మనలో మనమాట 12 – మర్యాదలమీద మిత్రుల కతలు

నిన్నటి నా టపాకి స్పందిస్తూ వచ్చిన చిన్నకతలు ఇక్కడ పొందుపరుస్తున్నాను. పాల్గొన్నవారికి ధన్యవాదాలు.
ఈ కతలు చూసేక నాకు అనిపించింది అది,

వాడు వంటి అన్నపదాలు కూడా వాడుకలో ఉన్నాయి. సందర్భాన్నిబట్టి వాడడం జరుగుతోంది అమెరికాలో అస్తమానం అనే political correctness పట్టించుకోడం నిత్యజీవితంలో అట్టే జరుగుతున్నట్టు లేదు.
—-
నేను ఇచ్చిన పదాలు ఏ పదం ఏ సందర్భంలో ఉచితం, ఎక్కడ అనుచితం చెప్పండి. బహుశా చిన్న సన్నివేశం కల్పించవలసి ఉంటుంది. మరీ పెద్ద కథలు అవసరం లేదు.
భార్య. పెళ్ళాం, పిన్నిగారు, మాఆవిడ (వాళ్ళావిడ), పనిది, పనావిడ, పనమ్మాయి, లేదా అసలు పేరు.

1, గోమతి దిట్టకవి జొన్నలగడ్డ –
మా పక్కింటాయన వాళ్ళావిడ , పిల్లలతో ఊరెళ్ళాడని ఇందాక ఎదురింటి పిన్నిగారు మా అత్తగారితో చెప్పారు. మా మూడిళ్ళలో పనమ్మాయి లావణ్య కాబట్టి వారం రోజులు దాన్ని కేవలం మొక్కలకి నీళ్ళు పోసి పొమ్మన్నారు. వాళ్ళు శ్రీనగర్ వెళ్లారు …నేను , మీ అన్నయ్యగారు , అబ్బాయి కోడలు తిరుపతి వెదడామనుకుంటున్నాము …ఇది ఇందాక మా ఇంటి ముందు జరిగిన సంభాషణ
‘ఆ గౌరి లేదూ,అదే ఆ నాలుగో నెంబర్ ప్లాట్ ,వాళ్ళాయన ,మా ఆయన ఒక ఆఫీసులోనే పని చేస్తారు .అందుకే మా పనబ్బాయిచేత తనూ కేరేజీ పంపేస్తుంది ..పనిలో పని అన్నట్టు బాబాయ్ గారికి ,అదే సుభద్ర పిన్ని భర్త కి మా పనోడే తీసుకెళతాడు ,అదే ఆఫీసులే బాబాయ్ కూడా …”

2. అనితా రామ్.
మా అయన ఆఫీసులోనే పనిచేస్తారు మా పక్కింటి ఆయన, కాని నాకు ఆవిడకు అసలు పడదు, తెల్లగా బుర్రగ ఉంటుందని బోల్డు గర్వం దానికి, చదువుకొందని ఇంకాను, నా ఒక్కమాట పడనివ్వదు, ఐనా నేనూరుకొంటానా!! ఒక్క పనిమనిషిని పడనివ్వను, వాళ్ల ఇంటికి వచ్చిన వాళ్లను వచ్చినట్లే పంపించేస్తా! నిత్యస్తమానము కళ్లెట్టుకొని చూస్తూ ఉంటా అనుకోండి.
ఇంత చేసినా ఏమి లాభం… మొన్న మా ఇంటికి ఓ పిన్ని గారు వచ్చారు, అదే, ఈయన మేనత్త, వాళ్ల ఇంటికి వెళ్లి వచ్చి ఒకటే పొగడటం, అంతు పొంతు లేకుండా… వొళ్లు మండిపోయింది అనకోండి!! వెయ్యాల్సిన మినపరొట్టె కాల్చేసా నల్లగా. ఏమీ అనలెక, మజ్జిగ తాగి పడుకొన్నారు ఆవిడా, ఈయనాను, చద్దన్నము తినేసి గమ్మున ఉండిపొయే నేను.
రెండో రొజు చూద్దును కదా, ఈ పిన్నిగారు వాళ్ల ఇంట్లొనే ఉన్నారు.. పైగా పనిదానితో నాకో కబురు, ఒకసారి వచ్చి పోవే పిల్లా అని,

ఏమిటో విడ్దూరం అని వెళ్లా, చూద్దును కదా, పక్కావిడ అదేదో రోబో మిషన్ కొన్నారుట, ఇంక పనిమనిషి అక్కరలేదుట, ఎంత పనైనా నిమిషాలమీద చేస్తాడుట… ఓ జీతం భత్యం అక్కర్లేదు, ఓ మాటా మంతీ లేదు, నాగా అసలు లేదు.

చెప్పొద్దు మా అయోమయం మీద వెంటనే కోపం వచ్చేసింది… చేసుకొన్న వారికి చేసుకొన్నంత… ఇలాంటి వస్తువు ఉంది అని తెలిసినప్పుడు ముచ్చటగా పెళ్లానికి తెద్దాము అని ఉండద్దూ. ఓ అచ్చటా ముచ్చటా లేని సంసారమయ్యె… ఇంకేమి చేస్తాను… ఆ రోబో పనివాడిని, వాడి వైపు నోరు తెరిచి చూస్తున్న ఆ పిన్నిగారిని, ఘనకార్యం చేసినట్లు నుంచున్న పక్కావిడను, అపురూపంగా చూస్తున్న ఆయనను చూసి, మా బుద్ధావతారాన్ని ఒక్క చూపు చూసి ఇంటికి వచ్చాను.

