ఎన్నెమ్మకతలు 4వ సంకలనం

Picture1ఎన్నెమ్మకతలు సంకలనం నాల్గవ సంకలనం లింకు ఎన్నెమ్మకతలు 4

ఉపసంహారం

ఊసుపోక శీర్షికతో తెలుగు తూలికలో ధారావాహికంగా ప్రచురించిన కతల సంకలనాలు ఈ సంకలనంతో సమాప్తం. ఇవి విడివిడిగా సమయాన్నిబట్టీ సందర్భన్ని బట్టీ రాసినా ఈ విధంగా సంకలించడంలో కొన్ని కొత్త విషయాలు తెలిశాయి. ప్రధానంగా నా భావజాలం ఏ విధంగా రూపు దిద్దుకుంది, ఏమైనా మారిందా లేదా అన్నవి స్పష్టమయాయి ఇలా ఒకచోట పెట్టి చదువుతుంటే. మీకు అలా అనిపించిందో లేదో మీరే చెప్పాలి.

నాకు అర్థమైన ఇతర అంశాలు – కొన్ని విషయాలు మళ్ళీ మళ్ళీ ప్రస్తావించడం జరిగింది. తద్వారా నా ప్రపంచం ఎంత చిన్నదో తెలిసింది. రెండోది, ఆ విషయాలు నన్ను అంతగా మథనపెడుతున్నాయని కూడా అనుకోవచ్చు. ఏమైనా ముందు ముందు జాగ్రత్తగా ఉండాలి.

ఈ ధారావాహిక అనేక అంశాలమీద నేను వ్యాఖ్యానించడానికి వేదిక అయింది. అనేక అంశాలమీద పాఠకులు తమ అమూల్యమైన అబిప్రాయాలు వెలిబుచ్చేరు. నిజానికి ఆ వ్యాఖ్యలు ఇక్కడ చేర్చగలిగితే బాగుండునేమో కానీ సందర్భాలు అర్థం కాక అయోమయం కలిగించవచ్చని చేర్చలేదు. అనుమతివిషయంలో కూడా సంశయమే కదా. ఆసక్తి గల పాఠకులు నాబ్లాగులో ఆ యా టపాలదగ్గర చూడవచ్చు.

ఊసుపోక ధారావాహికను ప్రో్త్సహించిన పాఠకలోకానికి కృతజ్ఞతలతో శలవు.

– నిడదవోలు మాలతి

తెలుగు తూలిక

జూన్ 26, 2016.

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.