ఊసుపోక 168 – కాపీదశకం

మూడు వారాలక్రితం కాపీవిద్యమీద టపా రాసినప్పుడు కొన్ని పద్యాలు ఆ టపాలోనే చేర్చేను కదా. ఆ తరవాత ఇంకా కొన్ని కూడా వచ్చేయి. ఏడుగురు కవులు రాసిన పద్యాలు ఇక్కడ ఇస్తున్నాను. ఇవి స్వీయకవితలే కానీ కాపీలు కావని గ్రహించగలరు. చివరలో చేర్చిన సురేష్ కాజ గారి కవిత చేర్చేను, ఆయన మరీ అమాయికత్వంతోనో చాదస్తంగానో మూల రచయిత పేరు చెప్పడంచేత అది వేరే వర్గంగా గుర్తిస్తున్నాను. ఆయా రచయితలకు ధన్యవాదాలు.

కాపీ దశకం

——-

 1. నారాయణ స్వామి

రుచికై ఫిల్టరు కాఫీ
శుచియౌ రాగము సుమధుర శుద్ధము కాఫీ
రచయిత చేసిన కాపీ
వచనం కవనం మెరయును, వ్రాయుము కాపీ!

———–

 1. గోమతి దిట్టకవి జొన్నలగడ్డ

అడుగనినే నడగగనే చేతులు జాపీ
చేసెను నా పై దయతో తప్పులు మాఫీ
మచ్చుకు ఇచ్చెను తన పర్సనల్ కాపీ
తన అభయంతో నా పని ఇక సాఫీ …

ఉన్నవి 64 కళలట వాడుకలో
వాటికీ తోడు జేరెనట క్రొంగొత్తది ఈ మధ్యకాలంలో
కాపీ నామదేయమట ,దీనికే అగ్రతాంబూలమట
తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త …వినుడీ మాట …

———–

 1. రవి ఇయన్వీ

ఉప్పు కప్పురంబు నొక్క పోలికనుండు
చూడ చూడ రుచుల జాడ వేరు
కథల లోన పచ్చి కాపి కథలు వేరు
కాస్త వినుమ టయ్య కథకరాయ!

—————

 1. మాధవ క్రిష్ణ మేడూరి

కాపి యనిన వినగ కమనీయ రాగమ్ము
కాపీని కని పెంచు నైజమే రోగమ్ము
కాపి కలిమినీదు ఇలనైన కలనైన
కాపి బాపి కవిత పెంచు మహిని

———–

 1. వసుధారాణి

స్వయంపాకంకన్న
పొరుగింటి పుల్లకూర మిన్న
మనము రాసే కన్నా కాపీయే సరియన్న
వాస్తవమ్ము సుమ్మి వసుధమాట

కాపీ మా కుల దైవము
అనుకరణ మాకాలవాలము
నిజమగు రాత రాయమే దినము
వాస్తవమ్ము సుమ్మి వసుధమాట

—-

 1. రావెల పురుషోత్తమరావు

కాపీ చేయుట ఖర్మము
కాపీలో ఆరితేరుఘనులేవీరల్
సాఫీగా ఈ కాపీలే
తాపీగాచేసియెందరో ధన్యత బడసెన్!!

కాపీ తండ్రియు దైవము
కాపియే తనకు బిక్ష కలి చుట్టంబౌ
కాపీ చేసిన ఘనతను
తాపీగా చెప్పడెవడు దారుణమదియే!!

కాపీ కళయే కాదా?
తాపీగాచూడవయ్య తగు శాస్త్రములన్
కాపీరచనలు చేయుచు
ట్రోఫీలే పొందిరయ్య తోకలనూపన్!

———–

 1. గన్నవరపు నరసింహమూర్తి

చెలువపు తలపులు గలిగిన
సలలితమౌ పలుకులందు సరసత పొంగన్
మలచిన కవితలె మధురము !
తులువతనము బయలుపడద ? దొంగిలు టేలా ??

