ఊసుపోక 151 – Facebook మంచీ చెడూ

ఎవరో అడగగా రాసిన ఈ టపా పత్రికలో రాలేదు కానీ ఫేస్బుక్కులో చాలామందిని ఆకర్షించింది. అంచేత, ఫేస్బుక్ సభ్యులు కానివారికి కూడా నా అనుభవాలు తెలియజేయడంకోసం ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను.

ఫేస్బుక్ కూడా చురకత్తిలాటిదే. కూర తరుక్కోడానికా గొంతు కోసుకోడానికా అన్నది మనకే తెలియాలి. నేను ఫేస్బుక్‌లో చేరేక నా బ్లాగు తెలుగు తూలికగురించి ఎక్కువమంది పాఠకులకి తెలిసింది. ఫేస్బుక్కులో మేలుబంతి పండితులు, చదువరులు పరిచయమయేరు. వారివల్ల కొత్త విషయాలు తెలుసుకోగలుగుతున్నాను.

నాకు కావలసింది నారచనలు నచ్చినవారితో స్నేహమే కానీ వ్యక్తిగత స్నేహాలు కాదు. అలాగే నేను చూసే పేజీలు కూడా నాకు అర్థమయినంతవరకే.

ఇక్కడ కూడా అవాంఛనీయ, విపరీత ధోరణులున్నాయి. వాటిని దాటుకోవలసింది మనమే. settingsలో tagging పరిమితం చేసేను. నాధోరణి నచ్చనివారికి నా పేజీకి రావద్దని చెప్పేను. మహిళలకి గానీ మరొకరికి గానీ నేను చెప్పగలిగింది ఇంతే – లేైకులకోసం కాక మీఅభిరుచికి తగిన పేజీలు మాత్రమే చూసుకోండి. మీరచనలను ఆస్వాదించేవారిని మాత్రమే మీ పేజీకి పిలవండి.

మరొక లాభం – నేను చాలా కాలంగా వినడం మానేసిన సంగీతం అక్కడ పోస్టులమూలంగా మళ్ళీ వింటున్నాను.

 

(మే 20, 2015)

గ్రంధకర్త మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

4 thoughts on “ఊసుపోక 151 – Facebook మంచీ చెడూ”

  1. హనుమంతరావుగారూ, మీకు ఇది నచ్చినందుకు సంతోషంగా ఉంది. మీరు ఇటీవల జ్యోతి వలబోజు ప్రచురించిన వ్యాసం, సాక్షిలో అనుకుంటాను, చూసే ఉంటారు. ఆవిడ నన్న రాయమని అడిగితే రాసిన వ్యాసం ఇది. మరి ఏ కారణంచేత ఆవిడకి అంగీకారం కాలేదో నాకు తెలీదు. హుమ్.
    ఆ తరవాత ఫేస్బుక్కులో నా పేజీలోనే పోస్ట్ చేస్తే, మీలాగే అనేకమంది పాఠకులు సుముఖంగా స్పందించేరు.

    ఇష్టం

  2. ‘ఫేస్ బుక్’ అనే ఆయుధాన్ని ఎలా ఉపయోగించుకోవాలో మీలాంటి విజ్ఞులను చూసైనా నేర్చుకోవాలి మేమంతా! చాలా సూటిగా తేటగా చెప్పారు మాలతి మ్యాడంగారూ!

    ఇష్టం

  3. సంతోషం లక్ష్మీ రాఘవగారూ, మీ అభిప్రాయానికి. మీలాటి పాఠకులు పదిమంది ఉన్నా చాలు నాకు🙂

    ఇష్టం

  4. “నాకు కావలసింది నారచనలు నచ్చినవారితో స్నేహమే కానీ వ్యక్తిగత స్నేహాలు కాదు. అలాగే నేను చూసే పేజీలు కూడా నాకు అర్థమయినంతవరకే.” Ila andaroo cheppaleru…naaku nachchindi adenandi…

    ఇష్టం

టపాలో చర్చించిన అంశంమీద వ్యాఖ్యానాలు తెలుగులో రాసిన వ్యాఖ్యలు మాత్రమే అంగీకరింపబడతాయి. తెంగ్లీషులో రాసిన వ్యాఖ్యలు కూడా నాకు సమ్మతం కాదు. కోరుతున్నాను

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / మార్చు )

Connecting to %s