మనలో మనమాట 13 – రంగుతోలు కథ అధ్యయనం హైదరాబాదు యూనివర్సిటీలో

ముందొక టపాలో   నారచనలను పాఠకులు   బాగానే  ఆదరిస్తూన్నారు, పండితుల ఆదరణే కొదువ అని రాసేను. ఆ పాపపరిహార్థం ఇప్పుడు సవినయంగా అంగీకరిస్తున్నాను ప్రముఖ సాహితీవేత్తలలో కూడా గుర్తించేవారున్నారని.

డా. దార్ల వెంకటేశ్వరరావు గారు   హైదరాబాదు  యూనివర్సిటీలో  బోధిస్తున్న  Introduction to Diaspora Literature Course లో  నాకథ చేర్చేరు.

మరొకమాట కూడా ఒప్పుకోవాాలి.   మామూలుగా ఏమాత్రమో పేరు గల రచయితలకు ఇది విశేషం కాకపోవచ్చు. కానీ నాకు మాత్రం ప్రత్యేకంగా చెప్పుకోవలసిన విశేషమే.

ఆ గుర్తింపు, గౌరవం అందుకున్న కథ రంగు తోలు. ఇది 2007లో రాసేను. www.eemaata.com లో ప్రచురించారు. అప్పుడే కొంతమంది పాఠకులు మంచి కథ అని మెచ్చుకున్నారు.

కథలో నేను ప్రధానంగా ఎత్తి చూపించదలుచుకున్నది మనకి తెలుపు అందానికి సంబంధించిన విషయం మాత్రమే. అమెరికాలో అది జాతికి సంబంధించిన విషయం. చారిత్ర్యకంగా నల్లవారు బానిసలుగా వచ్చేరు. దరిమిలా వారిని దుష్టులుగానూ నేరస్థులుగానూ పరిగణించడం కూడా మొదలయింది. అంచేత నల్లవారు అంటే ఈ విపరీత వ్యాఖ్యానాలన్నీ చోటు చేసుకుంటాయి. వారికి సంఘంలో అట్టే గౌరవం లేదు. అలాటి వాతావరణంలో నల్ల రంగు తెలుగు అమ్మాయి మనసు ఎలాటి ఆలోచనలకు గురి అవుతుందన్నదే ఈకథ.

ఈ కథని విశ్లేషిస్తూ జి. సుబ్బలక్ష్మి గారు రాసిన వ్యాసం కథాజగత్ వారి బహుమతి పొందింది.

డా. దార్ల వెంకటేశ్వరరావుగారికీ, జి. సుబ్బలక్ష్మిగారికీ, కథా జగత్ వారికీ, ఈ కథని ఆదరించిన పాఠకులకూ నా హృదయపూర్వక ధన్యవాదాలు.

రంగుతోలు కథ

సుబ్బలక్ష్మిగారి విశ్లేషణ.

000

(ఏప్రిల్ 18, 2016)

 

 

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

6 thoughts on “మనలో మనమాట 13 – రంగుతోలు కథ అధ్యయనం హైదరాబాదు యూనివర్సిటీలో”

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు, తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరింపబడును.

Please log in using one of these methods to post your comment:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s