ఊసుపోక – కథకులలో సౌహార్దము

(ఎన్నెమ్మకతలు 137 – కథకులలో సౌహార్దము)

కాకతాళీయంగానే గత నెలరోజుల్లో మధురాంతకం రాజారాంగారి కథలు 3 చదవడం పూర్తి చేస్తూనే మునిపల్లె రాజుగారి అస్తిత్వనదం ఆవలితీరాన చేతికొచ్చింది. నాకిది అయాచితంగా లభించిన వరం.

ఈసందర్భంలో ఈ రెండు వ్యాఖ్యానాలు, ఇద్దరు సుప్రసిద్ధరచయితలవి, ప్రముఖంగా నన్ను ఆకర్షించేయి. సాహిత్యంలో సౌహార్దము అంటే ఇదేనేమో అనిపించింది. మీ అభిప్రాయాలకోసం ఇక్కడ పెడుతున్నాను.

రాజారాంగారి కథలగురించి మునిపల్లె రాజుగారి వ్యాఖ్యానం –

సాహిత్యంలో మాసిపోతున్న విలువలకు అడ్డుకట్టవేసి, క్షద్రసాహిత్యరీతులనుంచి విముక్తి చేసి అనేకమంది యువరచయితలముందు ఒక సుందరస్వప్నాన్ని ఆదర్శంగా నిలిపి, ప్రేరకుడై, గురుసత్తముడై – ప్రేమనూ, ప్రకృతినీ, సమాజ సమస్యలనూ కావ్యమర్యాదకు భంగం కలుగకుండా- ఐతిహాసమూ కాల్పనికతలతో మిళితం చేసి, అధిక్షేపణా వ్యంగ్యమూ రంగరించి పోసి – తెలుగుపల్లెల కథాగానాన్ని లోకానికి వినిపించిన యాత్రీ గాయకుడికి – ఆరాధనోత్సవం (ఈ ప్రచురణ). ఆ యాత్రికుడు రాజారాం. ఆ గాయకుడు రాజారాం.

(మునిపల్లె రాజుగారి పరిచయవాక్యాలు – మధురాంతకం రాజారాం కథలు 3.).

మునిపల్లె రాజుగారికథలగురించి మధురాంతకం రాజారాంగారి వ్యాఖ్యానం –

పారతంత్ర్య భారతదేశంలో పుట్టి, ఉగ్గుపాలతోనే జాతీయావేశాన్ని సంతరించుకుని, మహాంధ్రోదయంకోసం కలలు కని, స్వాతంత్ర్యానంతరపరిస్థితులని చూచి నిర్వేదం చెందుతూ, యిలా మేలుకీళ్ళన్నింటికీ సాక్షిగా, నిరంతరం ధర్మపక్షపాతిగా, సంఘశ్రేయస్సుకు దోహదకరమైన ఉద్యమాలన్నింటిలోనూ చేయీ చేయీ కలిపి నడుస్తున్న రచయిత మునిపల్లె రాజుగారు.

(మధురాంతకం రాజారాంగారి పరిచయవాక్యాలు – మునిపల్లె రాజుగారి అస్తిత్వనదం ఆవలితీరాన.)

 

 

 

 

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

2 thoughts on “ఊసుపోక – కథకులలో సౌహార్దము”

  1. నారాయణస్వామి, నాపని అయిపోయేక, కావలిస్తే, నాదగ్గరున్న కాపీ మీకు పంపగలను. ప్రస్తుతానికి బజారులో దొరకడంలేదని విన్నాను.

    మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s