నది

నది

నది ప్రవాహిస్తూ ఉంది
నది ప్రవాహిస్తూ ఉంది
వేయి పడగల ఫణి రాజు
మెలికలు తిరుగుతూ
కుత్సిత ఉత్తేజిత ఊగిసలాట తో
అసాధరణ నాట్య కళాకారిణి
ఆఖరి మిరుమిట్ల ప్రదర్శన వలే
నదీ ప్రవాహం
శోభా మయమైన ఉత్సుకత తో
నది ప్రవహిస్తూ
ప్రవహిస్తూ కదులతుంది
నది ప్రవహిస్తూ
కదులుతూ కూడా ..

అద్భుతాన్ని తేరిపార చూస్తూ ఉంటాను
చీల్చుకుని వెళ్ళే నది
కొండ పై గుహల మూలలు నుండి
ఉన్నతాల పై మండే జ్వాల లా
స్థల ధ్వంస రచన చేస్తూ
పోటెత్తిన గిత్త లా
విరోధి ని మట్టు పెడుతూ
ఆకలి గొన్న సింహం
ఎర పై విసిరిన పంజా లా
ప్రవహిస్తున్న నది
కొండ వాలు ల పై నించి జారుతూ
బండ రాళ్ళ పై తొక్కుతూ
ఒడ్డు గండ్లు పై నించి దొర్లి పోతూ
నిపుణుడైన న గారడి వాడి తాడు పై నడక లా
నది ప్రవహిస్తూ ఉంది

అక్కడ
ఒక్క క్షణమాగి
ఎగ శ్వాస కై తడుముకుంటూ
లేక
సరి చూసుకుంటూ
ఉపేక్ష తో కూడిన స్పర్శా
అశాశ్వత మైన జీవితాలు
చేతనా వస్తువుల కోల్పోయిన ఆత్మలు

