అనువాదసమస్యలు – తను

తెలుగునుండి ఇంగ్లీషులోకి అనువదించినప్పుడు తెలుగుకే ప్రత్యేకమైన నుడికారం అనువదించడంలో ఇబ్బందులు ఇదివరకు ప్రస్తావించేను. అయినా మళ్ళీ ఇప్పుడు అనువాదం చేస్తుంటే, మరోసారి ప్రస్తావించాలనిపిస్తోంది.

“తను” తెలుగుకి ప్రత్యేకమైన సర్వనామం. సాధారణంగా మనకథల్లో అప్పుడప్పుడు ఇది reflexiveగా వాడడం జరుగుతుంది.

“సీత తనకోసమే కొనుక్కుంది ఆ చీర” అంటే అక్కడ తను కూడా సీతకే ఉద్దేశింపబడింది. Sita bought the sari for herself అంటే సరిపోతుంది.

“తను వస్తానంది కానీ అతను వద్దన్నాడు” అంటే ఇక్కడ ఇద్దరు ఉన్నారన్నది స్పష్టం. కానీ లింగబేధాలమూలంగా ఇది కూడా అనువాదంలో అట్టే బాధించదు. She said she would go with him, but he said no.

మూలంలో పాత్రలకి పేర్లు ఉండి, కథలో కొన్ని సందర్భాలలో “తను” ఉపయోగిస్తే, కథ రచయిత ఇచ్చిన పేరో, బంధుత్వపదమో (అమ్మ, నాన్న, …)  లెక్కల్లో ఎక్స్ అప్పు తెచ్చుకున్నట్టు, అనువాదంలో వాడుకుని, అసందిగ్ధత తొలగించవచ్చు.

కానీ కథంతా “తను”తోనే నడిపిస్తే, ఆ పాత్ర కథ పొడుగునా ఇతరపాత్రలతో పరస్పందన సన్నివేశాలు ఉంటే అనువాదం గందరగోళంగా తయారయే అవకాశం ఉంది. He told him to bring him the next day, she asked her to give her the books she had borrowedfrom her లాటి వాక్యాలు కనిపించడానికి అవకాశం ఉంది. ఇలాటి వాక్యాలు తెలుగువారు చేసిన అనువాదాలలో చూసేను. అంచేత అడుగుతున్నాను.

మీరు ఇలాటికథ అనువాదం చేస్తే, ఈ అసందిగ్ధత తొలగించడానికి ఏం చేస్తారు?

 

(మే 10, 2014)

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

5 thoughts on “అనువాదసమస్యలు – తను”

 1. రాచమల్లు రామచంద్రారెడ్డి (రారా) గారు రాసిన “అనువాద సమస్యలు” మీరు చదివే వుంటారనుకుంటున్నాను.

  మీ బ్లాగు తెరపట్టు (background picture)లో ఏవో సమస్యలున్నాయి. నాకు మాత్రమే అది load అవటం లేదో, ఇంకా ఎవరికైనా కూడా ఆ సమస్య వుందో!

  మెచ్చుకోండి

 2. నారాయణస్వామి, రమణమూర్తి, అవునండి, పేరంటూ ఇచ్చివుంటే బాధ లేదు. కానీ తరుచూ కాకపోయినా, కథ అంతా -తను-తోనే నడిపినవి చూసేను నేను. రచయిత అంగీకరిస్తే, పాత్రకి పేరు ఇవ్వాలి, లేదా కథని ఉత్తమపురుషలోకి మార్చినా కొంత మెరుగవుతుంది. కానీ మొత్తం కథ అంతా తను ఉంటే మాత్రం అనువాదానికి ఒదగదనే అనుకుంటున్నాను.
  నారాయణస్వామి కష్టమే అన్నారు కానీ సాధ్యం అనలేదు కదా 🙂

  మెచ్చుకోండి

 3. తను అని నిర్దేశించబడిన పాత్రకి గనక అసలు పేరంటూ ఉంటే, అక్కడక్కడా పేరు చెబుతూ మిగతా he/she తో నడిపించవచ్చు. అసలు పేరే చెప్పకపోతే చాలా కష్టం.

  మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.