ఊసుపోక – వింబుల్డన్ సమయమహో!

(ఎన్నెమ్మకతలు 141)

ఈ ఆటకోసం తెల్లవారుఝామున నాలుగుగంటలకి లేవవలసి వస్తోంది. అంచేత తొమ్మిదయేసరికి నిద్ర ముంచుకొస్తోంది. ఏమిటో, ఆ సూర్యదేవర అంతటి ప్రతిభావంతుడు కదా అన్నిదేశాలలోనూ ఒకేసారి ఎందుకు ఉదయించడో …
మానస మామూలే. మెకెన్రో వ్యాఖ్యానాలు ఒంటిమీద ప్రమాదంలేని పురుగులు పాకినాట్టు – ప్రాణాంతకం కాదు చిరాకు, అంతే.
అలా నస పెట్టడానికి కొన్నివేల డాలర్లిస్తారంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. వాళ్ళకి డబ్బు విలువ తెలీదో, మనకి తెలివి లేదు, గతంలో మ.ఘ.వ. ఆటగాళ్ళే మనకి చెప్పాలనుకుంటారో …

ఈసారి ఆటగాళ్ళు చొక్కాలు చాలావరకూ తెలుపే. అంచేత వారి టోపీలనిబట్టో తలకట్టు పీలికలబట్టో గుర్తించవలసివస్తోంది.
అన్నట్టు ఈ యేడు ఆటల్లో అధికంగా గడసానిలాటి మోడీలు మొగ్గలేయడంలాటివి ఎక్కువే. సాంగాని చెప్పుకోవాలి ఎగిరిగెంతేసి, పడుకుని, కూచుని, పొర్లుతూనూ ఆడే ఆటకి. ఈసారి మెంఫిల్ కూడా అలాటి కసరత్తులు ప్రదర్శించేడుట. నేను మిసయేను 😦
ఇంతకుమునుపు అడిగేను, ఇప్పటికీ ఆ సందేహాలు అలాగే ఉన్నాయి –

రెండు మేడలఎత్తు గాలిలోకి లేచిన బంతిని కిందకొచ్చేవరకూ ఆగకుండా, ఆటగాళ్ళు ఎందుకు ఎగిరి అందుకుని, నెట్టుకేసి కొడతారు? మరో క్షణం ఆగితే తమకి సుఖంగా అందేఎత్తుకి వస్తుంది కదా. మ్.

రెండో ప్రశ్న – సర్వ్ చేయడానికి మూడో నాలుగో బంతులు తీసుకుని, పరీక్షగా చూస్తారు, ఏమిటి వాళ్లు చూస్తున్నది? ఇదెందుకడుగుతున్నానంటే, ఆటకి పనికిరాని బంతులని ఏరిపారేస్తారు కదా.

అన్నట్టు మీకు తెలుసా – టెన్నిస్ బంతులు 1986వరకూ తెల్లగా ఉండేవిట. 1986లో పసుపుపచ్చటి బంతులు ప్రవేశపెట్టేరు. ఎందుకు చెప్తున్నానంటే, ఏమో, టీవీలో వాళ్ళు ప్రచారం చేస్తున్నారు కనక.

ఇదంతా రాస్తుంటే, నాకూ మరొకపెద్దమనిషికీ మధ్య జరిగిన చిన్న సంభాషణ గుర్తొచ్చింది.

ఇదుగో, మీ పఠనానందంకొరకు –
నేను అప్పట్లో చిన్న ఉద్యోగంలో ఉన్నానులెండి. ఆరోజు గబగబ ఇంటికి బయల్దేరేను. ఆ పెద్దమనిషి, “ఏమిటా తొందర? ఎక్కడికి?”
“టెన్నిస్, టెన్నిస్ …అయిపోతోంది. వేగిరం వెళ్ళి చూడాలి …”
“ఓ. సరే. నీ అభిమానఆటగాడు గెలుచుగాక.”
“అది జరగదు.”
“ఎంచేత?”
“నేనెప్పుడూ ఓడిపోతున్నవారి పక్షమే కనక!”

ఉత్సాహం, సందేహాలు గలవారు ఇక్కడ కూిడా చూడగలరు.
(జూన్ 28, 2014)

గ్రంధకర్త మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

7 thoughts on “ఊసుపోక – వింబుల్డన్ సమయమహో!”