———

 1. సురేష్ కాజ

స్వకపోల కల్పిత మనో
జ్ఞకళా గతి కెట్టులౌను సరి? ఛాయా చో
రక రుచి సందర్భం బని
ముకురము నగు కరణి నవ్వు మోము చెలంగన్

(ఈ పద్యం నాకు పంపిన కవిగారి అభిప్రాయం – నేను వ్రాసిన ఈ కవితను చామకూర అనే ఆయన తన విజయవిలాసము అనే కావ్యములో వాడేసుకున్నాడు)

ఇవన్నీ చదివేక, ఉత్సాహం వచ్చేసి నేనూ చేసేను ఒక వ్యర్థప్రయత్నం. ఆ తరవాత నన్ను నేనే కాపీ చేసేసేను ఎవరు చూడొచ్చేరని, చూసినప్పుడు చూదాం అని.

కాపీయందు దిట్ట
కాపీ చేయువారు దిట్ట రాదు నోట

పొసగ భుజము తట్టి పొమ్మనుటె మేలు
వీర కాపిపోషక బిరుదాంకితులౌదురు గాత ఈ క్షణమే!

(గమనిక – ఛందస్ సూత్రాలవంటివేవీ వర్తించని స్వేచ్ఛాకవిత ఇది.)

తాజాకలం – ఈ పోస్టు ప్రచురించినతరవాత వచ్చిన కవితలు

9. జి.యస్. లక్ష్మి

నాకూ యతిప్రాసలు తెలీవండీ.. ఏదో ఉడతాభక్తిగా నాలుగు లైన్లు..
కాపీ కాపీ యనుచు యేదో
పాపము చేసినటుల యిటుల పలుకుట మేలా
కాపీకన్నను ఇలలో మేలైన
దింకేమి కలదు ముదముగ వినరే!
పిల్లలు పెద్దల కాపీ
పిల్లులు పులులకు కాపీ
అక్కడ ఇక్కడ ఎక్కడైనా
కాపీకొట్టేది అందరికీ అందించుటకేకదా!
చింతించకు చింతించకు నీదేదో పోయిందని
ఏది నీది ఏది నాది అంతా శూన్యం
అన్నీ అందరివీ అనుకో
అపుడే నీ మనసు నడుచు శాంతి పథములో..

10. జిలేబి

కాపీ కాపీ యనుచును
పాపము చేసినటుల యిటు పలుకుట మేలా
కాపీ కన్నను ఇలలో
హాపీ యింకేమి కలదు హార్నీ వినరే!

ముత్యాల సరము ->

పిల్లలు పెద్దల కాపీయన
పిల్లులు పులులకు కాపీయన
ఎల్లెడ ఎక్కడ ఎప్పుడునూ
చెల్లు కాపీ అందము చందమన.

 

(జనవరి 23, 2016)

 

 

 

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

4 thoughts on “ఊసుపోక 168 – కాపీదశకం”

 1. ఏదో మా తరపున “ఉడతా కాపీ” గా 🙂 స్వల్ప అడ్జస్ట్ మాడి 🙂

  కందము ->

  కాపీ కాపీ యనుచును
  పాపము చేసినటుల యిటు పలుకుట మేలా
  కాపీ కన్నను ఇలలో
  హాపీ యింకేమి కలదు హార్నీ వినరే!

  ముత్యాల సరము ->

  పిల్లలు పెద్దల కాపీయన
  పిల్లులు పులులకు కాపీయన
  ఎల్లెడ ఎక్కడ ఎప్పుడునూ
  చెల్లు కాపీ అందము చందమన

  చీర్స్
  జిలేబి

  మెచ్చుకోండి

 2. నాకూ యతిప్రాసలు తెలీవండీ.. ఏదో ఉడతాభక్తిగా నాలుగు లైన్లు..
  కాపీ కాపీ యనుచు యేదో
  పాపము చేసినటుల యిటుల పలుకుట మేలా
  కాపీకన్నను ఇలలో మేలైన
  దింకేమి కలదు ముదముగ వినరే!

  పిల్లలు పెద్దల కాపీ
  పిల్లులు పులులకు కాపీ
  అక్కడ ఇక్కడ ఎక్కడైనా
  కాపీకొట్టేది అందరికీ అందించుటకేకదా!

  చింతించకు చింతించకు నీదేదో పోయిందని
  ఏది నీది ఏది నాది అంతా శూన్యం
  అన్నీ అందరివీ అనుకో
  అపుడే నీ మనసు నడుచు శాంతి పథములో..

  మెచ్చుకున్నవారు 1 వ్యక్తి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.