మనలో మాట 29 – సోయా వడీ వ్యవహారం

అసలు ఓం ప్రథమం పేరుతోనే వచ్చింది గొడవ సోయా వడి అని. ఈమధ్య బలవర్ధకం అని సోయాతో చేసిన ఏ పదార్థం కనిపించినా గబగబ కొనేసి తినేస్తున్నాను.

dsc00193నిజం చెప్పొద్దూ. నిజంగా అది తిన్నపూట ఓపిక ఓ పది శాతం పెరుగుతున్నట్టే కనిపిస్తోంది.

ఇంతకీ వడీ అంటే వడియాలనుకున్నాను, మన ఔత్తరాహుల భాష గుర్తుకి తెచ్చుకుని. గుమ్మడొడియాల్లా వేయించుకోవచ్చని ముచ్చట పడిపోతూ ఇంటికి తీసుకొచ్చేను. తీరా వండుకొను విధానము ఆ పెట్టెమీద చూస్తే, చిన్న క్రతువులా ఉంది.

మొదట కడగమన్నారు. ఆ ఎండుముక్కలు నీళ్ళలో వేసేసరికి బట్టలుతుక్కునే washerలా నురగలు కక్కడం మొదలెట్టింది. ఛీ ఇదా నేను తినేది అనిపించింది. సరే మళ్ళీ కడిగీ పిడిచీ కడిగీ పిడిచీ ఇంక ఫరవాలేదని నాకనిపించేంతవరకూ సాగించి, ఆ తరవాత దాన్నేం ఏం చెయ్యడం అనుకుంటూ జాలం వెతికేను. టొమెటో, అల్లం, వెల్లుల్లి, నీరుల్లీ, పచ్చిమిరపకాయలూ, ఎండు మిరపకాయలూ, ధనియాలపొడి, ఆవాలూ, జీలకర్రా – ఇలా చెప్పుకుపోతుంటే, ఏంటో ఇన్ని తగలేసేక పచ్చగడ్డి కూడా రుచిగానే ఉంటుంది కదా అనిపించింది.

ఇంతకీ ఇవన్నీ జోడించి పావుగంటసేపు ఉడకబెడితే, వడియాలు మాత్రం నామొహంలాగే ఉన్నాయి. రబ్బరు నమిలినట్టుంది కానీ నోరూరించే రుచులేవీ తగల్లేదు జిహ్వకి.

సరే అదక్కడ వదిలేసి మిగతా వడియాలు మళ్ళీ సుబ్భరంగా ముప్ఫై మార్లు కడిగి, నీరంతా పిడిచేసి పళ్ళెంలో ఆరబెట్టేను. ఆ తరవాత బ్లెండరులో వేసి పొడి చేసిను.

మళ్ళీ ఆ పొడి మరో పెద్ద పళ్ళెంలో ఆరబెట్టేను.

మర్నాడు ఆ పొడిని రెండు భాగాలు చేసేను. పొయ్యి వెలిగించి, గిన్నెలో ఓ చెంచాడు నెయ్యేసి ఒక సగం పొడిని వేసి పచ్చివాసన పోయేవరకూ వేయించేను. తరవాత పంచదార, ఏలకపొడి వేసి మరి కొంచెంసేపు వేయించేను. చిటికెడు నోట్లో వేసుకు చూస్తే అబ్భ ఎంత బావుందో. చాలా ఆనందపడిపోయేను మొత్తంమీద ఆ వడియాలని ఉద్దరించి ఉపయోగించగలిగినందుకు. చెప్పేనా నాకు ఏది గానీ ఊరికే పారేయడం ఇష్టం ఉండదు. అలా అనేక ప్రయత్నాలు చేసి అప్పటికీ బాగులేకపోతే అప్పుడు పారేస్తాననుకో, అది వేసే సంగతి.

ఇంక రెండో భాగం ఉంది కదా. దాన్ని మళ్ళీ మరో గిన్నెలో చెంచాడు నూనె వేసి వేయించి, బాగా వేగేక చిటికెడు ఉప్పూ, కారం చల్లి తీసి వేరే పెట్టేను. అది కూరల్లో చల్లడానికి. ఎలాగోలాగ తినడం కదా ధ్యేయం మరి.

ఈరోజు పొద్దున్నే కాఫీ అయేక, ఐస్క్రీం తినడానికి తీసేను. దాన్ని ఆరోగ్యకరం చేయాలి కదా అని నిన్న తయారు చేసిన సోయా పొడి చల్లేను. బావుంది చల్లగా, తియ్యగా, ఉప్పగా, కారంగా. ఇక్కడ కొన్ని ఖాద్య పదార్థాలు చూసేను – sweet and sour, sweet and salty … లాటివి. ఈ ఉదయం నా breakfast కూడా అంతే cool and hot.

000

(నవంబరు 4, 2016)

సంబంధిత లింకులు

 1. శరీరమే చెప్తుంది ఏం కావాలో
 2. నా ఆలోగ్య సూత్రాలు
ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

4 thoughts on “మనలో మాట 29 – సోయా వడీ వ్యవహారం”

 1. నిజం చెప్పాలంటే ఈ చంక్స్ తో చేసే మసాలా కూర బావుంటుందండీ.
  వీట్ని నానేసి అలా పైపైన వాడ్చండి. మరీ నానినా, జిగురొస్తుంది. ఎందుకంటే పిండి వుంటుంది కదా..
  2, 3 సార్లు నీళ్ళు వొంపి, ఆ తర్వాత నీళ్ళల్లోంచి తీసి పైపైన పిండితే చాలు.
  ఎంతసేపు నానేసారు?
  కూరైతే బావుంటుంది.
  బిర్యానీ లోకి కూడా బావుంటుంది.
  ఈ కర్రీ, తెల్ల అన్నంలోకి, మసాలా రైస్ లోకీ, బిరియానీ లోకి, పూరీ చపాతీల్లోకి కూడా చాలా యెమ్మీ గా వుంటుంది.
  🙂
  ఐతే, మీరన్నట్టు – అలవాటుండాలి.
  కాకరకాయ ఎంత రుచిగా వుంటుందని? ఆ మాట చెప్పినప్పుడు అబ్బో ఆ చేదా అని అంటారు కొందరు.
  అలానే ఇదీనూ.
  🙂

  మెచ్చుకోండి

నాటపా మీకు నచ్చిందో లేదో చెప్తే చాలు. బాగులేకపోతే ఎందుకు లేదో చెప్పినా సంతోషమే.

Please log in using one of these methods to post your comment:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s