరు 25, 2013)

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

13 thoughts on “ఊసుపోక – నా ఆరోగ్యసూత్రాలు”

 1. మీరా, :)). అవును సరయు బొమ్మలే. నువ్వు సరయుని ఎత్తుకుని తీసుకున్న బొమ్మ నాదగ్గర కూడా ఉంది. తనకి నువ్వు గ్రీన్ ఆంటీగానే ఇప్పటికీ గుర్తు. photolithography Luda ఏమిటి. అది నాకు అర్థం కాలేదు.

  మెచ్చుకోండి

 2. లక్ష్మీ రాఘవ, అయ్యో, నేనిక్కడ రాసినవన్నీ నిజం అనుకోకండీ. కాలక్షేపానికీ రాస్తాను, కథకోసం చాలా ఉత్ర్పేక్షలుంటాయి.
  సివిఆర్ మోహన్, అదేమిటండి వేదమంత్రంలా అన్నిమార్లు రాసేరు ఒకే వాక్యం. మీక్కూడా పై సమాధానమే. నేను రాసేవన్నీ నాజీవితానికి సంబంధించివే అనుకుని సలహాలు ఇస్తున్నట్టున్నారు మీరు. నేను రాసేవన్నీ ఉత్తిత్తి కథలే.

  మెచ్చుకోండి

 3. పాత రోగి, సగం వైద్యుడే కదా మరి,
  నొప్పి తగ్గితే, తినడం తగ్గిచ్చి నడక పెంచండి.
  పాపాయి పోజుల జవాబులు, ఎంతో చక్కగా ఉన్నాయి
  పాత రోగి, సగం వైద్యుడే కదా మరి,
  నొప్పి తగ్గితే, తినడం తగ్గిచ్చి నడక పెంచండి.
  పాపాయి పోజుల జవాబులు, ఎంతో చక్కగా ఉన్నాయి
  పాత రోగి, సగం వైద్యుడే కదా మరి,
  నొప్పి తగ్గితే, తినడం తగ్గిచ్చి నడక పెంచండి.
  పాపాయి పోజుల జవాబులు, ఎంతో చక్కగా ఉన్నాయి

  మెచ్చుకోండి

 4. మీ ఆరోగ్య సూత్రాలు చూడగానే ఎంత బావున్నాయ్ నేను ఫాలో ఐపోదామ్ అనుకున్నా..అంతలో చిన్నప్పుడు మా నాన్నగారు చెప్పే కథ జ్ఞాపకానికి వచ్చింది.

  కొత్తగా డాట్రీ నేర్చుకున్న వొక కుర్ర డాక్టర్ దగ్గరకి జ్వరం వచ్చిందని ఒకడొచ్చాట్ట. ఎవో మందులిచ్చి పంపాక, రెండ్రోజుల తరవాత వచ్చి సుభ్భరంగా ఆవకాయన్నం తిన్నాను జరం గిరం తగ్గిపోయింది అని చెప్పాట్ట. వోహో జరానికి ఆవకాయన్నం మందు అని పుస్తకంలో రాసుకుని, తర్వాత వచ్చిన పేషెంట్ కి కూడా అదే చిట్కా చెప్పాట్ట. అతను రెండో రోజుకి హరీ మన్నాట్ట. :)))

  మెచ్చుకోండి

 5. సున్నా, అందుకే గబగబ ఇప్పుడే వెళ్ళి బండెడు తినుబండారాలు తెచ్చేసి మీ ఫ్రిజు, రెండో ప్రిజు కూడా నింపేసుకోండి. నాకు ముసిల్తనమేమిటి, హాహా భలే అన్నారు.

  మెచ్చుకోండి

 6. ఇంకా నయం. “మీకు ఆకలేస్తే నాకు టెలిపతీలో ఓ మెసేజ్ పంపించండి” అన్నారు కాదు. అది నేను పంపించినప్పుడు మీరు నిద్దర్లో ఉంటే? లేచేదాకా నాగోల ఎవడు పట్టించుకుంటాడు? అది మీ “శరీర-పతీ” అవుతుందేమోకానీ టెలీపతీ ఎలా అవుతుంది?

  సరిగ్గా ఏ గంటలో మీ ముసిల్తనం బయల్దేరిందని గ్రహించారో, అదే సమయంలో మీ మెమరీ బాగానే పనిచేస్తోంది కదా? మరింకా ముసిల్తనమేవిటి?

  ఇండియన్ ఇంకో అబ్బాయ్ రి-ట్వీట్ చేసాడన్నారే? అది మాత్రం వెయ్యి శాతం నిజం. కొత్తగా కొడుకో కూతురో పుట్టి ఉంటుంది ఆయనకి. మేము – బీన్ దేర్ – డన్ దట్ 🙂

  మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s