ఊసుపోక – ఏముంది మనసంస్కృతిలో ప్చ్!

(ఎన్నెమ్మకతలు 139)

…ప్చ్ అనేవాళ్ళకోసం ఓ చిన్న ఆలోచన. నిన్నసాయంత్రం సుధ, డాక్టరుగారూ మాఇంటికి విచ్చేసి, భోజనాలయేక, ముగ్గురం, ఏటి ఒడ్డున తీరిగ్గా నడుస్తున్నాం తెలుగులో కబుర్లు చెప్పుకుంటూ. మా వెనక వస్తున్నాయనని చూసి, డాక్టరుగారు, “పెద్దాయనకి దారీయండి,” అన్నారు, మొత్తం కాలిదారి అంతా పరుచుకు నడుస్తున్న నన్నూ, సుధని. మేమిద్దరం పక్కకి తప్పుకున్నాం. వెనకనించి వస్తున్నాయన మమ్మల్ని దాటుకుని రెండడుగులు ముందుకి వెళ్లి, గిరుక్కున వెనక్కి తిరిగి, “మీరెక్కడుంటారు?” అని అడిగేరు. వేరు చెప్పనేల. ఆయనా తెలుగువారే. అలా మాటాడుకుంటూ మా వాటావరకూ వచ్చేక, లోపలికి రమ్మన్నాం ఆయన్ని. మాటలు బాగానే కలిసేయి. ఆయన అన్నారు, “ఈ ఇంగ్లీషు చదువులతో పట్టించుకోలేదు కానీ రిటైరయినతరవాత చూస్తే, మన సంప్రదాయంలో అన్నీ ఉన్నాయి,” అంటూ వాళ్ళ నాన్నగారు ఆయుర్వేద వైద్యులని చెప్పి, మిరియాలు, పసుపువంటి మన దినసరి వెచ్చాలతో  చిన్న నలతలే కాక ఊపిరితిత్తులతాలూకు జాడ్యాలూ కూడా కుచర్చవచ్చనిఅరగంటసేపు వివరించేరు. నాకు చాలా భలే సరదా వేసింది.

ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నానంటే, మన సంస్కృతిలో, సాహిత్యంలో “ఇది లేదేం? అది లేదేం” అని ప్రశ్నించేవారు మొదట మనసంస్కృతిలో సాహిత్యంలో ఏముందో క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ఆ తరవాత, ఈ ఉన్నవి ఎలా ఏర్పడ్డాయో తెలుసుకోవాలి. ఆ తరవాతే మిగతా చర్చ.

ఈవిషయం నేను అప్పుడప్పుడు ప్రస్తావిస్తూ వస్తున్నాను. గత రెండు, మూడు నెలలలో ఫేస్బుక్కులో నాకంటె ఒకటి రెండు దశాబ్దాలు చిన్నవాళ్లు కాదు రెండో మూడో తరాలే వెనకటివాళ్ళు చదివిన పుస్తకాలు, చేసే చర్చలూ చూస్తే నాకు పరమాశ్చర్యంగానూ, పరమానందంగానూ కూడా ఉంది.

ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నానంటే, జాంబ పురాణం పేరు విన్నాను కానీ డక్కలి జాంబపురాణం అని ఒకటుందని నాకు తెలీదు. నాకు తెలీనివి కొన్ని లక్షలున్నాయనుకోండి. అది వేరే సంగతి. కానీ ఈ తరం యువకులలో ఇలాటి పుస్తకాలు చదివి నిశితంగా ఆలోచించేవారున్నారని హేలీ కల్యాణ్ డక్కలి జాంబపురాణం అన్న పుస్తకం సమీక్షిస్తూ రాసినవ్యాసం పుస్తకం.నెట్‌లో చదివేక తెలిసింది. కానీ అది సమీక్ష మాత్రమే. వ్యాసం చదివిన తరవాత పుస్తకం కూడా చదవగలరని ఆశిస్తున్నాను. నేను చదువుతానో చదవనో చెప్పలేను కానీ ఈ వ్యాసం నాకు మరోమారు ఊరట కలిగించిందని మాత్రం చెప్పగలను.

 

(మే 9, 2014)

 

 

 

 

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

5 thoughts on “ఊసుపోక – ఏముంది మనసంస్కృతిలో ప్చ్!”

  1. ప్రభాకర్ గారూ, నమస్కారం మీ వ్యాసం ఈరోజే చూసేను. చాలా విపులంగా చర్చించేరు అనేక అంశాలను. మంచి పరిచయం. పంచుకున్నందుకు ధన్యవాదాలు. అభినందనలు.
    మీరు నారచనలను చదవడం నాకు గౌరవప్రదంగా బావిస్తున్నాను. ధన్యవాదాలు.

    మెచ్చుకోండి

  2. “మరోమారు ఊరట కలిగించిందని మాత్రం చెప్పగలను.” అవునండి ఎన్ని మాధ్యమాలు వస్తున్నా కాస్త సంశయించినా నిదానంగా తొంగి చూసేదటువంటి సాంత్వన కొరకేనండి- సాహిత్యమో సాంప్రదాయమో సంస్కృతో చిరు తాకిడితో సేద తీరుస్తుంది. ““ఈ ఇంగ్లీషు చదువులతో పట్టించుకోలేదు..” నా సహోద్యోగి ఒకరు మా వెనుకటి వాళ్ళంతా పండితులు, తాళ పత్రాల కట్టలు విప్పే చూసే తీరిక ఓపికా నాకు లేక వదిలేసా అంటుంటే నోరు వెళ్ళబెట్టి చూసాను.

    మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు, తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరింపబడును.

Please log in using one of these methods to post your comment:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s