బహుభాషావైదుష్యం, పుట్టపర్తివారి వాక్కులలో

వెనకటి టపా – బహుభాషాకోవిదులు తెలుగు రచయితలు – చూసినవారు మళ్ళీ చూడరన్న ఆలోచనవల్ల, దానికి సంబంధించిన, ఈరోజే తెలిసిన సమాచారం విడిగా ఇక్కడ పెడుతున్నాను.

సరస్వతీపుత్రులు పుట్టపర్తి నారాయణాచార్యులు అక్షరాలా బహుభాషాకోవిదులు అన్నది అందరికీ తెలిసినదే. ఇతర భాషలు నేర్వడంలో ఆంతర్యం కింద వారి కుమార్తె శ్రీమతి పుట్టపర్తి నాగపద్మిని ఇలా వివరించేరు. నాగపద్మిని సౌజన్యంతో ఇక్కడ ఇస్తున్నాను.

పుట్టపర్తి నాగపద్మిని ఆదరపూర్వకంగా కింద నా టపాదగ్గర రాసిన మాటలు వ్యాఖ్యలలో కలిసిపోకుండా, మిత్రులందరి దృష్టికి తీసుకురావడంకోసం ఇక్కడ మళ్ళీ పెడుతున్నాను. వారి అయ్య, సరస్వతీపుత్రులు పుట్టపర్తి నారాయణాచార్యులుగారి వాక్కులు శిరోధార్యము కదా.

“మా అయ్యగారు – పుట్టపర్తి వారు, తరచూ అనే మాట గుర్తొస్తున్నది.’అనేక భాషలు నేర్వటం వల్ల దృష్టి విశాలమౌతుంది. కేవలం మన భాషే గొప్ప అన్న సంకుచిత ధోరణి నుంచీ బయటపడేమార్గం సువిదితమౌతుంది. యెవరి భాష వారికి గొప్ప కదా మరి..అనేక భాషలు నేర్వటం వల్ల రచనల్లో వాడి పెరుగుతుంది కూడా !!’ ‘నన్నెవరైనా కవిని కాదంటే బాధపడను. యెవరి భావనలు వారివి. కానీ నన్నెవరైనా పండితుణ్ణి కాదంటే, మాత్రం వూరుకోను.’ మా అయ్య దృష్టిలో పాండిత్యానికే పెద్ద పీట అని వేరే చెప్పనవసరం లేదుకదా !”

మనం మరో విషయం కూడా గమనించాలి. ఆ మహాకవి, పండితుడు ఎన్ని భాషలు నేర్చినా తెలుగును నిర్లక్ష్యం చేసి కాదు అన్నది.

రచయిత: మాలతి

మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.