తెలుగు వికిపీడియా

తెలుగు వికిపీడియాగురించి చాలామందికి తెలిసే ఉంటుంది. తెలీకపోతే చూడండి. లింకు ఇక్కడ

గత రెండు రోజులలో తెలుగు వికిపీడియా కార్యకర్తలలో ఒకరైన వెంకటరమణగారు తాము సృష్టించిన ఒక పేజీవిషయంలో నన్ను సంప్రదిస్తున్నసందర్భంలో వారి క్రియాశీలత, శ్రద్ధ మరొకమారు నాకు ప్రస్ఫుటమయింది.

మన దేశంలో అసంఖ్యాకమైన తెలుగు కవులు,రచయితలు,విమర్శకులు,సాహితీకారులు, విజ్ఞాన శాస్త్రవేత్తలు,కళాకారులు,స్వాతంత్ర్య సమరయోధులు ఇంకా అనేక రంగాలలో విశేష కృషిచేసినవారున్నారు. వారి రచనలను, వారందించిన సేవలను మనం వినియోగిస్తున్నాం. వారి సేవలు చిరస్తాయిగా నిలిచినపుడు అటువంటి వారి జీవిత చరిత్రలను భవిష్యత్ తరాలవారు తెలుసుకొనే అవసరం ఉంది. వారి చరిత్రలను బ్రతికించాలనే కాలగర్భంలో కలసిపోయిన ప్రసిద్ధ వ్యక్తుల జీవిత చరిత్రలను తెవికీలో చేర్చే ప్రయత్నం చేస్తున్నాము. తెవికీలో లేని ప్రసిద్ధ సాహితీకారుల చరిత్రలను చేర్చి సహకరించండి.

ఇది ఈనాటి వాస్తవం. మీకు తెలిసినవారిగురించి తెవికిలో చేర్చండి. మీరు మొదట చేయవలసింది

  1. తెవికీ వెతుకుపెట్టెలో చూడండి మీరనుకుంటున్న వ్యక్తికి సంబంధించిన పేజీ ఉందో లేదో. ఉంటే, మీకు అధికంగా తెలిసిన వివరాలు – ఆపేజీలో లేనివి – ఉంటే చెప్పండి.
  2. మీరిచ్చే సమాచారం ఖచ్చితంగా విషయసంబంధి అయి ఉండాలి. “వారిని నాకు తెలుసు, మాపక్కింట్లో ఉండేవారు” వంటివి సూచించకండి.
  3. అక్కడ మీరనుకున్నవారి పేరు లేకపోతే, ఏ సమాచారం ఇవ్వాలో, ఎలా ఇవ్వాలో వంటివి సహాయం పేజీలో చూడండి.

మరొకసారి http://te.wikipedia.org కార్యకర్తలకు కృతజ్ఞతాభివాదములతో

మాలతి

 

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

One thought on “తెలుగు వికిపీడియా”

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు, తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరింపబడును.

Please log in using one of these methods to post your comment:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s