వెనకటి నేను 5 – ఆర్చేవారూ ఓదార్చేవారూ (వ్యంగ్యరచన)

మార్చి 6, 1959లో వనితాలోకం శీర్షకలో ఆంధ్రపత్రిక, వారపత్రికలో ప్రచురించిన వ్యాసం.

ఆరోజుల్లో ఎప్పటికేది తోస్తే అదే రాసి పారేయడం అక్షరాలా, పత్రికలవారు వెంటనే ప్రచురించేయడం జరిగేది కనక ఈ వ్యాసం మరేమీ తోచక హాస్యానికి రాసిందే. మరే దురుద్దేశమూ లేదు. ‘ఆరుస్తావా తీరుస్తావా అక్కరకొస్తే మొక్కుతావా’ అన్న జాతీయందృష్టిలో పెట్టుకుని రాయడం జరిగింది కానీ, ఆ మూడో భాగం – అక్కరకొస్తే మొక్కుతావా – అన్నది ఎలా అర్థం చేసుకోవాలో తెలియడం లేదు ఇప్పటికీ. మీలో ఎవరికైనా తెలిస్తే చెప్పమని కోరుతున్నాను.

దీనిమీద వచ్చిన వ్యాఖ్యలు కూడా జత పరుస్తున్నాను. ఇందులో ముఖ్యంగా నేను వాడిన ఇంగ్లీషుపదాలగురించి వచ్చిన వ్యాఖ్యానం నాకు అప్పట్లో అంతగా హత్తకపోవడం గమనార్హం!

వ్యాసానికి లింకు – Arche vaaru2

వ్యాఖ్యలకి లింకు – Arche vaaru comments


(డిసెంబరు 10, 2014)

 

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

4 thoughts on “వెనకటి నేను 5 – ఆర్చేవారూ ఓదార్చేవారూ (వ్యంగ్యరచన)”

 1. మల్లాది వెంకట కృష్ణమూర్తి నవలలు నేను చదవలేదు కానీ ఎక్కువ వంటింటి చిట్కాలే ఎక్కువ. అందుకే నేను మరో అంశం తీసుకున్నాను. @ వకుళమాల – అవునండీ నాక్కూడా చాలా ఇష్టమైన పేరు.

  మెచ్చుకోండి

 2. అంటే ఆ రోజుల్లో వనితాలోకం శీర్షికలో మల్లాది వెంకట కృష్ణమూర్తి నవలల్లో దట్టించే వంటింటి చిట్కాల్లాంటి పనికొచ్చే సమాచారమే రాస్తుండే వారు కాబోలు!! వకుళమాల కలంపేరు చాలా బావుంది. అప్పటికీ ఇప్పటికీ మీ వచనం పదును మాత్రం అలాగే ఉంది!

  మెచ్చుకోండి

 3. నరసింహారావుగారూ, భలే పట్టుకున్నారండి. నేను గమనించనే లేదు భానుమతిగారికథ ఆవిడకి నచ్చడం. అందుకే పెట్టేనండీ వ్యాఖ్యలు కూడా. ఆనాటికీ ఈనాటికీ నూటికి 90 శాతం ఏదో ఒకటి రాయాలని రాసేయడమే కానీ ఆలోచించి రాయరు.
  ఆంగ్లపదాలు – కూడా మీరన్నమాట నిజమే. కొన్నిసందర్భాల్లో ఇంగ్లీషుమాటలు హాస్యరసస్ఫోరకంగా ఉంటాయి. నిజానికి ఈ విధమైన ప్రయోగాన్ని చక్కగా వాడుకున్నది రావిశాస్త్రిగారే కదా. ఆయనకథలప్రభావం :).
  ఎర్రగీతలు – పిడియఫ్ లో సౌకర్యంలెండి. కావాలన్నా వంకరలు రావు. అయినా పంతులు ఉద్యోగం చేసేను ఆమాత్రం ఎర్రగీతలు పెట్టడం రాకపోతే ఎలా. హా.

  మెచ్చుకోండి

 4. బాగుందండీ “ఆర్చేవారు ఓదార్చేవారూ” కాలక్షేప వ్యాసం. మీరన్నట్లు వ్యంగ్య రచనే.

  జనాల్లో వాడుకలోనే వున్న ఆంగ్లపదాలు కూడా రాకుండా వ్రాయటం కుదరదేమో? కుదిరినా కృతకంగా వుంటుందేమో? అయినా మీ వ్యాసంలో ఆంగ్లపదాలు అంత ఎక్కువ లేవే. మీరు వాడిన కొన్ని ఆంగ్లపదాలకి అక్కడే తెలుగులో అర్ధం కూడా మీరు చెప్పారు కదా (“ది గుడ్ సమరిటన్” లాంటివి). ఇక కొన్ని పదాలు సామాన్య జనంలో కూడా – అప్పటికీ ఇప్పటికీ – వాడుకలో ఉన్నవే అనుకుంటాను (ఏదో “డెడ్ ఎండ్”, “సొల్యూషన్” లాంటివి తప్ప). అయినా మీ వ్యాసం మీద వచ్చిన కొన్ని వ్యాఖ్యలలో కొంతమంది చాలా బాధపడిపోయారు.

  కొన్ని వ్యాఖ్యలు చదవటానికి మహా సరదాగా ఉన్నాయి. ఉదాహరణకి:-
  (మిసెస్ మూర్తి, బందరు) :- “ఎవరైనా ఏదైనా వ్యాసము వ్రాశారంటే దానివలన కొంత కాకపోతే కొంతైనా ఉపయోగము వుంటేనే దాని అందము వ్రాసినవారి ఆశయము ఫలిస్తుంది.”
  ఈ పాఠకురాలే తర్వాతి పేరాలో “భానుమతి రామకృష్ణ గారు వ్రాసిన అత్తగారూ జపాను యాత్ర చాలా సరదాగా వున్నది” అన్నారు.
  భానుమతి గారి వ్యాసం ఈవిడకి ఏరకంగా ఉపయోగమనిపించిందో? భానుమతి గారు వ్రాసారు కాబట్టి బాగుందనిపించిందేమో? ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి గాని, రెండు వ్యాసాలూ కాలక్షేపం వ్యాసాలే కదా. ఏదో విమర్శించాలని విమర్శించటం అనుకుంటాను.

  “ఈ వ్యాసము వ్రాసినవారు సోదరి కాదని సోదరుడే అయ్యుంటాడని నా అనుమానము.” (మిసెస్ మూర్తి, బందరు). హా హ్హ హ్హ. వ్యాసం చదివితేనే ఆవిడకలా ఎందుకనిపించిందో?

  వ్యాఖ్యాతలందరిలోనూ “కె.రామారావు, విశాఖపట్టణం” గారు వ్యాసం ఉద్దేశ్యాన్ని సరిగ్గా అర్ధం చేసుకున్నారు.

  మీరు ఎర్రసిరా గీతలు వంకర పోకుండా చాలా ఓపికగా నేర్పుగా కొట్టినట్లున్నారు.

  మొత్తానికి మీ “వెనకటి నేను” శీర్షికతో అప్పటి రోజుల్ని గుర్తు చేస్తున్నారు.

  మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.