పేరు పడిపోవునా?

రాస్తూ ఉండకపోతే పేరు పడిపోతుందని

రాస్తూండడంకోసం అదేపనిగా రాసుకుపోతుంటే  

రాతలు “అడ్డమైన”రాతలమయమయిపోయి నా పరువు తీస్తున్నాయి.

ఇలా రాయకపోతేనేం, ఇలా రాయడం ఎందుకు అన్న ప్రశ్నలు కొరుక్కుతినేస్తున్నాయి.

“రాస్తూండకపోతే పేరు పడిపోతుంది” అన్న చింత ఇసుమంతైనా లేని

కవులు, రచయితలు రాసుకుంటూపోయేరు. రాసేసి పోయేరు.

వారు లేరు, వారి కథలున్నాయి నిశ్చలంగా నిలిచి వెలిగేుతున్న నిరతాగ్నిశిఖల్లా!

ఇనప్పెట్టిలో దాచిపెట్టినంత భద్రంగా!

చదువుతున్నాను, చదువుకుంటున్నాను

చదువుకుంటూ పోతున్నాను.

రాయకపోతే పేరు పడిపోతుందన్నమాట మరచి.

000

(మార్చి 13, 2017)

 

 

 

ప్రకటనలు

రచయిత: మాలతి

పేరు నిడదవోలు మాలతి. మంచి తెలుగులో రాసిన కథలు చదువుతాను. చక్కని తెలుగులో రాయడానికి ప్రయత్నిస్తాను.

2 thoughts on “పేరు పడిపోవునా?”

  1. రాసినా పేరుబడిపోతుంది – రాస్తారని
    రాయకపోయినా పేరుబడిపోతుంది – రాయరని
    పేరు పడినా, పేరుబడినా – రాసేది రాయకమానరు, రాయనిది రాశామనరు

    మెచ్చుకోండి

ప్రస్తావించిన అంశానికి ప్రత్యక్షసంబంధంగల వ్యాఖ్యలు, తెలుగులో రాసినవి మాత్రమే అఁగీకరింపబడును.

Please log in using one of these methods to post your comment:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s