పోయిరావమ్మా తిరిగిరాని చోటికి!

రేపు ఆదివారం Mother Teresa ని Rome లో  దైవాంశసంభూతురాలిగా  (Canonizing) గుర్తిస్తారు.

Mother Teresa, Princess Diana కూడా వారం రోజులు తేడాలో (ఆగస్ట్ 31, సెప్టెంబరు 5) మరణించేరు. సెప్టెంబరు 6వ తేదీ డయానా దేహాన్ని పాతిపెట్టేరు. యువరాణి వార్తలమధ్య ఆ పుణ్యాత్మురాలి మరణం రెండోస్థానం పొందింది. ఆ సందర్భంలో రాసిన కవిత ((9-6-1997) –

Madre_Teresa_7పోయిరావమ్మా తిరిగిరాని చోటికి …

కోటానుకోట్లయువహృదయాల ప్రతిధ్వనిస్తూ

రవి అస్తమించని మహాసామ్రాజ్యపు యువరాణి

సాగించెను తన అంతిమయాత్ర

నల్దిక్కులా ఆమెచిత్తరువు

చిరునవ్వుతో, కవ్వించే కళ్లతో

పరువళ్లు తొక్కే పరువంలో.

కలవారి లోగిళ్ల

చావు పెద్దపండుగ,

రంగరంగ వైభవం.

ఇది చావు కాదు

Celebration of life అంటారు.

మరోమూల

కలకత్తా చీకటికోణాల్లో

లక్షలాది దరిద్రనారాయుణులమధ్య

నిశ్శబ్దంగా,

నిరాడంబరంగా,

కన్ను మూసెను ఒక పెద్దతల్లి.

వయసులూ, అంతస్థులూ,

అసంపూర్ణంగా వదిలేసిన ధర్మకార్యాలు,

తమపై ఆశలు పెంచుకున్న ప్రజాసందోహం,

సర్వం త్యజించి చేరుకొనెను పరమపదం.

వారూ, వీరూ

చివరకు చేరారు ఒకే చోటికి

Dust to dust.

000

(సెప్టెంబర్ 2016)

గ్రంధకర్త మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

టపాలో చర్చించిన అంశంమీద వ్యాఖ్యానాలు తెలుగులో రాసిన వ్యాఖ్యలు మాత్రమే అంగీకరింపబడతాయి. తెంగ్లీషులో రాసిన వ్యాఖ్యలు కూడా నాకు సమ్మతం కాదు. కోరుతున్నాను

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / మార్చు )

Connecting to %s