ఊసుపోక – ధర్మసందేహం

(ఎన్నెమ్మకతలు 133)

ఏెంటో ఇవాళ పొద్దున్న లేస్తూనే ధర్మసందేహాలు. అందులోనూ తెల్లవారు రాసిన హిండూ నమ్మకాలు చదువుతుంటే మరీ గందరగోళం. దేవుడున్నాడాతో మొదలు పెట్టి, ఆత్మ ఉందా, ఉంటే అది స్థూలపదార్థమా, చిత్ పదార్థమా, మనిషి మరణించేక ఆత్మ గతేమిటి, నీటిలా ఆవిరయిపోతుందా, అగ్నిలో మసి అయిపోతుందా, తిరిగి ఈ భూమ్మీద అవతరిస్తుందా

అవతరిస్తుందనే చాలామంది నమ్ముతున్నట్టుంది.

ఇప్పుడు నాకు మరో ప్రశ్న, మరి అవే ఆత్మలు మళ్ళీ మళ్లీ చచ్చి పుడుతుంటే, లోకంలో జనాభా పెరగడం ఎలా జరుగుతోంది? ఒకే ఆత్మ రెండు మూడు ఆత్మలుగా అవతరిస్తుందా?

ఇంకా కొన్ని ప్రశ్నలున్నాయి, కానీ వీటికి జవాబులు దొరికినతరవాత, అవి అడుగుతాను.

ఈ ఏటికి ఇంతే సంగతులు

(డిసెంబరు ఆఖరు 2013)

గ్రంధకర్త మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

8 thoughts on “ఊసుపోక – ధర్మసందేహం”

 1. అదేనండి, సందేహాలుంటే విశ్వాసాలుండవు. కానీ ప్రశ్నించుకుని, సమాధానాలు చెప్పుకున్నతరవాత కలిగే విశ్వాసానికి బలం ఎక్కువ అనుకుంటున్నాను.

  ఇష్టం

 2. SunnA, మీరు ఉదహరించిన శ్లోకాలు విన్నాను కానీ అట్టే అవగాహన లేదు. మీరిచ్చిన వివరణకి ధన్యవాదాలు

  ఇష్టం

 3. మనుషులకే కాక జంతువులూ, పక్షులు, మొక్కలు మొదలైన వాటికి కూడా అత్మలుంటాయి. మనం వాటి జనాభాని బాగా తగ్గించేస్తున్నాము కాబట్టి అవన్నీ తిరిగి మనుషులుగా పుట్టి మన జనాభా ఇలా పెరిగిపోతోంది.

  ఇష్టం

 4. ఈ శ్లోకం ఎన్ని సార్లు చదివారు ఇప్పటికి?

  ఓం, పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణాస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే.

  ఆత్మ అనేది ఒకటే ఎప్పుడూ. అది సూర్యుడు కుండలోని నీటిలో, పైన అకాశంలోనూ కనిపించినట్టు రెండు చోట్ల (అక్కడ పరమాత్మలోనూ, ఇక్కడ జీవాత్మలోనూ) కనపడుతూ ఉంటుంది. దాని మూలాన రెండు సూర్యుళ్ళున్నట్టా? అదే కోటి (లేకపోతే ఒక భూరి కానీ గూగాల్ కానీ) కుండల్లో ఒకే సూర్యుడు కనపడతాడు కూడా. అప్పుడు కోటి ప్లస్ ఒక సూర్యుళ్ళున్నట్టా?

  ఏకం సత్ విప్రా బహుధావదంతి. విప్రుడంటే జంధ్యం వేసుకున్న బ్రాహ్మణుడు అని ఎక్కడా లేదు. తెల్లవాడు విప్రుడు కావొచ్చు. ఎవరు ఎలా అర్ధం చేసుకుంటే అలా వాళ్ళ వ్యాఖ్యానం ఉంటుంది.

  ఆత్మ గురించి భగవద్గీతలో ఆశ్చర్యవత్… అనే శ్లోకం మళ్ళీ చదవండి. ఎంత చర్చించినా ఇది బుద్ధికి గానీ మనసుకి కానీ అందేది కాదు. ఆత్మకి చావేమిటి, శరీరానికి కానీ? అందుకే ఎవరైనా పోయినప్పుడు “వీరి ఆత్మకి శాంతి కలుగు గాక” అనడం నవ్వు తెప్పించే విషయం. ఆసలీ రెస్ట్ ఇన్ పీస్ అనేదే ఒక అర్ధం లేని మాటలా అనిపిస్తూ ఉంటుంది. ఏమో లెండి పోయిన జీవుడు ఏ భయంకరమైన మనః స్థితిలో పోయాడో మనకి తెలియదు కనక ఆ పోయిన మనస్సుకి కొట్టాడకుండా శాంతి కలుగుగాక అనొచ్చేమో.

  పోయేటప్పుడు ఇంద్రియాలు మనస్సులోకీ లాగబడి అది ఆత్మని అంటిపెట్టుకుని ఇంకో జన్మ ఎత్తుతుందిట. అందుకే ఈ వాసనలు వచ్చే జన్మలో కూడా ఉంటాయి అంటారు. అదే మనస్సు లోపలకి చూడడం మొదలైతే అది ఆత్మలో కలిసిపోయి మనసు అనేది నాశనం అవుతుందిట. దానితో “నేను” అనేది పోయి, అహం బ్రహ్మాస్మి అనే దివ్యానుభూతి కలుగుతుంది(ట). అప్పుడు ఆత్మని పట్టుకుని వేరేచోటకి ఈడిచే మనస్సు ఉండదు కనక ఇంకో జన్మ లేదు. అంటే మనం మన కుండ పగులకొట్టి ఆకాశంలో ఉన్న ఒకే సూర్యుణ్ణి చూస్తాం అప్పుడు. ఇది నా మిడి మిడి జ్ఞానంతో అర్ధంచేసుకున్నది.

  అన్నట్టు మీ ఫోటో ఇప్పుడు కాస్త బావుందండోయ్!🙂

  నూతన సంవత్సర శుభాకాంక్షలు.

  ఇష్టం

టపాలో చర్చించిన అంశంమీద వ్యాఖ్యానాలు తెలుగులో రాసిన వ్యాఖ్యలు మాత్రమే అంగీకరింపబడతాయి. తెంగ్లీషులో రాసిన వ్యాఖ్యలు కూడా నాకు సమ్మతం కాదు. కోరుతున్నాను

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / మార్చు )

Connecting to %s