భారతరత్న గానకళావిదుషీమణి యం.యస్. సుబ్బలక్ష్మి గారి శతజయంతి

సంగీతకళానిధి యం.యస్. సుబ్బలక్ష్మిగారి నూరవ జన్మదినం, సెప్టెంబరు 16. సంగీతాభిమానులకు పర్వదినం. United Nations శతజయంతి స్టాంపు ఆగస్ట్ 15, 2016 తేదీన విడుదల చేసేరని ఇప్పుడే తెలిసింది.

ms-stampఆ స్టాంపు విడుదల చేసిన సందర్భం విడియో ఇక్కడ

ఈ అద్వితీయ గాయనిీమణి, మహా మనీషిగురించి తెలుగు వికిపీడియోలో చూడవచ్చు, లింకు ఇక్కడ

ఆ అనుపమ విద్వాంసురాలిగురించి చెప్పడానికేమీ లేదు కనక వారి అరుదైన సంగీతం మీముందు ఉంచుతున్నాను. ఈ విడియోలు అన్నీ live కచేరీలనుండి సంగ్రహించి యూట్యూబుద్వారా ఆమె అభిమానులు అందించినవి. నేను 60, 70 దశకాల్లో తిరుపతిలో ఆమెగానం విన్నానేమో కానీ మళ్ళీ ఇప్పుడు ఈ లైవ్ సంగీతం వినే భాగ్యం కలిగింది. మీరు కూడా అలాగే ఆనందించగలరన్న ఆశతో ఇక్కడ లింకులు ఇస్తున్నాను. యూట్యూబువారికి, అక్కడ అప్లోడ్ చేసినవారికీ నా కృతజ్ఞతలు.

 1. 1966లో సుబ్బలక్ష్మి గారు యునైటెడ్ నేషన్స్ ఎసెంబ్లీలో కచేరీ చేసేరు. అలాటి గౌరవం పొందిన దక్షిణ భారత గాయని ఆమె ఒక్కరే నాకు తెలిసినంతవరకు. ఆ సందర్భంగా ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూ కి లింకు ఇక్కడ. (తమిళంలో ఆమె ఏమి చెప్పేరో నాకు అర్థం కాలేదు కానీ వినడానికి ఆహ్లాదరకంగా అనిపించింది. మీకు తెలిస్తే చెప్తే మరింత ఆనందం.)
 2. ఆమె 81 ఏట తన ప్రత్యేకమైన కంఠమాధుర్యంతో గానం చేసిన వాతాపి గణపతిం భజే వినండి.  ఇక్కడ ఇచ్చిన కృతులు అన్నీ ఆమె 80, 90 దశకాలలో పాడినవే, అన్నీ ప్రత్యక్షంగా ఆమెగానం చూస్తూ ఆనందించ అనువుగా ఉండడం మన అదృష్టం

3. పాహి శ్రీపతే మోహనమూర్తే. స్వాతి తిరుణాల్ కృతి, 1988.

https://www.youtube.com/watch?v=aX14Ol4SaJU 5

4. పంతువరాళి ఆలాపన, 1988.

https://www.youtube.com/watch?v=wzmk2kHOidY

5. శ్రీ పార్వతీ పరమేశ్వరౌ

https://www.youtube.com/watch?v=UHvbxbCQiJ

6. మీరా భజన్. 1983

https://www.youtube.com/watch?v=UaW9UKYW-fA

చిన్న పిట్ట కథ. కొంత పాడేక, సుబ్బలక్ష్మి, రాధ విశ్వనాథన్ ఇద్దరూ సాహిత్యం మరిచినట్టుంది. రెండు క్షణాలతరవాత జ్ఞాపకం తెచ్చుకుని ఏమీ జరగనట్టు హుందాగా పాడి పూర్తి చేసేరు.

రెండో మూడో లింకులు ఇద్దాం అనుకుంటూ మొదలు పెట్టేను కానీ ఉత్సాహం పట్టలేక కొంచెం అతి అయింది … 🙂 🙂 🙂

అతులిత పాండితీగరిమతో మన సంగీతానికీ దేశానికీ వన్నెలు కూర్చిన విద్వాంసురాలికి శతసహస్ర ప్రణామములతో,

భవదీయ

మాలతి

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

6 thoughts on “భారతరత్న గానకళావిదుషీమణి యం.యస్. సుబ్బలక్ష్మి గారి శతజయంతి”

 1. నాకు సంబంధించిన ఒక అద్భుత సంఘటన. ఒక శ్వేత అమెరికను వనిత మొరాకోలో పీస్ కోర్ లో పనిచేస్తూ అక్కడ పరిచయమైన ఒక ఫ్రెంచి దేశస్తుని వద్ద ఎమ్మెస్ ఎల్ పి రికార్డులు విని, ఈ సంగీతానికి సంబంధించిన నాట్యం ఏదైనా ఉందా అనడిగి, భరతనాట్యం గురించి తెలుసుకుని, ఇహ మళ్ళీ అమెరికా తిరిగి రాకుండా అక్కణ్ణించి అటే చెన్నై చేరుకుని కళాక్షేత్రలో భరతనాట్యం అభ్యసించింది. ఆవిడే నా నాట్య గురువు మార్చియా మాధవి మై. అలా ఎమ్మెస్ గాత్రం నా జీవితాన్ని ప్రభావితం చేసింది. ఇంకో తమాషా, ఎమ్మెస్ కి కోడలు అయిన ఆనంది రామచంద్రన్ గారు మాధవికి గురువుగారు, నాకు నా సహచరులకి కూడా ఆవిడతో కొంత సమయం గడిపే మహద్భాగ్యం దక్కింది.

  మెచ్చుకోండి

 2. About the point number 1, its part of an interview of her related to her experiences with Maha Periyava (Chandra Sekarendra Saraswathi) in which she explains about the incidence related to her UN concert.

  In brief when they arrived at US her voice almost got lost (గొంతు పట్టేసుకుంది). In that condition when she goes on to the stage and says OM to start the concert her voice comes back miraculously.
  That’s the grace of Maha Periyava.(She as well says it came in News Papers – May be some archivals of 1966 can be looked into ?)

  Video looks like mix of two events – One part of her experiences with Swami of Kanchi (taken later to Swami’s Mahasamadhi) and the other her singing of Maithreem bhajata at UN (btw, the lyrics are by Maha Periyava himself)

  జిలేబి

  మెచ్చుకోండి

 3. మీ స్మృత్యంజలి బావుంది. ఆవిడ కర్ణాటక సంగీతం అందరికి తెలియకపోయిన, సుప్రభాతం లాంటి భక్తి గీతాల వల్ల అందరికి సుపరిచితం. మన దేశఖ్యాతి ఖండాతరాలికి వ్యాప్తి చేసిన గొప్ప విదుషీమణి. ఈరోజు స్మరించుకోవటం సంతోషంగా ఉంది.

  మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s