కొడక్ క్షణాలు

పక్కలేన్‌లో

డెబ్భైమైళ్ల స్పీడ్‌తో

దూసుకుపోతున్నకారులోంచి

దేశవాళీ పాప

మామీ ్ంటూ

వేలెత్తి చూపిన సుందరదృశ్యం

 

పూజక్కాదు కానీ

భోజనానికొస్తాననే

కొత్త తెలుగుబాలుడి హుషారు

 

మీయింటికొస్తే

అమ్మగారింటికొచ్చినట్టుందనే

కొత్తపెళ్లికూతురి

వదనంలో నిర్వేదం

 

పట్టుచీరెలో

పండుతలతో

మౌనంగా నిలబడిన

వయసుమళ్లిన ముత్తైదువుని

ఎత్తుకోమంటూ చేతులు చాచిన

బుల్లిపాపాయి

 

కోల్స్‌లో

క్యూలో

తెలుగుయాస విని

చప్పున విప్పారిన అక్షిద్వయం

 

ఫోన్ బుక్ తీసి

రాజుగారినీ

రెడ్డిగారినీ

శాస్త్రిగారినీ

శర్మగారినీ

పిలిచేసే కొత్త మాష్టారు

 

అమెరికా ఖండాన

అనుదినమెదుయే

మధురక్షణాలు.

అంతరాంతరాల

అణిగిమణిగిన ఆర్తికి ఆదర్శాలు.

(1987లో రాసిన కవిత.)

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

4 thoughts on “కొడక్ క్షణాలు”

 1. మీరు కవితలో రాసిన రోజులు – అవి నిజంగా కొడక్ క్షణాల్లాగే అనిపిస్తున్నాయండీ – పాత ఫోటోల్లా అపురూపంగా దాచుకుని , అప్పుడప్పుడు తీసుకుని చూసుకునేలా – రావేమో మళ్లీ అనిపించేలా!
  ~ లలిత

  మెచ్చుకోండి

 2. కొంచెం మారినట్టుంది ఇప్పటివాళ్ళు ఆరోజుల్లోలా మనభోజనాలకి తహతహ తక్కువేనేమో. మీకు బాగున్నందుకు సంతోషం వనజగారూ.

  మెచ్చుకోండి

 3. మాలతీ గారూ మీరేదో కొడొక్ కెమెరాతో తీసిన ఛాయాచిత్రాలు అనుకుని వచ్చేసాను . అంతకన్నా అద్భుత మనః చిత్రాలు అలరించాయి . బావున్నాయండీ . ఇప్పటికీ అలాగే ఉంటుందేమో .. కదా !

  మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు, తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరింపబడును.

Please log in using one of these methods to post your comment:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s