మనలో మనమాట 19 – మానుల చిత్రకళా ప్రదర్శన

అపకారంబులు సేయవెవ్వరికి, నేకాంతంబు నందుండు అని వృక్షములను మెచ్చుకున్నారు పోతనగారు. ఇంకా నీడనిస్తాయనీ, ఫలరసాదుల గురియుననీ, సుగంధపుష్పాలతో దారిన పోయేవారిని ఆదరిస్తాయనీ కూడా చాలామందే పొగిడేరు. అవి చేసేవి ఇవి అయితే వాటికి ప్రతిగా మనం చేసేవి ఏమిటి అంటే … ఎందుకులెండి. మనభుజాలు మనం తట్టుకోవచ్చు కానీ చెట్లు ఆనందిస్తాయా విచారిస్తాయా అన్న ప్రశ్నకి చిత్తశుద్ధితో జవాబు చెప్పడం కష్టం. అక్షరాలా దుంప తెంపేసి కురుచవృక్షాలని పెంచే కళ, పెరగనివ్వని కళ అనాలేమని నీకు తెలిసిందే కదా. అంచేత ఈఅంశం ఇక్కడే వదిలేసి నేను నిత్యా వీధులంట తిరుగుతూ దర్శించుకునే మానులగురించి చెప్తాను. మానంటే మాన్ అనుకునేవి నేను అంటున్నది ఇటు వేళ్ళకీ అటు కొమ్మలకీ రెమ్మలకీ మధ్యన నిలువునా నిలిచి రెంటినీ కలిపి నిలబట్టే బోదెలమాట చెప్తున్నది.

అన్నీ ఒక్కలాగే ఉన్నా అందులోనే కొన్ని మరీ విచిత్రం సుమా. కొన్ని సహజసిద్ధంగా వాటికవే సోయగాలు కురుస్తాయి. ఏ మాను షోకు ఆ మానుదే. కొన్నేమో పనిగట్టుకు ఎవరో ఓ చురకత్తి పుచ్చుకు గీసేసినట్టున్నాయి.

నున్ననిమాను
నున్ననిమాను

ఈ చెట్టు చూడు. బెరడు లేదేం అని చాలా రోజులు అనుకుంటూ వచ్చేను ఆపక్కనించి పోతూ. ఆఖరికి మొన్న చూసేను. ఆ యింటావిడ అట్టే వయసుండదులే పాతిక ముప్ఫైలోపే నాలుగేళ్ళ కొడుకుతో తీరిగ్గా ఆ మానుకున్న కాయితప్పొరలాటి బెరడు ఒలుస్తోంది. నాకయితే భలే సరదాగా అనిపించింది ఆ దృశ్యం. లేదులే ఈ బొమ్మలో వాళ్ళిద్దరూ లేరు. ఆసమయానికి నాచేతిలో కెమెరా లేదు. ఇంతకీ నున్నగా గీసేసినట్టుందా ఈ మాను.

 

DSC00464

 

ఇది చూడు మణిపూసలు పొదిగినట్టు. ఇది మాత్రం గంటకూలికి ఏ ఇస్పానిక్ పనివాడో ఒత్తుగా ఉన్న బెరడుని తీరిగ్గా కోత పెట్టినట్టున్నాడు మణులన్న భ్రమ కలిగించేలా.

 

 

DSC00043

 

ఇటు చూడు కొమ్మలు సూటిగా నేలకి సమాంతరంగా సాగి ఆ మీదట ఆకాశంవేపుకి తిరిగి ఎదగడం చూస్తే దీపపుసెమ్మెకి నమూనా తయారు చేసినట్టు లేదూ!

 

ఏ ఇంటి వంశవృక్షానికో అద్దం పడుతోందేమో తరతరాల చివుళ్ళతో.DSC00029

 

 

 

 

జడ
జడ

 

అమ్మ చక్కగా దువ్వి వేసినజడో. కొమ్మలు కొట్టేసి అలాటి భ్రమ కలిగించేరని నువ్వనుకున్నా సరే.

 

 

 

DSC00455

 

మూరెడు మొహంతో ఏ జపాను కళాకారుడో చెక్కిన శిల్పంలా ఉంది

 

 

 

మొక్కయి ఒంగనిది
మొక్కయి ఒంగనిది

 

మొక్కయి ఒంగనిది మానై ఒంగుతుందా ఆని అడగడం ఎందుకూ ఇది చూస్తే తెలీడం లేదూ?

 

 

 

 

ఈ ఏనుగుగున్న మోరలెత్తి నిన్నుగున్నఏనుగు

పిలుస్తున్నదో,

నీరుకోసం మొరలిడుతున్నదో!

 

 

మెలికల మాను
మెలికల మాను

మానుని నువ్వు గానీ మరొకరు మెలికలు తిప్పగలరా? ఇది తప్పక బోదె స్వీయ చిత్రకళానైపుణ్యమే కావాలి.

 

 

DSC00033

అనుభవాలు భుజానికెత్తుకున్న ముదుసలి.

 

 

 

DSC00041

ఏ గుహల్లోనో చెక్కిన అప్సరకన్య రూపురేఖలు పుణికి పుచ్చుకున్నట్టుంది.

 

 

 

 

చూడాలన్న ధ్యాస ఉండాలి కానీ సృష్టిలోనే ఉన్నాయి సమస్తకళలూ. ఇంటిముందే కళ్ళముందే ఉంది అద్వితీయ సౌందర్యం!!

అక్కడక్కడ ఆగి ఆ సుందరదృశ్యాలను తిలకిస్తున్న నన్ను ఆదరాబాదరా దాటుకుపోయేవారిని చూస్తే నాకు చాలా విచారంగా ఉంటుంది కూడా.
000

(జూన్ 30, 2016)

ఇదుగో చిత్రకళా ప్రదర్శన –

ఈ స్లైడ్ ప్రదర్శన కోసం జావాస్క్రిప్ట్ అవసరం.

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.