భరతనాట్యం నర్తకులు

భరతనాట్యం ఆదిగురువు నటరాజస్వామి. తరవాత భరతుడు శాస్త్రం రచించాడు.  మనకాలంలో నటరాజ రామకృష్ణ, వెంపటి చినసత్యం, రాజారెడ్డి రాధారెడ్డి, వెంపటి రవిశంకర్ వంటివారు  భరతశాస్త్రం అభ్యసించి, విశేషకృషి చేస్తున్నారు ఈ రంగంలో.

natarajaswamiఆంగికం భువనం యస్య వాచికం సర్వవాజ్మయమ్
ఆహార్యం చంద్రతారాది తం వందే సాత్త్వికం శివమ్.

వెంపటి చినసత్యంగారు తమ ట్రూపుతో  80వ దశకంలో అమెరికా  వచ్చినప్పుడు చూసేను. రవిశంకర్  అప్పటికి ఇంకా చిన్నవాడే. ఒక ప్రదర్శనలో భాగంగా శివతాండవం నాకు ఇప్పటికీ గుర్తుంది. నాట్యానికి  తగ్గుతున్న ఆదరణ కారణంగా, రవిశంకర్ ని నాట్యం నేర్చుకోవద్దన్నారనీ,  రవిశంకర్ పట్టు బట్టి నేర్చుకున్నారనీ విన్నాను. యూట్యూబులో భరతనాట్యానికీ, కూచిపూడికీ గల తారతమ్యాలు ఉపన్యాసం ఒకటి ఉంది గానీ అది తమిళంలో ఉండడం  నాకు నిరాశ కలిగించింది.

000

నాకు సంగీతశాస్త్ర పరిజ్ఞానం తక్కువే అయినా టపా రాయడానికి అదేమీ ఆటంకం   కాలేదు. అలాగే ఇదీను. నాట్య శాస్త్రజ్ఞానం కూడా ఏమీ లేదు కానీ ఆసక్తిగా శ్రద్ధగా  చూస్తుంటాను కనక ఓ టపా రాయానిపించింది. ఇండియాలో ఉన్నప్పుడు సినిమాల్లో తప్ప ప్రదర్శనలేవీ చూడలేదు కానీ ఆ అంశంమీద ఓ కథ రాసేను కనక అప్పట్నించీ అభిమానిస్తున్నట్టే లెఖ్ఖ.

రెణ్ణెల్లక్రితం యూట్యూబులో ఆశ్రిత వేముగంటి  నృత్యం యదాలాపంగా నాకళ్ళ బడింది. అది చూసేక,  కొన్నాళ్ళపాటు వరసగా యూట్యూబులో అదే పనిగా అవే చూడ్డం  సాగించేను. భామాకలాపం చూడబోతే ఒక అబ్బాయి ప్రదర్శన కనిపించింది. మొదట నేను గమనించలేదు కానీ దానికింద వ్యాఖ్యాలు చూసేక తెలిసింది అబ్బాయి అని.  ఆ నర్తకుడు వినయంగా చెప్పుకున్నాడు, ఇది తనకు కొత్త అనీ, లోపాలేమైనా ఉంటే చెప్పమనీ.

అంతవరకూ నేను భరతనాట్యం అని వెతికితే నర్తకీమణులే కనిపిస్తూ వచ్చేరు. అంచేత మళ్ళీ పని గట్టుకుని  Male bharatanatyam dancers అని టైపు చేసి చూసేను. అప్పుడు తెలిసింది భరతనాట్యం ప్రధాన వృత్తిగా స్వీకరించడంలో మగవారు  ఎదుర్కొనే ఇబ్బందులగురించి.  ఏదో పుస్తకం కూడా పరిచయం చేసేరు  యూట్యూబులోనే.

