పిల్లా సల్లగున్నవా? (కవిత)

ఒక వయసు దాటినతరవాత జీవితం నిస్సారం, నిరర్థకం, వారు అందుకు విచారిస్తున్నారు, యువకులు వారిని చూసి జాలి పడాలి – అన్నభావం ఈమధ్య చాలా చూస్తున్నాను. అంతర్జాలంలో క్రియాశీలకంగా ఉన్నవారు కూడా అలాటి రచనలే చేయడం నాకు ఆశ్చర్యంగా ఉంది.

నాకు ఈ అభిప్రాయం అంగీకారయోగ్యంగా కనిపించదు. నాబొమ్మకి నేను రాసిన మొదటి బాగంలో చెప్పడానికి ప్రయత్నించింది అదే.

మీస్పందనలకి అనుగుణంగా కవిత రాసి పంపితే, ఇక్కడ ప్రచురించగలను. మీరు వ్యాఖ్యలో పెడితే, నేను తీసి, ఈపేజీలో చేరుస్తాను.

DSC02277

  1. ఒకవంక

నునుపు దేరిన శిలలను చీల్చుకు లేచిన కొమ్మ

పదో పాతికో హేమంతాలూ గ్రీష్మాలూ గడించిన అనుభవంతో

నరాలు పట్టు తప్పి ఈచవోయినవేళ

మీరిన మక్కువతో నిదానంగా ఒంగి

ఆపూట వికసించిన పూలబాలలని పలకరించు సౌరు!!

మరోవంక

చెవులు దోరగించి ముఖమంతా కళ్ళు చేసుకు

కతలు వింటూ

అమందానందంలో ఓలలాడుతున్న పూలబాలలు!!

మరి ఆయమ్మ ఏమి కతలు చెపుతున్నదో!

———–

 ఒరుగు కట్టె!

అనేకానేక గ్రీష్మాలూ తుఫానులూ

చూసిన అలుపుతో, చికిలించిన కనులతో

నిన్న చివుర్చిన రేపటిపౌరులమీదికి ఒరిగి

ఊసులాడుతోంది వాడి ఒరుగైన కట్టె.

మాపటేల మరోతల్లి

ఆ ఒరుగుతోనే బువ్వొండి

పిల్లలకి పెడుతుంది.

ఆకట్టెబతుక్కి అదేనేమో పరమార్థం?!

—————————-

నా విన్నపం మన్నంచి నూతక్కి రాఘవేంద్రరావుగారు రచించిన కవిత

“ఏంది పిల్లా సంబడాలుపోతుండావ్ !

ఎకసక్కాలేక్కువాయే….

సౌరభాలు వేదజజల్లె వయసునీది కాదనలే……

ముదిమిమీరి నడుమువంగి ఎండి వాడి యీ తీరున ….

మ్రోడునై పడివుంటిని……

నవ్వులాటలేలనే …

నావయసున నేనూ సోగాసులాడినే పిల్లా ….

ఇంతలావు బడాయి నేనప్పుడు పోలా.

రచన: నూతక్కిరాఘవేంద్రరావు. ఏందీవంగి నిలబడిన తీగమ్రోడు ఆధారంగా..

ఆగస్ట్ 9, 2015.

————

 

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s