నాకు ఇష్టమైన పాతకథలు శీర్షిక పరిచయం

నేను కథలు రాయడం మొదలుపెట్టినకాలంలోనో, అంతకు కొంచెం ముందో ప్రసిద్దులయిన రచయితలు, సుమారుగా 50, 60 దశకాలనాటి రచయితలు, కొందరు ఈనాటికీ నామనసులో పచ్చగా గుర్తుండిపోయేరు. వారి కథలూ, వాటిలో కొన్ని వాక్యాలు నామనసులో చెరగని ముద్రలు వేసేయి. అలాటి కథలు “నాకు ఇష్టమైన పాతకథలు” ఉపశీర్షికతో నాకు జ్ఞాపకం ఉన్నవి కొన్ని మరోమారు తలుచుకోడానికి నిశ్చయించుకున్నాను. ముఖ్యంగా ఈనాటి పాఠకులకు కొత్త అయినవి, పిడియఫ్ లో దొరికేవీ చూసుకుని, నాకు తోచిన నాలుగు మాటలు రాసి, పిడియఫ్. కాపీ జత చేస్తాను. కొన్ని కాపీలు స్పష్టంగా లేకపోవచ్చు. ఆసక్తిగలవారు కొంచెం శ్రమ తీసుకునైనా చదువుతారనే అనుకుంటున్నాను. కథ జత చేస్తాను కనక కథంతా చెప్పేసి, ఇంక చదవఖ్ఖర్లేదు అని మీకు అనిపించకుండా జాగ్రత్త పడతాను.

ఇక్కడ ఒక హెచ్చరిక. నేను పరిచయం చేసే “కథ న భూతో న భవిష్యతి, ఇదే ప్రపంచంలో అన్ని భాషలలోకీ అనువదించవలసిన అత్యుత్తమకథ” అని కాదు. అవి నన్ను ప్రభావితం చేసేయి అని మాత్రమే అంటున్నాను. ఆ కథలలో నన్ను ప్రత్యేకించి ఆకట్టుకున్న అంశాలు స్పృశించి, కథను మీముందు ఉంచుతాను. మీ అభిప్రాయాలు మీరు నిస్సందేహంగా చెప్పవచ్చు. మీ అభిప్రాయాలు కథకి మాత్రమే పరిమితం చేయవలసిందిగా కోరుతున్నాను.

ఆరుద్రగారి సీతాకోక చిలుకతో మొదలు పెడుతున్నాను. కథకి లింకు ఇక్కడ

000

(ఫిబ్రవరి 9, 2017)

 

 

 

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

2 thoughts on “నాకు ఇష్టమైన పాతకథలు శీర్షిక పరిచయం”

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు, తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరింపబడును.

Please log in using one of these methods to post your comment:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s