చారిత్ర్యకంగా నాట్యం పైతరగతి కుటుంబాలలో స్త్రీలకి నిషిద్ధం. ఆరోజుల్లో నాటకాల్లో స్త్రీవేషాలు మగవారే వేసేవారు. క్రమంగా పరిస్థితి మారింది. కూచిపూడి ప్రదర్శనలలో, డాన్స్ డ్రామాలలో మగవారి పాత్రలున్నప్పుడే మగవారు కనిపిస్తున్నారు కానీ విడిగా పూర్తిగా గంటా గంటన్నరసేపు ఒక్కరే ఇచ్చిన ప్రదర్శనలు కనిపించలేదు. కొందరు అనతికాలంలోనే ఆచార్యులుగా స్థిరపడిపోతున్నారేమో కూడా. ఈ విషయం నారాయణస్వామి (కొత్తపాళీ) గారిని అడిగితే, ఆయన పురుషులు కూడా భరతనాట్య ప్రదర్శనలు ఇవ్వడం ఉంది అని చెప్పి కొన్ని లింకులు ఇచ్చేరు. అంటే యూట్యూబులో తక్కువ కనిపిస్తున్నాయని అర్థమయింది. ఈ నేపథ్యంలో అన్నమాట నాకు భరతనాట్యం వృత్తిగా స్వీకరించిన నర్తకుల ప్రదర్సనలు ప్రత్యేకించి చూడాలనిపించింది.

నాకు నాట్యం గురించి అట్టే తెలీదు కనక శాస్త్రపరంగా నేను వెలిబుచ్చగల అభిప్రాయాలేమీ లేవు గానీ ఏం చూస్తానో చెప్తాను. మామూలుగా మొత్తం చూసినప్పుడు బాగుందనిపిస్తుంది. ఆ తరవాత ముఖంలో ప్రదర్శించే భావాలు, కరవిన్యాసం, హస్తముద్రలు, పాదాలకదలిక – ఒకొక్కటి ఒక్కొక్కమారు చూస్తాను. అలా చూసినప్పుడు నాకు చాలా నచ్చిన ఒక ప్రదర్శన రాజారెడ్డి, రాధారెడ్డి ప్రదర్శించిన తిల్లాన. మరొక డాన్స్ ఫ్రొఫెసరుతో కలిసి చూసేను. ఆ సమయంలో ఆవిడ ఒక వ్యాఖ్యానం చేసేరు, “అతను స్త్రీలా హావభావాలు ప్రదర్శిస్తున్నాడు, ఆవిడ పురుషుడిలా నాట్యం చేస్తోంది,” అని. ఆ టేపు నాదగ్గరుంది. అనేక సార్లు చూసేను కానీ నాకు అలా అనిపించలేదు.

సాధారణంగా గంట, గంటన్నర ప్రదర్శనలిచ్చినప్పుడు, కొన్ని చోట్ల నాట్యం అనడం కన్నా నటన అనడం ఉచితంగా కనిపిస్తుంది. గణేశస్తుతి, కృష్ణశబ్దం వంటి ప్రదర్శనలలో కథాంశాలు చూస్తాం. నాకు ఆ భాగాలు అంతగా నచ్చలేదు అని చెప్పుకోడానికి కించగానే ఉంది. నర్తకులకి నా క్షమాపణలు. ఇందులో కిటుకులు తెలిసినవారు వివరిస్తే తెలుసుకోవాలని ఉంది.

ఇలా నాట్యం వృత్తిగా స్వీకరించివారే కాక, అభిమానవ్యావృత్తిగా స్వీకరించిన నర్తకులు కూడా ఉన్నారు. అప్పుడప్పుడు సాహిత్యసంఘాలు నిర్వహించే సభల్లో చూస్తుంటాం. నాకు తెలిసినవారు నారాయణస్వామి. ఆయన నాట్యం 5 ఏళ్ళక్రితం చూసేను కూడా.

