గృహలక్ష్మి స్వర్ణకంకణము

కె.యన్. కేసరిగారి చిన్ననాటి ముచ్చట్లు చదివిన తరవాత నాకు ఈ స్వర్ణకంకణం పురస్కారం గురించిన ఆలోచనలు కలిగేయి. పూర్వకాలంలో రాజులు ఒక మధురవాణినీ, ఒక రంగాజమ్మనీ సభలలో గౌరవించేరు కానీ ఆధునికయుగంలో స్త్రీలని ఒక క్రమపద్ధతిలో గౌరవించడం ఈ స్వర్ణకంకణంతోనే మొదలయింది నాకు తెలిసినంతవరకూ. కేసరిగారు కనుపర్తి వరలక్ష్మమ్మను, కాంచనపల్లి కనకాంబను, రత్నాల కనకాబాయిని, చిలకపాటి శీతాంబను సత్కరించేనని చెప్పేరు కానీ ఏ సంవత్సరమో తెలీదు. మొదటి ఇద్దరివిషయంలో ఆ వివరాలు దొరికేయి కానీ మిగతా ఇద్దరివిషయం తెలీదు. అలాగే ఇంకా అనేకమంది వివరాలు తెలియడంలేదు. ముఖ్యంగా ప్రస్తుతం చాలామందికి ఫోనుకాల్ దూరంలో ఉన్నవారిగురించి కూడా ఈ వివరాలు తెలియకపోవడం విచారకరం.

మీఅందరికీ నా విన్నపము ఏమిటంటే,

ఇక్కడ నాకు తెలిసిన వివరాలు పెట్టేను. వీరిలో కొందరైనా మీబంధువులో, స్నేహితులో, కలిసి చదువుకున్నవారో అయి ఉండవచ్చు. మీకు ఎవరివిషయం తెలిసినా, ఈవ్యాసం చివర ఉన్న వ్యాఖ్యపెట్టెలో తెలియజేయండి. ఈ జాబితాలో లేని పేర్లు తెలిస్తే కూడా నాకు తెలియజేయండి.

గమనిక – ఈ జాబితా గృహలక్ష్మి స్వర్ణకంకణము పురస్కారానికే పరిమితం. ఇతర పురస్కారాలు ఇక్కడ

తెవికి పేజీలో ఒక పేజీ సృష్టించేను నాకు తెలిసినవివరాలతో. మీరు అధికంగా ఇచ్చిన వివరాలతో అక్కడ అప్డేట్ చేస్తాను.

గృహలక్ష్మి స్వర్ణకంకణం సత్కారం పొందిన మహిళలు

కనుపర్తి వరలక్ష్మమ్మ (1934)

పులవర్తి కమలావతి (1936)

గిడుగు లక్ష్మీకాంతమ్మ (1942)

స్థానాపతి రుక్మిణమ్మ (1953)

కనకదుర్గా రామచంద్రన్ (1961)

తెన్నేటి హేమలత (1963)

ద్వివేదుల విశాలాక్షి (1966)

చిలకపాటి శీతాంబ

రత్నాల కమలాబాయి

కాంచనపల్లి కనకాంబ

గుడిపూడి ఇందుమతీదేవి

నాయని కృష్ణకుమారి

కొమ్మూరి పద్మావతీదేవి

వేదుల మీనాక్షీదేవి

కె. రామలక్ష్మి

ఊటుకూరి లక్ష్మీకాన్తమ్మ

గిడుగు లక్ష్మీకాంతమ్మ

వాసిరెడ్డి సీతాదేవి

అరవింద (ఎ. సుగుణమణి)

మాలతీ చందూర్

తురగా జానకీ రాణి

యద్దనపూడి సులోచనారాణి

ఉన్నవ విజయలక్ష్మి

సి. ఆనందారామం

పోలాప్రగడ రాజ్యలక్ష్మి

డి. కామేశ్వరి

శారదా అశోకవర్థన్

వాసా ప్రభావతి

ఈ గౌరవం అందుకోదగ్గవారు కొందరు అందుకోలేదేమో. లేదా, అందుకున్నారు కానీ నాకు ఆధారాలు దొరకలేదు. అంచేత, పై జాబితాలో చేర్చలేదు. అలాటిపేర్లు కింద ఇస్తున్నాను.

బుర్రా కమలాదేవి – ఈమె ఏ కాలేజీలోనూ చదువుకోకపోయినా, ఈమె రాసిన ఛందోహంసి ఉభయబాషాప్రవీణ పాఠ్యగ్రంథంగా అంగీకరింపబడింది.

నాళము సుశీలాదేవి – ఈమె ఊటుకూరి లక్ష్మీకాన్తమ్మగారితల్లి. ఆంధ్రమహిళాగానసభ స్థాపించి, స్త్రీల అభివృద్ధికి కృషి చేసేరు.

దుర్గాబాయి దేశముఖ్ – ఈమెగురించి నేను చెప్ఫఖ్ఖర్లేదు కదా.

టంగుటూరి సూర్యకుమారి – అంతర్జాతీయ ఖ్యాతి గొన్న ప్రముఖ గాయని.

ఇలా ఇంకా ఎంతోమంది ఉండవచ్చు. మరొకసారి అడుగుతున్నాను. మన చరిత్ర మనమే పదిలపరుచుకోవాలి. మీ సహాయ సహకారాలు అందించండి.

జనాంతికం – తెవికిపీడియోలో కె. రామలక్ష్మిగారిగురించి ఒకే వాక్యం ఉంది. అది – “ప్రముఖ రచయిత, అభ్యుదయకవి, పండితుడు, పరిశోధకుడు, నాటక కర్త మరియు విమర్శకుడు అయిన ఆరుద్ర అర్దాంగి మరియు రచయిత్రి”. రామలక్ష్మిగారు చేసిన సాహిత్య సేవ అంతా ఇదా అనిపించి నవ్వుకున్నాను.

  • మాలతి

(మార్చి 1, 2014)

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.