 1. మీరే ఇదివరకోసారి అన్నారు తెలుగు రాయడం వచ్చినవాళ్ళు తెలుగులో ఎందుకు రాయరని. దయచేసి, వీలయినంతవరకూ తెలుగులో వ్యాఖ్యలు పెట్టగలరు.

  ఇష్టం

 2. @ బంతి కాకెత్తుకుపోగలదు – హాహా బాగుంది. నేను 60, 70లలో చూడలేదండి. నేను చూడ్డం మొదలెట్టేసరికి, సంప్రాస్ మాంఛి ఊపులో ఉన్నాడు.

  ఇష్టం

 3. బాగుందండి మీ టెనిస్ ఔత్సాహం. తెల్లవారుఝామున నిద్ర లేవాల్సివచ్చినా వింబుల్డన్ వింబుల్డన్నే కదండీ.
  (ఏవిటో, చిన్నప్పట్నుంచి అలవాటైన పద్ధతిలో “టెన్నిస్” అని ఒత్తిచ్చి నోరారా పలికేవాళ్ళం. మీరు సరిచేసిన ప్రకారం ఇహనుంచి “టెనిస్” అని పలుకుతాం).

  1. “రెండు మేడల ఎత్తు” ఎగరేసిన సర్వీస్ బాల్ గురించి మీ సందేహం నేను తీర్చలేనుగాని (బహుశా అలా ఎగిరి కొడితే మంచి ఊపు / పవర్ వస్తుందనే నమ్మకమేమో?), నేను చూసిన ఒక సరదా సంఘటన చెప్తాను. ఆటగాడు అలా బంతిని అంత పైకి ఎగరేసినప్పుడు ఆట చూస్తున్న మా స్నేహితుడు ఒకతను “చాల్లే, బాల్ కాకెత్తుకు పోగలదు” అనేవాడు🙂
  2. టెనిస్ బంతి మీద ఎంత పీచు రేగిందో చూస్తారని అను గారు చెప్పారుగా. అదే క్రికెట్ బంతికి అయితే ఎంత “తాట” రేగిందో, ఎన్ని కుట్లు పైకి లేచాయో పరీక్షిస్తుంటారు (తోలుతో చేసిన బంతి కదా).

  3. టెనిస్ స్టోరీ ఇంకొకటి నేను చదివినది (మీలాంటి tennis aficionado కి తెలిసే ఉంటుంది). ప్రతి సెట్ లోనూ మొదటి గేం అవగానే కొంచెంసేపు విశ్రాంతి ఇస్తారు కదా. మీకు తెలుసుగా జాన్ న్యూకూంబ్ అని ఒక ఆస్ట్రేలియన్ 1960 / 1970 లలో ప్రముఖ ఆటగాడు, వింబుల్డన్ విజేత కూడా (ఇతని మీసాల్ని “హాండిల్ బార్ మీసాలు” అనేవారు కూడా). ఇతను మాత్రం ఈ మొదటి బ్రేక్ తీసుకునేవాడు కాదని, ఆ విరామంలో వెళ్ళి కుర్చీలో కూర్చోకుండా నెట్ దగ్గరే ఉండేవాడని, మరీ మొదటి గేం తర్వాతే బ్రేక్ అంటే That is sissy-like అనేవాడనీ అంటారు. (ఆరోజుల్లో భారతదేశంలో టీవీలు విరివిగా లేవు కాబట్టి మేము తెర పైన చూడలేకపోయాం. స్పోర్ట్స్ జర్నల్స్ లో చదవటమే.)

  4. ““నేనెప్పుడూ ఓడిపోతున్నవారి పక్షమే కనక!””
   అంతే గదండీ. బాగా చెప్పారు. underdogs / challengers ని ప్రోత్సహించడమే భావ్యం.

   సరదా అయిన టపా వ్రాశారు.

  ఇష్టం

 4. అను, హమ్మయ్య, ఇప్పుడు తెలిసింది. ధన్యవాదములు.🙂
  పీచు రేగితే నిర్వాహకులే వెంటనే మార్చేస్తారనుకున్నాను. కొంచెంసేపు వాళ్ళు కూడా తమాషా చూస్తారన్నమాట :p

  ఇష్టం

టపాలో చర్చించిన అంశంమీద వ్యాఖ్యానాలు తెలుగులో రాసిన వ్యాఖ్యలు మాత్రమే అంగీకరింపబడతాయి. తెంగ్లీషులో రాసిన వ్యాఖ్యలు కూడా నాకు సమ్మతం కాదు. కోరుతున్నాను

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / మార్చు )

Connecting to %s