3, శ్రీదేవి శ్రీపాద.
మా వారు ఎవరికైనా నన్ను పరిచయం చేసేటప్పుడు మా ఆవిడ అంటారు.నేను చేసిన పని నచ్చనప్పుడు “భార్య భర్తకి అనుగుణంగా ఉండాలి అంటారు “.ఆయన మాట చెల్లదనుకున్నప్పుడు “ఏమ్ చేస్తాము పెళ్ళాందే పెత్తనం అంటారు “.వరుసగా 4రోజులు పప్పు చేయకపోతే
ఫలానా వాళ్ళావిడే నయం రోజూ పప్పు చేస్తుందిట అంటారు.ఇక మా పిల్లలు మా పనిమనిషి లక్ష్మిని మొదట్లో పనమ్మాయి అని చెత్త తీసుకెళ్ళే అతనిని చెత్తబ్బాయ్ అని పిలిచేవారు.వాళ్ళతో అలా పిలవకూడదని చెప్పి ఆ పిలుపులు మాన్పిన్చేసరికి నాకు దేవుడు కనిపించాడు.ఇదంతా చూసే మా పక్కింటి పిన్నిగారు బాబయ్యగారితో కలిసి ఒకటే నవ్వులు.

4. ఉమ అద్దేపల్లి.
”ఆ గౌరి లేదూ,అదే ఆ నాలుగో నెంబర్ ప్లాట్ ,వాళ్ళాయన ,మా ఆయన ఒక ఆఫీసులోనే పని చేస్తారు .అందుకే మా పనబ్బాయిచేత తనూ కేరేజీ పంపేస్తుంది ..పనిలో పని అన్నట్టు బాబాయ్ గారికి ,అదే సుభద్ర పిన్ని భర్త కి మా పనోడే తీసుకెళతాడు ,అదే ఆఫీసులే బాబాయ్ కూడా …”

5. ఉషా రాణి
పక్క వీధిలో ఉండే గారి భార్య కి అనారోగ్యం గా ఉందని చూసి రావటానికి మా ఆవిడ, మా బావమరిది వాళ్ళావిడ కలిసి వెళ్ళారు. ఇంతలో మా ఆవిడ ‘పిన్నిగారు’ అని ముచ్చటగా పిలుచుకునే పక్కింటావిడ తలుపుతట్టి “మా పనిది ఇవాళ రానని కబురు పంపింది. మీ పనమ్మాయి వస్తే కాస్త అటుగా పంపుతావా నాయనా, మీ బాబాయ్ కూడా ఊళ్ళో లేరు చేతిసాయానికి,” అని అడిగారు. “అయ్యో అలాగా, తప్పకుండానండి ముందుగా మీ ఇంటికే పంపుతా,” అన్చెప్పి ఇరుగు పొరుగు సహకార పద్ధతిని నేనూ పాటించాను. తిరిగి రాగానే మా ఆవిడ ” గారికి పెళ్ళాం అంటే ఎంత ప్రేమ అనుకున్నారు, పాపాయిని చూసినట్లే అనుకోండి. వాళ్లకి తగ్గట్లే ఆ పనావిడ, నోరు మెదపకుండానే అన్నీ అమర్చి పెడుతుంది,” అని చెప్తూ మొదలెట్టిన ఆ ఉపోద్ఘాతం ఎటు పోనుందో మరి!

-2-
మొన్నే మా మావయ్యగారి మనవరాలు బుల్లి పెళ్ళికి వెళ్ళొచ్చినప్పటి నుండి మా అమ్మ “బుల్లి మొగుడు ఎంత బంగారమోనే, ఇట్టే కలిసిపోయాడు పదిరోజులైనా తిరక్కుండానే,” అని మురిసిపోయింది. అత్తయ్య ఫోన్లో వాళ్ళ వియ్యంకులను గూర్చి ఇదే మాట “భార్యాభర్తలిద్దరూ మగపెళ్ళివారమన్న భావం లేకుండా మెలిగారంటూ”. మావయ్య కూతురు, వాళ్ళాయన కూడా తెగ సంబర పడ్డారుట. మా ఆయన కి సెలవు దొరక్క ఈ పెళ్ళికి వెళ్ళలేకపోయాను. వాళ్ళఊర్లో పనివాళ్ళకి ఇబ్బంది ఉండదు. మాకలా కాదు, పనమ్మాయి ఎప్పుడు మానేస్తుందో, ఇంటిని ఆనుకుని ఉన్న మా తోట చూసే పనోళ్ళు నికరంగా ఉండక నాకు ఇల్లు కదలటం కుదరదు.


(ఏప్రిల్ 7, 2016)

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

4 thoughts on “మనలో మనమాట 12 – మర్యాదలమీద మిత్రుల కతలు”

 1. తూలికా రాణి మాలతి గారికి ఉగాది శుభాకాంక్షలు !

  వడివడి చదువగ పదముల నటునిటు గుదురుగ వేసితి యీ వ్యాఖ్యను ఓ వాద్యమ్ముగ గావన్ !
  బడబడ నటునిటు తిరుగుచు చకచక పనులను చాకువలే భార్యయు గాపాడన్, మరి సోఫా
  నటునిటు జరుపుచు కుదురుగ జలజల నడకలు గూడన, “ఓహ్! నా,పని రాణమ్మా ” యని ఓ నా
  డటు బిలువ మరి మురిపెము గొనెను గద! పెనిమిటి తోడను నీ డంగగు పాడన్రా యన, “పోడా”
  సడి వలదని యరవపు సరి చెణుకుల విసిరె జిలేబి! సదా సౌమ్యము గా సాగాల మదీశా !

  జిలేబి
  (త్రిభంగి)

  మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.