ఊసుపోక 148 – నా నామవృత్తాంతము

నిన్న ఆప్తులొకరు “మీ కథ చెప్పండి” అని నన్నడిగేరు. కథమాటకేం గానీ, పేరుమీద చిన్న కథ తగిలింది నిన్న – ఆ వృత్తాంతము ఎట్టిదనిన –

ఆ ఆప్తునితో ఆడుకున్న కబుర్లగురించి ఆలోచిస్తూ, నా మామూలు వీధిసంచారానికి బయల్దేరేను. నాకయితే ఆ పొదరింటిపక్కన పోతూంటే గుప్పున సువాసనలు విరజిమ్మి నాలుగు క్షణాలు అట్టే నిలబెట్టున్నట్టు ఉంటుంది. మొదట్లో నేనేదో కలగంటున్నాననుకున్నాను కూడా. “మల్లియలార మీపొదలమాటున లేడుగదమ్మ” అన్న పద్యపాదంలాటివి నాకు గుర్తొస్తాయంటే, లలిత గూడ “గాలిని గౌరవింతుము సుగంధము పూసి; సమాశ్రయించు భృంగాలకు విందు చేసెదము కమ్మని తేనెలు; మిమ్ము బోంట్ల నేత్రాలకు హాయిగూర్తుము;” పాడుకుంటానంటున్నారు లలిత గూడ. ప్రకృతిసిద్ధంగా తయారయిన ఈ పుష్పగుచ్ఛాలు జాలిగా బావురుమనడం లేదు. “దుశ్శాలువలూ, పలకలూ లేవు, సుగంధాలతో కూర్చిన మలయమారుతం”తో సత్కరిస్తున్నాం, ఒక్క క్షణం ఆగు” అంటున్నాయి సుతారంగా తలలు వాల్చి, బరువెక్కిన కనులతో. నాకు అవతల కొంపలంటుకుపోయే రాచకార్యాలేమీ లేవని ఈ సుమసంతతికి కూడా తెలిసిపోయింది.

హనీసక్ల్

రోజూ గమనిస్తూనే ఉన్నా, రోజూ ఆ పొదరిళ్ళదగ్గర ఆగుతూనే ఉన్నా నిన్న మాత్రం ఎందుకో ఓ బొమ్మ తియ్యాలనిపించింది. తీసి ఇంటికొచ్చేక పదిమందితో పంచుకోవాలనిపించింది. ఆ బొమ్మలో పువ్వులంత విస్తృతంగానూ యఫ్బీ మిత్రులు నాముంగిటికొచ్చేసి బోలెడు ఆమోదముద్రలిచ్చేసి, బోలెడు సంగతులు – తెలిసినవీ, తెలియనివీ – చెప్పేరు.

పేరుమాట – honey suckle, star jasmine అని ప్రసిద్ధనామధేయాలుట. ఇంకా విరజాజి, నిత్యమల్లెపూలు, పారిజాతాలూ, పొగడపూలు వంటి పేర్లు సూచించారు. ఏమో మరి కొందరలా అంటారేమో.

ఇంతకీ నా జన్మవృత్తాంతం కదూ మొదలుపెట్టింది.

తమిరిశ జానకి గారు ఈ పువ్వులపేరు “మీ పేరే” అంటారంటున్నారు! ఆహా! ఇంతకాలానికి రెండోసారి నాపేరు గల పుష్పరాజములు చూడగలగితి అనుకుంటూ ఉప్పొంగిపోయేను. ఇంతకుపూర్వం పి. సత్యవతిగారు మాలతి పుష్పాలివిగో అంటూ ఒక బొమ్మ పంపేరు. ఇప్పుడు జానకిగారి మాటలను బట్టి అది గిన్నెమాలతి అని అర్థం చేసుకుంటున్నాను.

నాకు ఈపేరు పెట్టడం ఎలా జరిగిందంటే –

మానాన్నగారు ఒక అత్తయ్యగారు కవలపిల్లలు. నేను పుట్టిన శుభదినానికి కాస్త ముందుగా కాబోలు ఆవిడ దివంగతులయేరు. అందులో నాప్రమేయం ఏమీ లేదని గ్రహించగలరు. కాకతాళీయంగా జరిగిందనుకుంటే అందరికీ మనశ్శాంతి. ఇంతకీ ఆవిడపేరు నాకు పెట్టాలనుకున్నారో, పెట్టేరో అలాటిదేదో జరిగింది. అలా పేర్లు పెట్టుకున్నప్పుడు, వేరే పేరు నిత్యవాడుకలోకి వస్తుంది. ఆరోజుల్లో మాయింటిముందు మాలతి లత ఉండేది, అంచేత మాలతి అని పిలుద్దాం అని మానాన్నగారు నిర్ణయించేరుట. హా. హా. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంటే ఇదేనేమో అనుకుంటున్నాను నేను. మీరేమంటారు -:p

శివరామకృష్ణారావు గారు సంపాదించి అందించిన వివరాలు ఇవి – ఇది మల్లె జాతికి చెందిన ట్రాకిలోస్పెర్మమ్ జాస్మినాయిడిస్ అనే చెట్టు/తీగలా ప్రాకే పొద కావచ్చును. ఇవి చైనా కు చెందినవి అయినా, అమెరికా, యూరప్ దేశాల్లో కూడా బాగా కనిపిస్తుంది. దీని గురించిన వివరణ క్రింద-నేను వెబ్ లో సంపాదించినది ఏమిటంటే:

Common name: Confederate jasmine, Star jasmine
Botanical name: Trachelospermum jasminoides Family: Apocynaceae (oleander family)

This beautiful and energetic evergreen vine creates a special scene all through the year as clambers 40 ft up tree trunks using its holdfast roots to pull itself almost to the top. During April and May the plant goes two-tone as it flushes light green with new growth. Shortly thereafter the scene transforms again when the delicate 1 in white pinwheel flowers delicately breathe enchanting fragrances into the spring air. Confederate jasmine grows as a neat tangle of slender wiry stems that exude white latex when cut. These are covered with thick glossy evergreen leaves that are 2 in long, oval shaped, and pointed at both ends. The stems will twine and clamber over supports and cling to walls and hard surfaces with great ease and abandon. It should be noted that Confederate jasmine is not a “true” jasmine. Confederate jasmine comes from China, but has been a popular garden plant in Europe and the U.S. for centuries.

అమ్మో, ఎంత కథ ఉందో “ఈ మాలతి”కి అనిపించడం లేదూ మీక్కూడా!

(మే 1, 2015)

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

3 thoughts on “ఊసుపోక 148 – నా నామవృత్తాంతము”

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు, తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరింపబడును.

Please log in using one of these methods to post your comment:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s