ఊసుపోక 153 – పిన్నలమాటలలో – “నేనెందుకు రాస్తున్నానంటే …”

సుప్రసిద్ధ రచయితలు తామెందుకు రాస్తున్నారో చెప్పడం విన్నాం. ఇటీవల రాయడం మొదలు పెట్టినవారు ఎందుకు రాస్తున్నారు అని నేను ఫేస్బుక్కులో అడిగితే, వచ్చిన జవాబులలో వైవిధ్యం నన్ను ఆకట్టుకుంది.

ఇక్కడ టపాలు అక్కడ పెట్టడం సాదారణం. ఇది అట్నుంచి ఇటు పెడుతున్నా.

నేనెందుకు రాస్తున్నాను అన్నవిషయంలో పేరు గన్న రచయితలు చాలామంది తమ అనుభవాలు వివరించారు.
నిన్నా ఇవాళా కొత్తగా రాస్తున్నవారు చెప్పిన కారణాలు ఆనందదాయకం.
నోటితో చెప్తే కొత్త సమస్యలు వస్తాయేమేనని
రాయడానికి రచయితే కానఖ్ఖర్లేదనుకుని
రాయాలనిపించి
రచయిత కావాలని
అనిపించుకోవాలని
నాకోసం
మరిచిపోవడానికి
రాయడం ఇష్టం కనక
పిల్లలకోసం, తెలుగుభాషకోసం
ఫేస్బుక్ లో (బ్లాగులో కూడా) ఏదో రాయాలని
ఏం రాస్తే ఎవరు ఎలా స్పందిస్తారో తెలుసుకోడానికి
అంటున్నారు.
ఇంకా
మనసులో మాట మరొకరితో పంచుకోడానికి
గుర్తు పెట్టుకోడానికి
సమస్యలకి సమాధానాలు వెతుక్కోడానికి
వెనక తోబుట్టువులతో, వేడుక చెలులతో చెప్పుకునేవి ఇప్పుడు కాయితంమీద, జాలంలో.
రాయలేక ఆగిపోయినవారు ఎందుకు రాయలేకపోతున్నారో చూసుకోడానికి రాయవచ్చు.
కాయితంమీద పెట్టలేనివారు మనసులో చూసుకోవచ్చు.
ఈనాడు రచయితకి నిర్వచనం ఇది.

మీరు కూడా ఈ ప్రశ్నకి జవాబులు రాయండి వ్యాఖ్యపెట్టెలో. మీవ్యాఖ్యలు వస్తువుకే పరిమితం చేయండి.

 

(జులై 11, 2015)

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.