కంప్యూటరులో తెలుగులిపి

రెండు రోజులక్రితం అనుకోకుండా ఒక మెయిలు వచ్చింది తెలుగు కంప్యూటరు విజ్ఞానంలో విశేషకృషి చేస్తున్న వీవెన్ దగ్గర్నుంచి.

telugu-lipi-soundaryam1ఆయన నాబ్లాగుకి పతాకశీర్షిక మరింత అందంగా తయారు చేసి పంపేరు నేను అడక్కుండానే. ఆమీద, నాకోరికమీద, కంప్యూటరులో తెలుగులిపి ఉపయోగించుకోడానికి అవుసరమైన సమాచారం ఇచ్చారు. ఆయన నాకు పంపిన మెయిలు యథాతథంగా ఇక్కడ పెడుతున్నాను. మొదటి టపా ఆయనదే కనక, మీకు ఎటువంటి సందేహాలున్నా, ఆయనని ఆ టపాచివర మీసందేహాలు అడగవచ్చు.

వీవెన్ అందించిన సమాచారం –

ఐఫోనులో తెలుగులో టైపు చెయ్యడం గురించి ఒక టపా వేసాను. ఇందులో చెప్పిన ప్రక్రియ తర్వాత ఫోనులో ఎక్కడైనా తెలుగులో టైపు చేసుకోవచ్చు. ఇలానే ఆండ్రాయిడ్ ఫోనుల్లో కూడా (జీబోర్డు, అంటే గూగుల్ కీబోర్డు మరియు గూగుల్ ఇండిక్ కీబోర్డు ఆప్స్ ద్వారా) తెలుగులో టైపు చేసుకోవచ్చు.

ఇక కంప్యూటర్లలో కాపీ-పేస్టు గొడవ లేకుండా ఎక్కడైనా తెలుగు టైపు చెయ్యగలిగే వీలుంది. విండోసు కంప్యూటర్లలో గూగుల్ ఇన్‌పుట్ టూల్స్ కానీ ప్రముఖ్IME గానీ వాడుకోవచ్చు. కాస్త ధైర్యవంతులు  ఇన్‌స్క్రిప్ట్ కీబోర్డు లేయవుటు  నేర్చుకుని దాన్నీ వాడుకోవచ్చు.

—-

నాబ్లాగుకి పతాకశీర్షిక, ఈ సమాచారం అందించిన వీవెన్ గారికి ధన్యవాదాలు.

రచయిత: మాలతి

మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

4 thoughts on “కంప్యూటరులో తెలుగులిపి”

 1. బహుకాలంగా ప్రముఖ్ IME వాడుతున్నాను యే యిబ్బందులూ‌ లేకుండా. ఈ‌ ప్రముఖ్ వాడటానికి దాన్ని download చేసుకొని నేరుగా టపటపా తెలుగులో టైప్ చేసెయ్యటమే – ఏ విధమైన installation కూడా అవసరం‌ లేదు. ఇది ప్రస్తుతం 23 భాషల్ని హాయిగా support చేస్తోంది.

  మెచ్చుకోండి

 2. వీవెనుడా! ట్రిక్కులదుర
  హో ! వర మైవచ్చెనౌ సహోదరి గానన్
  రోవర్వోలె టపాలిక
  రావలె తూలిక సొబగుల రాణి జిలేబీ 🙂

  ఇండిక్ కీ బోర్డు ప్రయత్నించి చూడండీ ; మల్టిపల్ లాంగ్వేజెస్ సెట్ చేసుకుని సులభంగా లిపి change कर् सक्ते है 🙂

  ಜಿಲೆಬಿ 🙂

  మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు , తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరిస్తాను.

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.