నేను ప్రస్తావించదలుచుకున్న మరో అంశం – కొన్ని విడియోలదగ్గర వ్యాఖ్యానాలు. ఒక నర్తకుడు చేసిన నాట్యందగ్గర “అమ్మాయి చేసిఉంటే బాగుండేది,” అని ఉంది. అప్పుడు నాకనిపింంచింది బహుశా నాట్యంమీద కాక పైకి కనిపించే రంగురంగుల వస్త్రాలమీదా నగలమీదా, స్త్రీ సౌందర్యంమీదా దృష్టి పెడితే అలాటి అభిప్రాయాలు కలుగుతాయని. ఇలా ఆలోచిస్తుంటే ప్రేక్షకులదృష్టిని ఆకట్టుకోడానికి ఆడవాళ్ళకంటే మగవాళ్ళు ఎక్కువ శ్రమ పడవలసివస్తుందేమో అని కూడా అనిపించింది.

ఈ టపా ఉద్దేశం ఇదే – ప్రేక్షకులు కేవలం “కనిపించే”భాగంమీదే కాక మొత్తం హావభావాలు, సంగీతం, ఆంగికం అన్నీ సమష్ఠిగా పరికించి చూస్తే అనుభూతిపరంగా ఎక్కు వ బాగుంటుందని.

కొన్ని విడియోలు చూస్తే నర్తకులు తొందర పడి పెట్టేసేరేమో అనిపించింది. ఒక విడియో దగ్గర మూడు వ్యాఖ్యానాలు ఈ అభిప్రాయం స్పష్టం చేసేయి. తామ నాట్యం నేర్చుకుంటున్నమనీ, తాము అలా చేస్తే ఆచార్యులు ఏమాత్రం సహించేవారు కాదనీ అనీ వ్యాఖ్యానించేరు.

నన్ను రవంత చిరాకు పెట్టిన మరోవిషయం విడియో తీసేవారు. కొన్ని విడియోలు చూస్తుంటే కోతికి కొబ్బరికాయ దొరికినట్టు అన్న సామెత గుర్తొచ్చింది. రంగస్థలంమీద నర్తకులమీద కాక, విడియో కెమెరాతో నానారకాలుగానూ గారడీలు చేసేరు. ఆ విడియోలు మళ్ళీ చూడాలనిపించదు. కానీ వీటిదగ్గర కూడా అద్భుతం, అమోఘం, అద్వితీయం వంటి వ్యాఖ్యానాలు చూసేను. అంటే వ్యాఖ్యానాలు సదా నమ్మదగ్గవి కావు. కొన్ని మాత్రం ఆ విడియోలని మరింత ఆస్వాదించడానికి ఉపయయోగపడేవిగా ఉన్నాయి,  ఒప్పుకుంటాను. ఒక విడియోదగ్గర అరమండి వేసినప్పుడు పాదాలమధ్య ఎడం ఎక్కువగా ఉందని చూసేక, మిగతా నాట్యాలు చూసినప్పుడు అ అరమండీ గమనించడం మొదలు పెట్టేను.

నారాయణస్వామి గారు ఇచ్చిన లింకులు

shijith nambiar
https://www.youtube.com/watch?v=vfywRGscsXE

Raghunath Manet
https://www.youtube.com/watch?v=pgc_BpO9-C0

VP Dhananjayan
https://www.youtube.com/watch?v=jQvVUbeshUc

Professor C.V. Chandrasekhar
https://www.youtube.com/watch?v=5vvyQODvoJ0

Renjith
https://www.youtube.com/watch?v=RkUgj32ZvcM

pavitra krishna bhat
https://www.youtube.com/watch?v=RaxRYI6Pogw

—-

నాకథ నడుస్తున్న చరిత్ర లింకు ఇక్కడ

తా.క. – సెప్టెంబరు 22, 2016. నారాయణస్వామి మగ నర్తకులు టపాకి లింకు ఇక్కడ

000

(సెప్టెంబరు 8, 2016)

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

2 thoughts on “భరతనాట్యం నర్తకులు”

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.