వెనకటి నేను 8 – శ్రోతలు కోరని పాటలు

శోతలు కోరని పాటలు – మీరు కోరని పాటలే (లేదా పాట్లే). ఇంక చెప్పడానికేం ఉంది :p

శారదా పత్రిక (అనంతపురం)లో ప్రచురింపబడింది, సెప్టెంబరు 1971లో.

గ్రంధకర్త మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

6 thoughts on “వెనకటి నేను 8 – శ్రోతలు కోరని పాటలు”

 1. యం.వి. రమణారావుగారూ, తైలం అన్న వాడకం నాకు గుర్తుంది కానీ గీతంకి విస్తృతార్థం ఇప్పుడే వింటున్నాను. ధన్యవాదాలు.

  ఇష్టం

 2. జీతంకన్నా గీతం ఎక్కువ అనడం ఎప్పటినుంచో ఉంది.అల్లు రామలింగయ్య ప్రయోగం ”ఆమ్మ్యామ్య ”కూడా తెలిసిందే.అంతకుముందు రేలంగి వాడిన ‘ తైలం ‘(అంటే డబ్బు,లేక లంచం ‘ అనే అర్థంలో) బాగా ప్రచారంలో ఉండింది.

  ఇష్టం

 3. ఆహా, అలాగా. నాకు తెలీదండి ఆ గీతం అర్థం. మీరు చెప్పేవరకూ ఆ జోకు కూడా అర్థం కాలేదు. మీ వివరణకి సంతోషం. ఆ పత్రిక అట్టేకాలం నిలవలేదులెండి. రంగులు – బాగుంది. చూదాం ఏ క్షణానికి ఏ రంగు నాదృష్టినాకట్టుకుంటుందో.🙂

  ఇష్టం

 4. అబ్బే రంగు గురించి అదేం లేదండి. నీలం రంగు నా వ్యక్తిగతంగా నాకు నచ్చే రంగు అంతే (But thanks anyway). మీరు ఎంచుకున్న కొత్తరంగు చాలా ఆహ్లాదంగాను, క్లాసీ గానూ ఉంది, మీ బ్లాగు పేజ్ ని అందంగా చూపిస్తోంది.

  మీకు గుర్తుండే వుంటుంది – “అ(న)ర్ధకోశం” లో “గీతం” అనే పదం క్రింద ఇచ్చిన “ఆమ్యామ్యా” అనే మాట “లంచం” అనే మాటకి పర్యాయపదంగా ఓ సినిమాలో మొదలయింది. ఆ సినిమా 1970 దశాబ్దంలో వచ్చింది. దాన్ని బాట్టి మీ వ్యాసం రచనాకాలం 70 వ దశకం అని ఆల్రెడీ అంచనా వేసేసుకున్నాను (పత్రిక పేరు మీరు చెప్పేంతవరకు తెలియకపోయినా).
  (ఆ రోజుల్లోనే “గీతం” అనే మాటని కూడా వ్యంగ్యంగా అన్నప్పుడు “లంచం” అనే అర్ధంలో వాడేవారు అని కూడా మీకు గుర్తుండే వుంటుంది. ఓ ఉద్యోగి లంచగొండి అని సూచించడానికి “వాడికి జీతం కన్నా గీతం హెచ్చు” అనేవారు ఇండైరెక్టుగా.)

  ఇష్టం

 5. నరసింహారావుగారూ, హడావుడిగా పెట్టేసాను, కామధేను అని తిరుపతిలో పులికంటి కృష్ణారెడ్డిగారు ప్రారంభించిన పత్రికలో వచ్చింది. అలగే చెప్పడం మరిచిన మరో సంగతి అనర్థకోశం నాది కాదు. కానీ నిర్వచనం బాగుంది. అలాటివి దొరుకుతాయి కనుకనే నాకు ఈ స్కాన్ చేసి పెట్టడం బాగుంది.
  రంగు, మ్. సరేనండి. మళ్ళీ మార్చినప్పుడు నీలంరంగు గుర్తు పెట్టుకుంటాను.🙂

  ఇష్టం

 6. “శ్రోతలు కోరని పాటలు”🙂 హ హ్హ హ్హ బాగుంది. వ్యాఖ్యలు లేవా? ఈ వ్యాసం ఏ పత్రికలో ఏ రోజున వచ్చిందో కట్ అయినట్లుంది.

  అలాగే, మీ వ్యాసం పక్క కాలంలో “అ(న)ర్ధ కోశం” లో ఇచ్చిన “గీతం” నిర్వచనం మా గొప్పగా వుంది.

  అన్నట్లు మీ బ్లాగ్ లేఅవుట్ మార్చినట్లున్నారు. కొత్తగా కనిపిస్తూ బాగుంది. కాని రంగు మాత్రం నా మట్టుకు మునుపటి నీలం రంగే నచ్చింది సుమండీ🙂

  ఇష్టం

టపాలో చర్చించిన అంశంమీద వ్యాఖ్యానాలు తెలుగులో రాసిన వ్యాఖ్యలు మాత్రమే అంగీకరింపబడతాయి. తెంగ్లీషులో రాసిన వ్యాఖ్యలు కూడా నాకు సమ్మతం కాదు. కోరుతున్నాను

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / మార్చు )

Connecting to %s