వారి ఆశ లు
భయాలు ,వారింపులు
కోపాలు ,లోభిత్వాలు
చిన్న చిన్న అసూయలు
వెర్రి వేలాడ్డాలు
అల్పమైన విషయాలకి
ఇంకా
వేల నీడ ల
ఖాళీ కోరికల తో
ప్రవహించే నది
ప్రవహించే నది
నా మది ని దోచేస్తూ
తన దాష్టిక చేష్ట ల తో
అందె వేసిన నాట్య గత్తె
తన గమనాన్ని తానూ పాటిస్తూ
లేలేత ఆత్మల ని మోసుకుంటూ
తన చేతుల మధ్య
తెలియని తీరాలకి
ఆమె ప్రవహిస్తూ
నేను ఆశ్చర్య పడుతూ
ఆమె ఎరుగునా ఆ వస్తువులు
ఆమె హత్తుకున్న
తన తీయని ఎడద లో
వస్తువు లు
ఆమె పోగు చేస్తున్న
కాలం ,కెరటా ల లో
ఇంకా
వదిలి వేస్తూ
ఆమె కదులుతూ
ఆమె స్పర్శి స్తుందా
లెక్క లేని పిచ్చి వస్తువులు
తన లో బలవంతం గా దాచుకుంటూ
కాగితపు పడవలు
విరిగి పోయిన హృదయాలు
పూల గుత్తులు
పవిత్రమైన మునకలు
నది ఒడ్డున గవ్వలు
మానవ వృధాలు
లాలా జాలాలు
చచ్చి పడిన శరీరాలు
నాచు
మోటార్ బోట్లు
ఆమె పేగులు మెలిపెడుతూ
మొసళ్ళు మెండు గా పీక్కుంటూ
సగం శిధిల మైన శరీరాలు
చిన్న చేపలు
తమ మనుగడ కోసం జగడిస్తూ
నది ప్రవహిస్తూ
నది ప్రవహిస్తూ
రాజసం ఒలికించే తిరస్కారంతో కదులుతూ
అల్పమైన కట్టడాలు
మానవుడు నిర్మించినవి
స్టీల్ తో గుచ్చుతూ
కాంక్రీట్ పోస్తూ
పవిత్ర జలాలని భ్రష్టు పరుస్తూ
తన ఆఖరి ప్రయత్నం అరికట్టాడానికి
తన అజేయమైన జలాలు తో
నది ప్రవహిస్తూ
తన గమనాన్ని తానే అనుసరిస్తూ
వారి పొగరు చూసి క్రోధు రాలై
ఆ నది
పిగిలి పోతుంది
బహు సుందరం గా వెళ్ల కక్కుతుంది
ఆగ్రహాన్నిపగల గొడుతూ
ఆనకట్టలు ,వారధులు
ఇంకా వారి నివాసాలు
ఒక్క శుభ్ర మైన ఊడ్పు లో
ఎలా అంటే
నేల ని తయారు చేస్తున్నట్టు
కొత్త లోక పునర్ నిర్మాణం కోసం
రెచ్చగొడుతున్నట్టు
వారి లోపాలని
నిరూపిస్తున్నట్టు
తన సొంత బలాన్న
అందాన్ని
ఇంకా నిబద్ధతని
ఎలా అంటే
తీక్ష్ణ మైన బ్రహ్మాండ నర్తింపు లా
ఆ నటరాజు ది
నేను ఆ ఒడ్డున కూర్చుంటాను
విస్మయ పడుతూ
ఆమె కి ఎరుకేనా ఈ బంధం
అంతు బట్టని అగాదం అనిపించే ప్రవాహం లో
ఇంకా ఒడ్డున ఉన్న ఆ జటిలమైన జీవితాలు ?
మానవ సమూహాలు
సంపూర్ణం
తల్లులూ కూతుళ్ళూ
తండ్రులూ కొడుకులూ
కలుషిత మై
రాజకీయాలు అధికారం
ఇంకా ధనమూ
విద్యుత్ కాంతులు
పరివేష్టించి న
నీచ జీవితాలు
మరియు
ఎక్కడ
విద్వత్తు నశించిందో
మానవ యోగ్యత
ఇంకా ఒక వ్యాపార సరుకు గా మారిందో
తగ్గింపు ధర ల లో
అమ్ముకుంటారొ
ఆమె మృదువుగా
ప్రవహిస్తుంది
రాజస మైన సరళి లో
వైఫల్యాలు తనని తాకక
మానవ జాతివి
నేను ఇంకా అక్కడ కూర్చుంటాను
వింటూ ఉంటాను
సవ్వడి లాంటి
లక్షల చిన్ని తరంగాలు
ఒడ్డున రాళ్ళ ల ని బలం గా తాకుతూ
శ్రావ్యమైన ధ్వనులని
నేను సంభ్రమ పడుతూ
ఆమె ఎవరో
ఎరగని అణకువ గల
విడి వడి , నిష్పక్షపాతమై
అనుసరించాలి అనే కోరిక తో
తన దారిన తను
నది మైదానం లోకి ప్రవేశించింది
మహనీయమైన గమనం తో
వేద మంత్రాల ని పారాయణం చేస్తూ
కుంగిన ఆశలని ఉత్సాహ పరుస్తూ
నిస్తేజితులైన జీవాలని పరిరంభణం చేస్తూ
విశ్వ సమన్వయం కి తెర లేపుతూ
అలా ప్రవహిస్తూ ఆమె
రక రకాల ఆత్మ ల ని స్పర్శిస్తూ
వేల ఎడద ల ని వెలిగిస్తూ
హరివిల్లు రంగులు వెద జల్లతూ
ఆమె ఔదార్య హృది ని హత్తుకుంటూ
దట్టమైన మబ్బుల వేపు
నది ప్రవహిస్తూ ఉంటుంది
హుందాగా
తన ప్రకాశం లో తానే చలి కాచుకుంటూ
లయ బద్ధమైన
స్వర గుసగుసలు తో
నది ప్రవహిస్తూ
ఆ నది
వయోరహిత నాట్య కారిణి లా నర్తిస్తూ
శతాబ్దాల జ్ఞానాన్ని పంచుతూ
దేవ సైనుకుడి తేజస్సు తో
సామ్రాజ్ఞి చుట్టు ఉండే దివ్య తేజస్సు తో
నది ప్రవహిస్తూ
ఆ నది
మరియు ఆ జీవం
మెలివేసుకుని
చిక్క నైన బంధం లో
ఒక్కొక్కటి
స్వాభావిక భాగమై
మరొక దాని లో .
నది ప్రవహిస్తూ ఉంటుంది
ఇంకా
ఆ నది ప్రవహిస్తూ ఉంటే
జీవితమూ కొనసాగుతూ ఉంటుంది ..

( మూలం RIVER FLOWS,  3/3/98,  ఇక్కడ చూడవచ్చు.)

అనువాదం వసంత లక్ష్మి .

జున్‌ నెల విహంగ లో ప్రచురింప బడింది.

 

(6 జులై 3014)

గ్రంధకర్త మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

2 thoughts on “నది”

  1. బాగుందండీ!భూపెన్ హాజారికా రచించిన
    గంగా తూ బహతీహై క్యౌ-గుర్తుకు తెచ్చింది

    ఇష్టం

టపాలో చర్చించిన అంశంమీద వ్యాఖ్యానాలు తెలుగులో రాసిన వ్యాఖ్యలు మాత్రమే అంగీకరింపబడతాయి. తెంగ్లీషులో రాసిన వ్యాఖ్యలు కూడా నాకు సమ్మతం కాదు. కోరుతున్నాను

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / మార్చు )

Connecting to %s